రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు చేయవద్దంటూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు సస్పెండ్ చేసింది.జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.జీవో నెంబర్-1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ జీవోకు వ్యతిరేకంగా సీపీఐ కాగా, కార్య దర్శి రామకృష్ణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.