హైకోర్టు జీవో నెంబర్ 1 ని సస్పెండ్ చేయడం ప్రజాస్వామవాదులందరికి సంక్రాంతి పండుగ లాంటిది
– జీవో నెం.1ను ఉపసంహరించుకోవాల్సిదిగా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
హైకోర్టు జీవో నెంబర్ 1 ని సస్పెండ్ చేయడం రాష్ట్రంలోని ప్రజాస్వామవాదులందరికి సంక్రాంతి పండుగ లాంటిదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి సంక్రాంతి పండుగ చేసుకునేలా హైకోర్టు సస్పెన్షన్ ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్న జీవో నెంబర్ 1ను ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకిస్తున్నారు.
ఇటువంటి సమయంలో హైకోర్టు ఈ జీవోను సస్పెండ్ చేయడం హర్షించదగ్గ పరిణామం. ఈ సస్పెన్షన్ తాత్కాలికమైనప్పటికీ కోర్టులు జీవోను తప్పు పట్టడమనేది సిగ్గుచేటు. జగన్ ఇచ్చిన జీవో నెంబర్ 1లో చట్టాన్ని ఎలా ఉపయోగించాలనేది స్పష్టంగా పేర్కొనలేదు. 1861 యాక్టు అనేది దేశ సమగ్రతకు, లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది. దీన్ని సమావేవాలకు ఇబ్బంది వచ్చినప్పుడు గతంలో వాడేవారు. జగన్.. ప్రతిపక్ష నాయకులపై ఒక ఆయుధంగా ఈ యాక్టును వాడారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై, మున్సిపల్, పంచాయతీ రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదనడం ఎంతవరకు సమంజసం?
ఒకవేళ చేయదలచుకుంటే పర్మిషన్ తీసుకోవాలనడం ఇబ్బందులు పెటటమే. సభలు, సమావేశాలకు అనుమతి తీసుకున్నా.. వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. రోడ్లమీద సాధ్యంకాని పరిస్థితుల్లో ప్రభుత్వం చూపిన ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే సభలు పెట్టుకోవాలి. ఇది జీవో సారాంశం. ర్యాలీలు, ఊరేగింపుల వల్లనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న సంగతి జగన్ గ్రహించాలి. ప్రజాస్వామ్యయుత దేశంలో నిరసనలు తెలుపుకునే హక్కు ఉంది. దాన్ని హైవేపై చేయడానికి వీల్లేదు అనే నిబంధన విధించడం సరికాదు.
జగన్ ఎక్కడికైనా వెళితే బారికేడ్లు, పరదాలు కట్టడం అతనిలోని భయాన్ని బట్టబయలు చేస్తోంది. ఇలా ప్రపంచంలో ఎక్కడా లేదు. నార్త్ కొరియాలో కిమ్ ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలకు సభలకు వెళితే సెక్యురిటీ కూడా ఉండేదికాదు. నాయకుడు బయటికి వస్తే జనం రాకుండా చేసే పరిస్థితి ఎక్కడా లేదు. జగన్ ఒక్కడి కోసం 16వందల మంది పోలీసులు పహరా కాయడం ప్రజా నిధులు దుర్వినియోగమే. ర్యాలీలు ఊరేగింపులు చేసుకోవడం ప్రతిపక్షాల చర్యల్లో భాగమే. అందుకు అనుమతి ఇవ్వననడంఅది అప్రజాస్వామ్యమౌతుంది. అడిషనల్ డీజీ, అడ్వకేట్ జనరల్ లు పాదయాత్రలకు పర్మిషన్ ఇస్తాము.
దానికి ప్రభుత్వ అనుమతి అవసరంలేదంటున్నారు. పాదయాత్రకు, ర్యాలీకి తేడాలేదు. జగన్ అధికారంలోకి రాక మునుపు సందుల్లో, గొందుల్లో కొన్ని వందల సభలు పెట్టారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. నాయకుడు రోడ్డుపైకి వస్తే జనం రావడం సహజమే. మీటింగ్ లు పెట్టే అధికారం మీకు లేదు, చట్టం ఒప్పుకోదు అనడం అసమంజసం. దేశ ఉన్నతికి, గుర్తింపుకు కారణం డెమొక్రటిక్ రిపబ్లిక్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజలు, ప్రతిపక్షాలు వినియోగించుకుంటూ వస్తు్న్నారు.
ఈ స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. రాష్ట్ర ప్రజలందరూ రోడ్డుమీదికి వస్తే పోలీసులు కంట్రోల్ చేయలేరు. కొన్ని దేశాల్లో ఇలా జరుగుతోంది. దేశ నాయకత్వంపై తిరుగుబాటు జరుగుతోంది. ఈ పరిస్థితులు రాష్ట్రంలో తెచ్చుకుంటే ప్రజాస్వామ్యవాదులుగా ప్రభుత్వాన్ని హెచ్చురిస్తున్నాం. ఇప్పటికైనా జీవో నెంబర్ 1ని ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. ఈ జీవో ఉపసంహరణకు మాతో కలిసి వచ్చే ప్రతిపక్షాలు, ఈ చట్టం రద్దును కోరుతూ పోరాటంలో పాల్గొనేవాకికి అభినందనలు తెలుపుతున్నాం.
అనేక సమ్మెలను కోర్డులు రెగ్యులరైజ్ చేసింది. భవిష్యత్తులో కోర్టు ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా దేశంలో సమ్మెలు ఆగలేదు. సమైక్యాంధ్ర సమ్మెను కూడా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ప్రజాస్వామ్యమనే సిద్ధాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు, ప్రజలు అందరిపై ఉంది. ప్రజలు చైతన్యవంతులయ్యారు, ప్రజా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం దీన్ని ఓర్వలేక జీవో నెం.1 ఇచ్చింది. ఇప్పటికైనా ఈ జీవోను ఉపసంహరించుకోవాల్సిదిగా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు.