•రాష్ట్రమహిళల రక్షణబాధ్యతలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రి అమిత్ షాని విజ్ఞప్తిచేస్తున్నాం •రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతమంది కామాంధుల్ని కఠినంగా శిక్షించారో పూర్తివాస్తవాలతో డీజీపీ తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి
• రాష్ట్రంలో మహిళారక్షణ గాలిలోదీపం అనడానికి తాడేపల్లిలో జరిగిన దారుణమే నిదర్శనం
• అంధురాలైన మైనర్ దళితబాలికను అతికిరాకతకంగా నరికిచంపితే జగన్ రెడ్డిలో చలనంలేదు
• ప్రత్యేకవిమానాల్లో పదేపదే ఢిల్లీవెళ్లే జగన్, తనకేసులు, బాబాయ్ హత్యకేసుగురించి తప్ప, ఏనాడూ దిశచట్టానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్నినిలదీసిందిలేదు
• బాలికను హతమార్చిన దుర్మార్గుణ్ణి ప్రభుత్వం వెంటనే ఉరితీయాలి
• మహిళల మానప్రాణాలు బలితీసుకున్న దుష్టుల్లో ఎంతమందిని కఠినంగా శిక్షించారో చెబుతూ, పూర్తివాస్తవాలతో డీజీపీ శ్వేతపత్రం విడుదల చేయాలి
-తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు వంగలపూడి అనిత
రాష్ట్రంలో ఆడబిడ్డల మానప్రాణాలకు ఎందుకు రక్షణలేకుండా పోయిందో, దిశాచట్టం, దిశాపోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసుల్ని ఏర్పాటుచేశానంటున్న జగన్ మహిళల మానప్రా ణాలను ఎందుకు కాపాడలేకపోతున్నాడో, దారుణాలకు ఒడిగడుతున్న దుర్మార్గుల్ని ఎందుకు కఠినంగా శిక్షించలేకపోతున్నాడో సమాధానంచెప్పాలని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. తన తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటుదూరంలో అంధురాలైన దళితబాలిక అతికిరాతకంగా చంపబడితే, ముఖ్యమంత్రి లో చలనంలేదని, హోంమంత్రి, డీజీపీ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహ రించారని, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ వైసీపీ అధికారప్రతినిధిలా బాలికకుటుంబంతో బేరసారాలకు దిగిందని అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. జూమ్ ద్వారా సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడినవివరాలు.. క్లుప్తంగా ఆమె మాటల్లో నే మీకోసం..!
“రాష్ట్రంలో మహిళారక్షణ గాలిలోదీపమైంది అనడానికి తాడేపల్లిలో జరిగిన దారుణమే నిదర్శనం. అంధురాలైన మైనర్ దళితబాలికను అతికిరాకతకంగా నరికిచంపితే జగన్ రెడ్డిలో చలనంలేదు. హోంమంత్రి, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్, డీజీపీ ఎవరూ సకాలంలో స్పందించలేదు. తన ప్యాలెస్ కు కూతవేటుదూరంలో దారుణం జరగడం ముఖ్యమంత్రికి తలవంపులు కాదా? బాలిక ఆక్రందనలు, మృతురాలి తల్లిదండ్రుల రోదన జగన్ కు వినిపించలేదా? తమబిడ్డను చంపినవాణ్ణి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి వేడుకుంటోంది. ముఖ్యమంత్రే నేరస్తుడని తెలియక ఆ అమాయకు రాలైన తల్లి ఇంకా ఈకసాయి ప్రభుత్వాన్ని నమ్ముతోంది. సొంతతల్లిని, చెల్లినే తన స్వార్థానికి వాడుకొని వదిలేసిన జగన్, తనబిడ్డకు న్యాయంచేస్తాడనుకుంటోంది.
బేరసారాలు ఆడటానికే మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ ఉంది
“ప్రభుత్వం తరుపున 10లక్షలిస్తాం.. వాటితో జీవితాంతం బతికేయండి” అని అంధ బాలిక కుటుంబంతో బేరసారాలు ఆడటానికే మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ విజయవాడ ఆసుపత్రికి వెళ్లింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగిన ప్రతిసారి బేరసారాలు చేస్తూ, బెదిరింపులకు దిగడమే ఆమెపనిగా పెట్టుకుంది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు సిగ్గుందా.. అసలు ఆమెమహిళా కమిషన్ ఛైర్ పర్సనా… లేక వైసీపీ అధికార ప్రతినిధా? జగన్ కు ఓటేసిన పాపానికి, మానప్రాణాలకు రక్షణలేక భయంతో మహిళ లు రాష్ట్రం విడిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అమాయకబాలికను బలిగొన్న దుర్మార్గుణ్ణి జగన్ ప్రభుత్వం వెంటనే ఉరితీయాలి. అలాచేస్తేనే కామాంధుల్లో భయం మొదలవుతుంది. రమ్య, అనూష, స్నేహలత లాంటి యువతుల్ని చంపినవాళ్లను ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షించనందునే రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణలేకుండా పోయింది.
