Suryaa.co.in

Andhra Pradesh

సుబ్రహ్మణ్యం హత్య వెనక ఉన్న అదృశ్యశక్తి ఒక మహిళా ప్రజాప్రతినిధి

-జగన్మోహన్ రెడ్డి తనను కాపాడతాడన్న నమ్మకంతోనే అనంతబాబు ఇంటింటికీ జగనన్నశవాల పంపిణీ పథకం ప్రారంభించాడు
-సుబ్రహ్మణ్యం హత్యవెనక ఉన్న అదృశ్యశక్తి ఒక మహిళాప్రజాప్రతినిధి. ఆమెఎవరో, ఆమెకు అనంతబాబుకి ఉన్న సంబంధమేమిటో, ఎందుకు హత్యజరిగిందనే వివరాలను త్వరలోనే బయటపెడతాం
• అనంత బాబుని ఎమ్మెల్సీ పదవినుంచి బర్తరఫ్ చేసి, అతన్ని కఠినంగా శిక్షించకపోతే, దళితుల ఆత్మగౌరవశక్తి, ఆగ్రహావేశాల ప్రభావం ఎలాఉంటుందో జగన్మోహన్ రెడ్డి ఆయనప్రభుత్వం చవిచూస్తుంది.
• వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలపై, అతన్ని కాపాడటానికి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్ కు ఫిర్యాదుచేయబోతున్నాం.
• దళితులరక్తాన్ని తాగుతూ, వారిశవాలపై నడుస్తూ, ఎన్నాళ్లు వైసీపీదళిత ప్రజాప్రతినిధులు, దళితమంత్రులు జగన్ కు ఊడిగంచేస్తారు?
– డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యోదంతంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీసభ్యులు
– మాజీ మంత్రి పీతల సుజాత

వైసీపీప్రభుత్వ మూడేళ్లపాలనలో మహిళల తాళిబొట్ల తెంపుడు కార్యక్రమం నిర్విఘ్నంగా అమలవుతోంది. జగన్ జమానాలో దళితులపై ఆగడాలు అడ్డుఅదుపులేకుండా సాగుతున్నాయి. డాక్టర్ సుధాకర్ ఉదంతం మొదలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు జరిగినదారుణాలు జగన్ రెడ్డి సారథ్యంలోజరిగినవే. వైసీపీ ఎమ్మెల్సీ అనంతఉదయభాస్కర్, దళితయువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపితే ముఖ్యమంత్రి, హోంమంత్రికి చీమకుట్టినట్లులేదు. చంద్రబాబుగారి ఆదేశాలతో సుబ్రహ్మణ్యం మరణానికి గలకారణాలు తెలుసుకున్నాం.

సుబ్రహ్మణ్యం హత్య వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోవడానికి వెళ్లిన తమపై పోలీసులు ప్రతాపం చూపారు. వైసీపీఎమ్మెల్సీని కాపాడేలా, మృతుడి కుటుంబానికి అన్యాయంచేసేలా పోలీసులు వ్వవహరిస్తున్నారు. సాక్షుల వాంగ్మూలాలు ఒకలా ఉంటే, జిల్లాఎస్పీ విజయబాబు ప్రకటన మరోలా ఎందుకుంది? ఎవరికి మేలుచేయడానికి ఎస్పీ తన సీనియారిటీని దిగజార్చుకునేలా మాట్లాడాడు? ఎమ్మెల్సీ ఆత్మరక్షణకోసమే సుబ్రహ్మణ్యాన్ని చంపాడని చెబుతున్న ఎస్పీ, ఏం ఆశించి అబద్ధాలుచెబుతున్నాడు? దళితుల్ని పబ్లిగ్గా చంపుతున్నా జగన్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు?

సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపితే సాక్షి పత్రికలో చిన్నవార్తకూడా రాయలేదు. దళితుల మానప్రాణాలంటే సాక్షిపత్రిక, దానియాజమాన్యానికి అంతలోకువా? జగన్మోహన్ రెడ్డికి దళితులపై ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా, తక్షణమే ఎమ్మెల్సీ పదవినుంచి అనంతఉదయభాస్కర్ ను తప్పించాలి. అతన్ని కఠినంగా శిక్షించి, మృతుడి కుటుంబానికి తగిన న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.ఎస్.రాజు
కాకినాడలో జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యవ్యవహారంపై టీడీపీ సహా, మూడురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దళితసంఘాలు ఆందోళనచేపట్టాయి. నిందితుడు, వైసీపీఎమ్మెల్సీ ఉదయభాస్కర్ ని కోర్టులో ప్రవేశపెట్టేముందు కాకినాడ ఎస్పీ అతన్ని దర్జాగా ప్రైవేట్ ఆసుపత్రికి , ప్రత్యేకవాహనంలో తీసుకెళ్లాడు. సుబ్రహ్మణ్యం హత్యకేసులో కాకినాడఎస్పీ చెప్పినకట్టుకథ విన్నాక తెలుగుసినీపరిశ్రమకు మంచికథా రచయిత దొరికాడనిపించింది. ఒకక్రిమినల్ ని, హంతకుడిని, రౌడీషీటర్ ని, రంగురాళ్ల అక్రమవ్యాపారిని దైవాంశసం భూతుడిగా ఎస్పీ చిత్రీకరించాడు “అనంతబాబుగారు” అన్న ఎస్పీగారి సంబోధన విన్నాక, ఆయనేమైనా ఈయనకు బావమరిదా అనిపించింది. జిల్లా ఎస్పీ విజయ్ బాబు, అనంతబాబుని కాపాడటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీచేశాడు. అనంతబాబు ఇంటి వాచ్ మెన్ ఆ ఇంట్లో ఎలాంటి వేడుకలు జరగలేదంటున్నాడు.

పోలీసులే సాక్ష్యాలు లేకుండా చేసి, అనంతబాబుని కాపాడటానికి కట్టుకథలు సృష్టించారు. జిల్లాఎస్పీకి, డీఎస్పీకి, అనంతబాబుకి అనేకలాలూచీ వ్యవహారాలున్నాయని ప్రజలే అంటున్నారు. డీఎస్పీభీమారావుని విచారణాధికారిగా ఎస్పీ నియమించినప్పుడే, పోలీసులు అసలు నైజం తెలిసిపోయింది. 5, 6గురు విచక్షణారహితంగా సుబ్రహ్మణ్యంపై దాడిచేసి చంపితే, ఎస్పీ ఏమో నెడితే చనిపోయాడని నేరేట్ చేస్తాడా? వందలకోట్ల అక్రమార్జన చేసి, ఎమ్మెల్సీ పదవి కొనుకున్నవ్యక్తి, రూ.20వేలకోసం సుబ్రహ్మణ్యాన్ని చంపాడా? ఇలాంటికథలు ఎవరు నమ్ముతారు? ఎస్పీ, ఎమ్మెల్సీ మధ్య ఉన్నవ్యవహారాలకు అంతిమంగా బలైంది పేదదళిత కుటుంబం.

సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యుల ఆవేదనని ఎస్పీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? పోలీసుల విచారణలో సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయంజరగదని తేలిపో యింది. ప్రాథమిక విచారణకోసం కూడా అనంతబాబుని పోలీసులు కస్టడీలోకి తీసుకోకపోవ డమేంటి? ‘జగనన్న ఇంటింటికీ శవాలపంపిణీ’ పథకాన్ని అనంతబాబు ప్రారంభించాడా? సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, మంత్రి బొత్ససత్యనారాయణ, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు బినామీ అనంతబాబు. అనంతబాబు తండ్రిపెద్ద కిరాతకుడు. అతనిదారుణాలు చూడలేకే నక్సలైట్లు కాల్చిచంపారు. అలాంటివ్యక్తికి వారుసు డైన అనంతబాబు, జిల్లాఎస్పీకి మర్యాదస్తుడా?

