Suryaa.co.in

Andhra Pradesh

యువనేత లోకేష్ ను కలిసిన సీపీఐ నగరి నియోజవర్గ నేత కోదండయ్య

నగరి నయోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం. నగరి నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో ఎపిఐఐసి ద్వారా ఎస్సీ, ఎస్టీల భూములు లాక్కోవడాన్ని నిలిపివేయాలి. నగరి నియోజకవర్గంలో గ్రావెల్ మట్టి, ఇసుక మాఫియాలను అరికట్టాలి. చిత్తూరులో యూనివర్సిటీ, ఆరోగ్య విశ్వవిద్యాలయం, టీచింగ్ హాస్పటల్ ఏర్పాటుచేయాలి. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చొరవచూపాలి. అంగన్ వాడీ, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వ్యవసాయమోటర్లకు మీటర్లు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మున్సిపల్, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం మాటతప్పింది. వారి సమస్యలను పరిష్కరించాలి. సిపిఎస్ రద్దుచేసి పాత విధానాన్ని పునరుద్దరించాలి. నగరిలో మరమగ్గాల కార్మికులకు తమిళనాడు ప్రభుత్వంలో మాదిరి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. వివిధ సాకులతో నిలిపివేసిన పెన్షన్లన్నీ పునరుద్దరించాలి. స్కీమ్ కార్మికులకు వికలాంగులు, వితంతు పెన్షన్లు ఇవ్వాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూల్చడం తప్ప కొత్త పరిశ్రమలు తేవడం తెలియదు. జె-ట్యాక్స్ కోసం అమర్ రాజా, జాకీ వంటి పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతాం. నూతన పరిశ్రమలను ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. గ్రావెల్, మట్టి, ఇసుక మాఫియాలపై ఉక్కుపాదం మోపుతాం.

LEAVE A RESPONSE