- కావలి ఖ్యాతిని దశ దిశల వ్యాప్తి చెందే విధంగా సెల్ఫీ పాయింట్
- పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్.. భారతీయుడు సగర్వంగా సెల్యూట్ చేసే జాతీయ జండా ఆగస్టు 15న జాతికి అంకితం
- ఆగస్టు 15న కావలిలో పండగ వాతావరణం
- 100 అడుగుల జాతీయ జెండాతో కావలి కి ప్రత్యేక గుర్తింపు
100 అడుగుల జాతీయ జెండాతో, మహనీయుల చిత్రపటాలతో కావలి కి ప్రత్యేక గుర్తింపు రానుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరిలో జాతీయభావం పెంపొందేలా కావలి పట్టణంలోని ఎంఎం బేకరీ సెంటర్ లో అన్న క్యాంటిన్ ఎదురుగా నిర్మాణం చేపడుతున్న 100 అడుగుల జాతీయ పతాకంకు సంబందించిన పనులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పరిశీలించారు. కావలి పట్టణానికి ఒక ఐకానిక్ ఉండేలా ఎమ్మెల్యే సొంత నిధులతో, స్వీయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ కు తగు సూచనలు చేశారు. డిజైన్ ప్రకారం త్వరితగతిన పనులు చేపట్టి ఆగష్టు 15న ప్రారంభం అయ్యేలా చూడాలని తెలిపారు.