Suryaa.co.in

Andhra Pradesh

జనసేన (జెఎస్‌పీ).. రౌడీషీటర్ల పార్టీ (ఆర్‌ఎస్‌పీ)గా తయారైంది

-మహిళా సీఐని వ్యక్తిగతంగా దూషిస్తే.. చూస్తూ ఊర్కోవాలా?
-నానాటికీ ఉన్మాదిలా మారుతున్న పవన్‌కళ్యాణ్‌
-చంద్రబాబు చేతిలో ఆయనే మరో బలిపశువు
-నా చదువు కడపలో.. జగన్‌గారిది హైదరాబాద్‌లో
-మేము పేపర్లు దొంగిలించామంటావా?
-నీ దగ్గర ఏ ఆధారాలున్నాయి? ఏమిటా పిచ్చి విమర్శలు
-పవన్‌కు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చురకలు

అంజూ యాదవ్‌కు క్షమాపణలు చెప్పాలి:
పవన్‌కల్యాణ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంజూయాదవ్‌కి క్షమాపణ చెప్పాలి.
ఆమెను వ్యక్తిగతంగా దూషించిన తన కార్యకర్తను మందలించకుండా.. తిరిగి ఆమెపైనే ఫిర్యాదు చేయడం సబబు కాదు.
పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించకూడదు.
ఇదే వ్యవస్థ లేకపోతే నీలాంటి రౌడీషీటర్లు, నీలాంటి రెచ్చగొట్టేవారు మితిమీరిపోయి అలజడి సృష్టిస్తారు.
అందుకే మీపార్టీ జనసేన (జెస్‌పీ) కాకుండా రౌడీషీటర్ల పార్టీ (ఆర్‌ఎస్‌పీ)గా మారిపోయింది.
టీడీపీ దొంగల పార్టీ అనేది అందరికీ తెలిసిందే. దానితో మీరు చేతులు కలిపి వెళ్తున్నారు.
మీరు ఇలానే ఉంటే ప్రజలు మీ దగ్గరకు కూడా రాకుండా చీదరించుకుంటారు.

జగన్‌ నైతికత:
ఎక్కడ చర్చ జరిగినా రాజకీయ వ్యవస్థ పాడైపోతోందని, విలువలు దిగజారిపోతున్నాయని, నైతికత లేకుండా పోతున్నాయనేది వింటూనే ఉన్నాం.
రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండా పోతున్నాయనేది రాష్ట్రంలోని నాయకులను చూస్తే స్పష్టంగా అర్ధం అవుతోంది.
మన రాష్ట్రంలో ఒక 37 ఏళ్ల యువకుడు రాజకీయ వ్యవస్థను కొద్దిగా అయినా రిపేర్‌ చేయాలని రంగంలోకి దిగి పార్టీని స్థాపించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైయస్‌ జగన్‌ వ్యవస్థలను గాడిలో పెడుతూ, రాజకీయాల్లో విలువలు పాటిస్తున్నారు.

బాబు సిగ్గులేని రాజకీయాలు:
ఎందుకీ మాటలు చెప్పాల్సి వస్తుందంటే..
రాజకీయాల్లో ఏం చేశాం? ఏం చేయబోతున్నాం? అన్నదాని కంటే, వ్యక్తిగతంగా ఎలా దూషించాలి అన్న రీతిలో ప్రతిపక్షాల తీరు కనిపిస్తోంది.
చంద్రబాబు కానీ, మిగతా వాళ్లు కానీ ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు.
సుధీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏనాడూ విలువలతో కూడిన రాజకీయాలు చేయలేదు.
తన జీవితకాలమంతా వెన్నుపోట్లు, మేనేజ్‌మెంట్లకే ప్రాధాన్యం ఇచ్చాడు.
తనని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా కూడా ఇంకా సిగ్గు పడకుండా అలాంటి రాజకీయాలే చేస్తున్నాడు.
ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. ఆయనకు తానా తందానా అంటూ ఆ పత్రికలు నడుస్తున్నాయి.
ఇకనైనా వారు వైఖరి మార్చుకోవాలి. తమను నిర్దేశించిన వ్యక్తిని అధికారంలోకి తీసుకురావడం కోసం, భుజానికి ఎత్తడం మానాలి.