తనఅవినీతికేసులు, బాబాయ్ హత్యకేసునుంచి బయటపడేయాలని వేడుకోవడంతప్ప, దిశాచట్టానికి చట్టబద్ధత కల్పించమని జగన్ ఏనాడూ కేంద్రాన్ని కోరిందిలేదు
దిశచట్టానికి చట్టబద్ధతకల్పించలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. బాబాయ్ హత్యకేసునుంచి తననుతాను, అవినాశ్ రెడ్డిని కాపాడుకోవడానికి ప్రత్యేకవిమానాల్లో ఢిల్లీ వెళ్లే జగన్, ఒక్కసారైనా దిశాచట్టానికి చట్టబద్ధత కల్పించమని కేంద్రాన్నికోరాడా? తన అవినీతికేసుల మాఫీకోసం కేంద్రాన్ని ప్రసన్నంచేసుకోవడంలో చూపుతున్న శ్రద్ధ లో సగంకూడా ముఖ్యమంత్రి దిశాచట్టానికి చట్టబద్ధత కల్పించడంలో చూపలేదు. మహిళామంత్రులు ఫోటోలు తీసుకోవడానికే దిశాచట్టం, దిశా పోలీస్ స్టేషన్లు పనికొస్తు న్నాయి. దిశా పోలీస్ స్టేషన్లు, మహిళాపోలీసులు ఏంచేస్తున్నారో వారివల్ల ఏం ఉపయోగమో జగన్ చెప్పాలి. గతంలో తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోనే యువతిపై అత్యాచారం జరిగితే, ఇప్పటికీ ఈ ప్రభుత్వం, పోలీసులు నిందితుడు వెంకటరెడ్డిని పట్టుకోలేకపోయారు. తాడేపల్లిలో అంధబాలికను హతమార్చిన ఘటనపై ప్రభుత్వా న్ని నిలదీశారన్న అక్కసుతో తెలుగుమహిళల్ని అకారణంగా అరెస్ట్ చేశారు. “గన్ కంటే ముందు జగన్ వస్తాడు”.. “గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుంది”అన్న ఇడియట్స్ దారుణంపై ఎందుకు స్పందించరు? డీజీపీ ఆఫీసుకి మూడుకిలోమీటర్ల దూరంలో బాలికహత్యగావింపబడటానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న గంజాయి, ఇతరమాదద్రవ్యాలే. బాలికను హతమార్చినవాడు గంజాయిమత్తులో ఉన్నాడని స్థానికులే చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుబోతులు, తాగుబో తులు, కామాంధులు, పోరంబోకులే తిరుగుతున్నారు. జగన్ అండగా ఉన్నాడన్న ధైర్యంతోనే వారు విచ్చలవిడిగా తిరుగుతూ మహిళల మానప్రాణాలు బలి తీసుకుంటున్నారా?
మహిళల మానప్రాణాలు బలిగొన్న దుర్మార్గుల్లో ఎంతమందిని ప్రభుత్వం కఠినంగా శిక్షించిందో వాస్తవవివరాలతో డీజీపీ తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి. రాష్ట్ర మహిళల రక్షణ బాధ్యతను కేంద్రహోంమంత్రి అమిత్ షా తీసుకోవాలి
పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రంలో మహిళలపై నేరాలు, ఘోరాలు ఎక్కువయ్యాయని ఎన్.సీ.ఈ.ఆర్.బీ నివేదిక వెల్లడిస్తే, దాన్నికూడా ఈ ప్రభుత్వం, డీజీపీ తొక్కిపెట్టాలని చూశారు. వాస్తవాలు కప్పిపుచ్చుతూ డీజీపీ మహిళల రక్షణలో పోలీసులు బాగా పనిచేస్తున్నారని కితాబులు ఇచ్చుకున్నాడు. సొంతతల్లి, చెల్లినే రోడ్లపై వదిలేసిన జగన్ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని రక్షిస్తాడన్న నమ్మకం ఎవరికీ లేదు. కాబట్టి మహిళా రక్షణ, వారికి కల్పిస్తున్న భద్రతపై డీజీపీనే సమాధానం చెప్పాలి. నిజంగా డీజీపీ, పోలీస్ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే ఆడబిడ్డల రక్షణపై స్పందించాల్సిందే. రాష్ట్రంలో మహిళల మానప్రాణాలతో చెలగాటమాడినవారిలో, అబలలను బలితీసుకు న్నవారిలో ఎంతమందిని ప్రభుత్వం శిక్షించిందో పూర్తివాస్తవాలతో డీజీపీ తక్షణమే శ్వేతపత్రం విడుదచేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో నిజంగా సూపర్ పోలీసింగ్ ఉంటే, హోంమంత్రి, డీజీపీ తమ డిమాండ్ పై స్పందించాలి. మద్యపాన నిషేధం పేరుతో బూటకపుహామీ ఇచ్చిన జగన్, ఆఖరికి మహిళల తాళిబొట్లు తెగుతున్నాకూడా తన మద్యం అమ్మకాలు మానలేదు. మద్యం అమ్మకాలతో ఏపీలో వచ్చేసొమ్ముని జగన్ ఢిల్లీలో పెట్టుబడులు పెట్టాడు. ఢిల్లీ కేంద్రంగా బయటపడిన లిక్కర్ స్కామ్ లో ఏపీ వైసీపీనేతలే ప్రధానసూత్రధారులుగా ఉన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు, మరోఎంపీ కొడుకుని ఈడీ లిక్కర్ స్కామ్ లో విచారించింది నిజం కాదా? దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా, గంజాయి దొరికినా మూలాలు ఏపీతో కనెక్ట్ అవుతున్నాయి. కామాంధుల కర్కశత్వానికి బలైన మహిళల ప్రాణానికి రూ.10 లక్షలు, మానానికి రూ.5లక్షల ఖరీదు కట్టే దిక్కుమాలినస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆడబిడ్డలను కాపాడలేని ముఖ్యమంత్రి, హోంమంత్రి తక్షణమే వారిపద వులకు రాజీనామాచేయాలని రాష్ట్రఆడపడుచుల తరుపున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర మహిళల రక్షణ బాధ్యతను కేంద్రహోంమంత్రి అమిత్ షా తీసుకోవాలి” అని అనిత మీడియాముఖంగా విజ్ఞప్తిచేశారు.