-అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు
-రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు
– టీడీపీ యువనేత చింతకాయల విజయ్
అన్న పూర్ణాంధ్రప్రదేశ్ కాస్త అరాచకాంధ్రప్రదేశ్ గా మార్చారు.స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఆంధ్రా వాడికి గౌరవం లేకుండా చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. ఖూనీ కోరు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తామంటే నాటకాలాడుతూ దాక్కుంటున్నారు.
జీవో నెం.1 పేరుతో బ్రిటీష్ కాలం నాటి జీవోలు తెచ్చారు.మైకులు, కుర్చీలు లాక్కుంటున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తే నీకు ఏం లాగాలో మాకు తెలుసు. చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్న పోలీసులపై మనం అధికారంలోకి వచ్చాక చట్ట ప్రకరాం చర్యలు తీసుకోవాలి. డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని హైకోర్టు జడ్జి స్వయంగా అన్నారు.