బాబు చేతి ఆటలో అరటిపండు:
అమ్మవారి పేరుతో యాత్రలు చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.
రాజకీయాల్లో ఆయన్ను అరటిపండును చేసి వాడుకుని వదిలేసేందుకు చంద్రబాబు పని చేస్తున్నాడు.
పవన్‌ కల్యాణ్‌ తనను తాను మైమరచిపోయి.. చంద్రబాబు ట్రాప్‌లో రోజు రోజుకీ దిగజారిపోయి ఉన్మాదిలా మారాడు.
చంద్రబాబు ఇందులో సిద్ధహస్తుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో సీనియర్‌ నాయకులు ఆయన చేతిలో బలిపశువులయ్యారు.
తనకు పోటీదారులు అవుతారనుకున్న వారందరినీ ఇలానే ట్రాప్‌ చేసి దేనికీ పనికి రాకుండా చేస్తాడు.
అందులో భాగంగా బలిపశువు కాబోతున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌.

నీ దగ్గర ఏ ఆధారాలున్నాయి?:
నేను కడపలో చదివాను. జగన్‌ హైదరాబాద్‌లో చదివారు. ఇక పేపర్లు ఎలా దొంగలిస్తాం?
నేను, జగన్‌ పదో తరగతి కలిసి చదువుకున్నామని, మేము పేపర్లు దొంగిలిస్తే హైదరాబాద్‌లో పోలీసులు మాపై కేసు బుక్‌ చేశారని అన్నావు.
దీనికి సంబంధించి నా దగ్గర ఏ ఆధారాలున్నాయి? ఏమిటా పిచ్చి విమర్శలు?.
మాట్లాడే ముందు కనీసం విషయాలు కనుక్కోవాలి కదా?

రాజకీయం అంటే స్క్రిప్ట్‌ చదవడం కాదు:
ప్రజలు తనకు అవకాశం ఇస్తే ఏం చేస్తానన్నది పవన్‌కళ్యాణ్‌ చెప్పడు. ఇక తన పార్టనర్, టీడీపీ చేసిన తప్పులను ప్రశ్నించడు.
కేవలం వ్యక్తిగత దూషణలతో మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి గురించి నేను ఏనాడూ పేరు కూడా ఉచ్చరించకూడదు అనుకున్నా.
ఇటీవల ఆయన మాట్లాడుతూ ఎన్నో రకాలుగా జగన్‌ ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు.
ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఏదైనా మాట్లాడే ముందు అన్నీ ఆలోచించాలి.
అంతేకానీ, బుడ్డా పకీర్లు, టీడీపీ వారిచ్చిన స్క్రిప్ట్‌ చదవడం కాదు.

ధైర్యంగా చెప్పగలవా?:
వీళ్లంతా తొలుత బీజేపీతో కలిసి పోటీ చేశారు. తర్వాత కాంగ్రెస్‌తో కలిసి తిరిగారు.
ఇప్పుడు ఢిల్లీలో కూర్చుని పైరవీలు చేస్తూ పొత్తుకు ఎవరు పిలుస్తారా అని చూస్తున్నారు.
చివరికి ఆ రెండు పార్టీలు వీళ్ల నైజం తెలుసుకుని, వీళ్లు సిగ్గులేని వ్యక్తులని కనీసం పలకరింపు కూడా లేకుండా చేశారు.
చివరికి వీళ్లకి సొంతంగా 175 చోట్లా పోటీ చేస్తాం అనే ధైర్యంగా చెప్పలేకపోతున్నారు.

