Suryaa.co.in

Andhra Pradesh

కోటప్పకొండలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ ఘటన

సిబ్బంది తీరుపై భక్తుల ఆగ్రహం

మహిమాన్విత పుణ్యక్షేత్రమైన కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి కి నిత్య కైంకర్యాలకు వినియోగించే నాగ హారతి( వెండి) గత ఐదు రోజులుగా కనిపించకపోవడంతో అర్చకస్వాములు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది స్వామివారికి హారతి కోసం వినియోగించే నాగ హారతి కనిపించటం లేదని అర్చక స్వామి గుర్తించడంతో దానిని స్వామి వారి గర్భగుడి నుంచి వచ్చే నిర్మాల్యం పడవేసే అడవి ప్రాంతంలో వెతుకులాట సాగించారు అక్కడ దొరికింది దీనిపై భక్తులు మండిపడుతున్నారు.

స్వామి వారిపై విశ్వాసము నమ్మకంతో భక్తులు సమర్పించే వెండి బంగారు వస్తువుల పట్ల ఇలా నిర్లక్ష్యంగా ఉండటంపై భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటుంద. కావునా ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులను అర్చక స్వాములను భక్తులు కోరుకుంటున్నారు. వెండి నాగ హారతి రెండు నెలల క్రితం బాపట్ల జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన ఒక భక్తుడు సమర్పించడం జరిగింది రెండు రోజుల క్రితం భక్తుడు స్వామి వారిని దర్శించుకోవడానికి రాగా నాగ హారతి స్వామి వారికి హారతి ఇవ్వడం లేదు ఎందుకని ప్రశ్నించగా పోయిందని గుర్తించారు…!!

LEAVE A RESPONSE