సుబ్రహ్మణ్యం హత్య జరిగితే ముఖ్యమంత్రి, హోంమంత్రి, మండలి ఛైర్మన్ మోషేస్ రాజు, వైసీపీదళిత ప్రజాప్రతినిధులు, ఎస్పీకమిషన్ చోద్యంచూస్తాయా? దళితులు దారుణంగా చంపబడుతున్నా… దళిత మహిళల మానాలు పోతున్నా, మీకు పదవులే ముఖ్యమా? దళితుల్ని అడ్డంపెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడంటున్న మంత్రి మేరుగ నాగార్జునకు బుద్ధి,జ్ఞానం ఉన్నాయా? హత్య గావింపబడిన వ్యక్తి కుటుంబానికి అండగా నిలవడంకోసంతాము చేసే పోరాటం మంత్రికి రాజకీయంలా కనిపిస్తే తాముచేసేది రాజకీయమే. దగాపడిన దళితకుటుంబానికి అండగా నిలవడమే టీడీపీ సభ్యులు చేసినతప్పయితే, మేంచేసింది తప్పే. చంద్రబాబు సుబ్రహ్మ ణ్యం కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, మమల్ని పంపించి, రూ.5లక్షలు సాయం అందించే వరకు నువ్వేం పీకావు నాగార్జునా?

దళితుల్ని చంపి, వారిశవాల్ని కార్లలో తీసుకెళ్లి వారిళ్ల లోనే పడేస్తున్నాస్పందించని వైసీపీ దళితప్రజాప్రతినిధులు నిజంగా దళితులేనా? దళితయువకుడిని దారుణంగా చంపితే నోరుమెదపలేని మీకుపదవులెందుకు? సిగ్గు లేకుండా ఇంకాచంద్రబాబుగారిని అంటారా? దళితుడిని కిరాతకంగా చంపినవాడిని పార్టీనుంచి, పదవినుంచి తప్పించకుండా, ఇంకా వాడేతప్పు చేయలేదని నిస్సిగ్గుగా సమర్థిస్తారా? సుబ్రహ్మణ్యం హత్యవ్యవహారాన్ని అతిత్వరలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోతున్నాం. ఎమ్మెల్సీ పదవినుంచి అనంతబాబుని వెంటనేబర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తు న్నాం. సుబ్రహ్మణ్యంశవాన్ని అతనిఇంటివద్ద పడేసినప్పటినుంచి, పోలీసులు అనంత బాబుని అరెస్ట్ చేసేవరకు మధ్యనఉన్న మూడురోజులసమయంలో అతను సజ్జల రామకృష్ణారెడ్డిని, విజయసాయిరెడ్డిని, బొత్స సత్యనారాయణను కలవలేదా?

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని అనుచరులు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యుల్ని భయభ్రాంతులకు గురిచేసేవరకు పోలీసులు ఏంచేశారు? హంతకుడిని కాపాడటానికే జిల్లాఎస్పీ చెప్పాల్సిన కహానీలు అన్నీచెప్పాడు. జిల్లాఎస్పీ డైరెక్షన్ లోనే అనంతబాబు హత్యచేసినదగ్గరనుంచీ నడుస్తున్నాడు. సుబ్రహ్మణ్యం హత్యజరిగింది రూ.20వేల కోసంకాదు.. హత్యవెనుకఉన్న అదృశ్యశక్తి ఒక మహిళాప్రజాప్రతినిధి. ఎవరికోసం సుబ్రహ్మణ్యం హత్యజరిగింది.. ఎందుకు అనంత్ బాబు చంపాడు. ఎవరిని కాపాడ టానికి ఎస్పీ నాటకాలుఆడుతున్నాడో అన్నీబయటపెడతాం.

అనంతబాబు శాసనమండలి సభ్యత్వాన్ని రద్దుచేయకుంటే, అవసరమైతే మండలిని కూడా ముట్టడిస్తాం. మండలిఛైర్మన్ ఇంటిముందు ధర్నాచేస్తాం. దళితుల్ని చంపేసి, వారిశవాల్ని కార్లలో పెట్టుకొని తిరుగుతున్నవారిని వదిలేసి, ఏముఖంపెట్టుకొని జగన్ ప్రభుత్వంలోని దళిత మంత్రులంతా సామాజికయాత్ర చేస్తామంటున్నారు? దగాపడిన దళితులు, హత్యకావిం పబడిన దళితులకుటుంబాలకు చంద్రబాబుగారు అండగానిలిస్తుంటే, దళితుమంత్రులమని చెప్పుకుంటున్న వారంతా సిగ్గు, శరంలేకుండా ఆయనపై పడిఏడుస్తారా? రాష్ట్ర ఎస్సీ కమిసన్ హక్కులు, విధులు ఏమిటి? సుబ్రహ్మణ్యం మృతిపై కనీసం ఒక్కచిన్న ప్రెస్ మీట్ పెట్టరా? సామాజిక యాత్రపేరుతో ప్రజల్లోకివచ్చే దళితమంత్రులు, ప్రజాప్రతినిధులకు దళితులు చెప్పులతో స్వాగతం పలక్కపోతే చూడండి.

టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
అనంతబాబుని కాపాడటానికి తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం శతవిధాలా ప్రయత్నించింది. టీడీపీ నిజనిర్ధారణ కమిటీపర్యటనలో అనేకవాస్తవాలు బయటపడ్డాయి. ఈ కమిటీ లేకపోతే అనంతబాబుఅరెస్ట్ అయ్యేవాడుకాదు. అతని అరెస్ట్ లో ఆత్మగౌరవ పోరాటం నడిపిన అనేక ప్రజాసంఘాలు,దళితసంఘాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. హంతకుడు అనంతబాబుని జైలుకుపంపేవరకు టీడీపీ, దళితసంఘాలు ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టవని స్పష్టంచేస్తున్నాం.

అనంతబాబు నకిలీకులధృవీకరణ పత్రంలో ఎమ్మెల్సీ పదవిపొందాడు. గిరిజనుల హక్కుల్ని, వారికి దక్కాల్సిన అటవీసంపదను దోచుకుంటున్న అనంతబాబు ఆగడాలను మంత్రిగాఉన్నప్పుడు నక్కాఆనంద్ బాబు బయటపెట్టారు. అనంతబాబు నేరచరిత్ర, దుర్మార్గాలకు బహుమతిగానే జగన్ రెడ్డి, అతన్ని పెద్దలసభకు (మండలి) పంపాడు. పెద్దల్ని పంపాల్సిన సభకు హంతకుల్ని, రౌడీలను పంపుతున్న ఘనత జగన్ రెడ్డికే దక్కింది. అనంతబాబు తప్పుచేయలేదుకాబట్టే బయటతిరుగు తున్నాడని బొత్స మాట్లాడాడు. ఒకమంత్రి హత్యచేసిన వాడిని వెనకేసుకురావడం చూస్తే , తెరవెనుక ఏస్థాయిలో మంత్రాంగం నడిచిందో చెప్పాల్సిన పనిలేదు.

ఏస్థాయినుంచి ఏస్థాయి వరకు అనంతబాబుని కాపాడే ప్రయత్నాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మంత్రి రోజా, మరికొందరు మంత్రులు మాట్లాడుతూ, జగన్ రెడ్డి చెబితేనే పోలీసులు అనంతబాబుని అరెస్ట్ చేశారంటున్నారు. ఆ మాట అనడానికి వారికి సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డిచెప్పకపోతే క్రిమినల్స్ ని, రేపిస్ట్ లను, హంతకుల్ని, అవినీతిపరుల్ని అరెస్ట్ చేయకుండా పోలీసులుచోద్యంచూస్తారని మంత్రిరోజా చెబుతున్నారా? సుబ్రహ్మణ్యం హత్యకేసుని తెలుగుదేశంపార్టీ పట్టుకుంది కాబట్టే, జగన్మోహన్ రెడ్డి అనంతబాబుని అరెస్ట్ చేయించాడు.

రాష్ట్రప్రజలకు అనంతబాబుబాగోతం తెలిసిందికాబట్టే, ముఖ్యమంత్రి స్పందించాడు. అనంతబాబు, వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బినామీ అయితే, చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బినామీ. ఈ విధంగా ఒకరితో ఒకరికున్న అవినాభావ సంబంధం తేటతెల్లం కాబట్టే జగన్మోహన్ రెడ్డి అనంతబాబుని అరెస్ట్ చేయమన్నాడు. హోంమంత్రి, ఇతర దళితమంత్రులు, మండలిఛైర్మన్, ఎస్సీకమిషన్ ఛైర్మన్ లకు ఏమాత్రం సిగ్గున్నా, వెంటనే వారిపదవులకు రాజీనామాలు చేయాలి. ఎవరి రక్తంతాగుతూ, ఎన్నాళ్లు పదవుల్లో ఉండాలని వైసీపీదళిత ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు? ఎందరు దళితులచావులతో ఇంకామంత్రిపదవులు అనుభవించాలనుకుంటున్నారు?

