Suryaa.co.in

Political News

అధికార దుర్వినియోగానికి పరాకాష్ట

“వికేంద్రీకరణ – అభివృద్ధి – పాలన సౌలభ్యం”పై అవగాహన సర్వే అంటూ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలోని కళాశాలల అధ్యాపకులు, విద్యార్థుల నుండి దురుద్దేశంతో కూడిన ప్రశ్నావళితో అభిప్రాయ సేకరణ అయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ద్వారా అత్యవసరమంటూ మెసేజెస్ పంపి చేయడం అత్యంత గర్హనీయం, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.

ప్రశ్నావళిలో పేరు, లింగం, వయసు, విద్య, ఉపాథి, మతం వివరాలతో పాటు ఒక ప్రశ్నావళిని జత చేసి, సమాధానాలు వ్రాయమన్నారు.

1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది (తెలంగాణ విభజనకు ముందు)

ఎ. విజయవాడ
బి. హైదరాబాద్
సి. కర్నూలు
డి. తిరుపతి

2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

3. రాజధాని నగరం కావడం వల్లనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

4. హైదరాబాద్ అభివృద్ధి మరింత ఉపాధి అవకాశాలు దోహదపడిందని భావిస్తున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

5. హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయడం వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి కేంద్రీకృతమైనదని మీరు భావిస్తున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

6. రాష్ట్రంలో ఒక్క భాగమే అభివృద్ధి చెందడం మంచిదని మీరు భావిస్తున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

7. ఒక వ్యక్తిగా, మీరు హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్, కోర్టులు మొదలైన వాటిని సందర్శించడానికి ఎన్నిసార్లు సందర్శించారు?

ఎ. ఎప్పుడూ సందర్శించలేదు
బి. 1-5 సార్లు
సి. 6-20 సార్లు
డి. 21 పైన సార్లు

8. రాష్ట్ర విభజన తర్వాత, మీరు ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం, కోర్టులు మొదలైన వాటిని సందర్శించడం కోసం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని “అమరావతి”ని ఎన్నిసార్లు సందర్శించారు?

ఎ. ఎప్పుడూ సందర్శించలేదు
బి. 1-5 సార్లు
సి. 6-20 సార్లు
డి. 21 పైన సార్లు

9. వ్యక్తిగా, మీరు ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్, కోర్టులు మొదలైనవాటిని సందర్శించడం కోసం జిల్లా కేంద్రాన్ని ఎన్నిసార్లు సందర్శించారు?

ఎ. ఎప్పుడూ సందర్శించలేదు
బి. 1-5 సార్లు
సి. 6-20 సార్లు
డి. 21 పైన సార్లు

10. 2014లో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జిల్లాల సంఖ్య ఎంత?

ఎ. 10
బి. 13
సి. 20
డి. 26

11. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య ఎంత?

ఎ. 10
బి. 13
సి. 20
డి. 26

12. చిన్న జిల్లాలు సామాన్య ప్రజలకు సహాయపడతాయని మీరు అనుకుంటున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

13. “చిన్న జిల్లాల” కారణంగా జిల్లా అంతటా జిల్లా అధికారుల (కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులు, మొదలైనవి) సేవా స్థాయిలు పెరుగుతాయని మీరు భావిస్తున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

14. జిల్లా ప్రధాన కార్యాలయంలో ప్రజలు తమ పని కోసం తక్కువ దూరం వెళ్లేందుకు చిన్న జిల్లాలు సహాయపడతాయని మీరు అనుకుంటున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

15. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

16. కోవిడ్ సమయంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఉపయోగపడిందని మీరు భావిస్తున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

17. పాలన వికేంద్రీకరణ ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా?

ఎ. అవును
బి. కాదు
సి. తెలియదు

18. ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వికేంద్రీకరణ వల్ల సాధారణంగా ఉదహరించగలిగిన ప్రయోజనాలు ఏమిటి?

ఎ. జవాబుదారీతనం మరియు పారదర్శకత పెరుగుదల
బి. మరింత సమర్థవంతంగా సేవలు అందజేయడం
సి. మెరుగైన ప్రాంతీయ అభివృద్ధి
డి. పైన ఉన్నవన్నీ

19. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతాలకు ఆర్థికాభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు ఎక్కువగా అవసరమవుతాయి?

ఎ. రాయలసీమ ప్రాంతం
బి. ఉత్తర ఆంధ్ర ప్రాంతం
సి. కోస్టల్ ఆంధ్ర ప్రాంతం
డి. అన్ని ప్రాంతాలపై సమానమైన శ్రద్ధ అవసరం

20. మీ ప్రాంతంలో అభివృద్ధి కోసం పరిష్కరించాల్సిన అత్యంత ముఖ్యమైన సమస్యలు ఏమిటి?

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

LEAVE A RESPONSE