Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత

– ఎమ్మెల్యే రోజాతో విజయసాయి రెడ్డి భేటీ

మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మెదటి స్థానంలో నిలుస్తుందని రాజ్యసభ సభ్యులు. వైకాపా అనుబంధ విభాగాల ఇన్చార్జ్ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేసేదిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.

గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజాతో పార్టీ బలోపేతానికి సంబందించి పలు విషయాలు చర్చించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్ది రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, వారికి అందిస్తున్న పథకాల పై విస్తృత ప్రచారం అవసరమని అన్నారు. అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కమిటీ అధ్యక్షుడు పొట్నూరు గౌతం రెడ్డితో పలు విషయాలపై చర్చించారు.

అనంతరం అంగన్వాడీ యూనియన్ నేతలు తమ సమస్యలపై అందించిన వినతి పత్రాన్ని స్వీకరించారు. యువజన, శ్రామిక, రైతు పార్టీ (వైఎస్ఆర్) పేరులోనే కార్మిక, ఉద్యోగ పక్షాలకు తమ పార్టీ ఇస్తున్నా ప్రాధాన్యత అర్దమవుతోందని అన్నారు.

LEAVE A RESPONSE