దళితులకు జరిగే అన్యాయంపై పోరాడుతున్నది ఒక్క తెలుగుదేశంమాత్రమే. దళితుల ఆత్మగౌరవాన్ని తనపదవితో ఇనుమడింపచేసిన మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ని చూసి మేరుగనాగార్జున సిగ్గుతో తలొంచుకోవాలి. మేరుగ నాగార్జున సొంతనియోజకవర్గంలో మూల్పూరుగ్రామంలో రవికిరణ్ అనే దళితుడిని వైసీపీవారు చంపేస్తే వారిని కాపాడాలని చూస్తున్నారు. రవికిరణ్ విషయంలో కూడా న్యాయంజరిగేవరకు టీడీపీ పోరాడుతుంది. సుబ్రహ్మణ్యం హత్యోదంతాన్ని టీడీపీ ఇంతటితో వదిలిపెట్టదు. దళితుల్ని దారుణంగా చంపుతూ, వారికుటుంబసభ్యుల్ని పదవులు, డబ్బులతో లొంగదీసుకోవాలని చూస్తారా?

ఆత్మగౌరవంతో బతికే దళితులు తమను నాశనంచేస్తున్నవారు ఇచ్చే ముష్టికోసం ఆశపడతారని ఎలా అనుకున్నారు? కేవలం వైసీపీలోని దళితనేతలు, ఇతరత్రా స్థాయిల్లోఉన్నవారే ఆత్మగౌరవం లేకుండా జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారు. మండలిఛైర్మన్ మోషేస్ రాజు, అనంతబాబుని ఎమ్మెల్సీ పదవినుంచి తప్పించకపోతే, టీడీపీ తరుపున ఉద్యమిస్తాం. అధికారంకోసమే తానుదళితులకు బంధువుని, మామను, బాబాయ్ ని అంటూ జగన్ రెడ్డి దొంగనాటకాలు ఆడాడని ఇప్పటికైనా దళితసోదరులంతా గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దళితమహిళలు రోడ్లపై స్వేచ్ఛగా తిరగగలు గుతున్నారా? టీడీపీ యాగీచేయడంలేదు ముఖ్యమంత్రిగారు.. దళితుల ఆత్మగౌరవం కోసం… వారిమానప్రాణరక్షణకోసం పోరాడుతోందని తెలుసుకోండి.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్
అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసి, శవాన్ని తానే కారులో తీసుకెళ్లాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాపాడతాడన్న నమ్మకమే. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపై జరగని దారుణాలుఉన్నాయా? కాకినాడ పోలీస్ యంత్రాంగం పెద్ద హైడ్రామా నడిపింది. అనంతబాబు తానే స్వయంగా సుబ్రహ్మణ్యాన్ని చంపానని ఒప్పుకున్నాకకూడా, కాకినాడ ఎస్పీ కట్టుకథలు అల్లడందుర్మార్గంకాదా? టీడీపీ నేతలందరం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వెళ్లినప్పుడు, వారితోపాటు, చుట్టుపక్కలున్నవారంతా అనంత బాబే సుబ్రహ్మణ్యాన్ని చంపాడని గట్టిగా చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా దళితుల్లో తనపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి, అనంతబాబుని అరెస్ట్ చేయించాడు. అనంతబాబుని ఎమ్మెల్సీపదవిలో ఉంచాలనే ప్రభుత్వం చూస్తోంది. దళితులపై జగన్ ప్రభుత్వం, వైసీపీనేతలు దాడులు ఆపకపోతే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇప్పటికైనా వైసీపీ దళితప్రజాప్రతినిధులు కళ్లుతెరిచి వాస్తవాలు తెలుసు కుంటే మంచిదని హితవుపలుకుతున్నాం.మండలిఛైర్మన్ మోషేస్ రాజు, అనంతబాబుని ఎమ్మెల్సీ పదవినుంచి బర్తరఫ్ చేయకుంటే టీడీపీ ఉద్యమ ఆగ్రహాన్ని చవిచూస్తారు.

LEAVE A RESPONSE