Suryaa.co.in

Andhra Pradesh

పంచ్ ప్రభాకర్ అరెస్ట్ సంగతి ఏం చేశారు?

– సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు

అమరావతి : హైకోర్టు న్యాయ‌మూర్తులపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసుపై సోమ‌వారం నాడు ఏపీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

ఈ విచార‌ణ సంద‌ర్భంగా విదేశాల నుంచే జ‌డ్జీల‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌తో కూడిన పోస్టుల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టిన వైసీపీ ఎన్నారై విభాగం స‌భ్యుడు పంచ్ ప్ర‌భాక‌ర్ అరెస్ట్ ఎంత‌వ‌రకు వ‌చ్చిందని సీబీఐ అధికారుల‌ను హైకోర్టు ప్ర‌శ్నించింది.

పంచ్ ప్ర‌భాక‌ర్‌ను అరెస్ట్ చేసే దిశ‌గా ఇప్ప‌టిదాకా ఏమేం చ‌ర్య‌లు తీసుకున్నార‌ని కోర్డు ప్ర‌శ్నించింది.కోర్టు ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన సీబీఐ అధికారులు.. పంచ్ ప్ర‌భాక‌ర్‌ను అరెస్ట్ చేసే దిశ‌గా ఇప్ప‌టికే చ‌ర్య‌లు ప్రారంభించామ‌ని, అందులో భాగంగా కేంద్ర హోం శాఖ‌తో పాటుగా విదేశాంగ శాఖ‌ల‌కు లేఖ‌లు రాశామ‌ని తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు వ‌చ్చేందుకు మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని కూడా సీబీఐ తెలిపింది. ఈలోగా జ‌డ్జీల‌పై సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా తొల‌గించాల‌ని సీబీఐ అధికారుల‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.జియో బ్లాకింగ్ ఇంజెక్షన్‌ ఆర్డర్‌ను ఇచ్చే అంశంపై విచారణ చేపడతామన్న హైకోర్టు.. కేసు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

LEAVE A RESPONSE