పవన్‌కు మహిళలపై ద్వేషం:
ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్లాడు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికంటూ డ్రామా మొదలుపెట్టాడు.
మహిళా వాలంటీర్లను దూషించడమే కాకుండా, తన అనుచరులు కూడా ఆయన మాటలకు మద్దతుగా ఆందోళన చేసి అవే దూషణలు చేశారు.
పోలీసు స్టేషన్‌ ముందు ధర్నా చేస్తూ మహిళలను, ముఖ్యమంత్రి ని వ్యక్తిగతంగా దూషిస్తుంటే మహిళా సీఐ వారించారు.
వారిస్తున్న సీఐ అంజూ యాదవ్‌పై కూడా వ్యక్తిగతంగా దూషించడంతో చేయి చేసుకున్నారు.
మహిళ అనే గౌరవం లేకుండా, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ ఆమెపై ఫిర్యాదు చేశాడు. పవన్‌ కల్యాణ్‌కి మహిళలంటే ద్వేషం.
2.5 లక్షల వాలంటీర్లలో 60 శాతంపైగా మహిళలున్నారు.
సిగ్గు లేకుండా వారిపై విమర్శలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా దూషిస్తూ వ్యవస్థను చులకన చేశావ్‌.
మీకు ధైర్యం ఉంటే రండి. వాలంటీర్ల వ్యవస్థ మంచిదా? కాదా? అనేది ఇంటింటికీ వెళ్లి మాట్లాడదాం.
కారుపై ఊగుతూ పిచ్చి చేష్టలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టడం.. యథా రాజా తథా ప్రజలు అన్నట్లు ఆ కార్యకర్తలూ అలానే ప్రవర్తిస్తున్నారు.
మీకు నిజంగా ధైర్యం ఉంటే చంద్రబాబు మంచి చేశారు రాబోయే రోజుల్లో ఇది చేస్తాడు అనేది చెప్పగలవా..?

అందుకేనా రాజకీయాలు?:
నేను సీఎం పదవి రేస్‌లో ఉన్నాను. నన్ను ప్రజలు ఆదరిస్తే ఇది చేస్తాను అని చెప్పే ధైర్యం లేదు.
ఎన్ని సీట్లలో పోటీ చేస్తావో చెప్పే క్లారిటీ కూడా లేని మీకెందుకు రాజకీయాలు?
వ్యక్తిగత దూషణలు చేస్తూ రాజకీయాల విలువలు దిగజార్చడానికా.?
లోకేశ్‌ తనకు బాగా జనం వస్తున్నారంటూ ఊహించుకుని ఈవెంట్‌ మేనేజ్‌మెంటు చేసుకుంటూ తిరుగుతున్నాడు.
అటు లోకేశ్, ఇటు పవన్‌లు ఇద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగడం తప్ప చేసిందేమీ లేదు.

ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు?:
14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేశాడు?
రాయలసీమలో ఒక పరిశ్రమ, ఇరిగేషన్‌ప్రాజెక్టు కట్టిన చరిత్ర ఆయనకు ఉందా?
హంద్రీనీవా ప్రాజెక్టు అవసరం లేదని జీవో ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు.
గాలేరు నగరి అవసరమే ఉండదని, గండికోట 3 టీఎంసీలకు కుదించిన వ్యక్తి చంద్రబాబు.
మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్‌ వంటివన్నీ పూర్తి చేశారు.
రాయలసీమ గుండె చప్పుడుగా నిలిచిన పోతిరెడ్డిపాడు వరకూ ఆ మహానాయకుడి చేసినవే.
ఆయన ఇలాంటి మంచి పనులు చేస్తుంటే ఆనాడు చంద్రబాబు సీమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ధర్నాలు చేయించాడు.
సీఐ చేయిచేసుకున్నారని ప్రత్యేక విమానంలో పరుగెత్తిన పవన్‌ కల్యాణ్‌.. ఆనాడు చంద్రబాబు రాయలసీమ గొంతు కోస్తున్న సమయాల్లో ఎక్కడికెళ్లావ్‌? ఎందుకు ప్రశ్నించలేదు?.
పోతిరెడ్డిపాడుపై టీడీపీ నేత దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజీపై ధర్నా చేసినప్పుడు ఎక్కడికి పోయింది నీ ప్రశ్నించే తత్వం?.
ఎక్కడో రైలు కాలిపోతే రాయలసీమ గూండాలు, కడప రౌడీలు అంటూ పదే పదే మమ్మల్ని విమర్శించినప్పుడు ఎక్కడికి పోయింది నీ ప్రశ్నించే తత్వం.
రాయలసీమలో చెరుకూరి నారాయణరెడ్డి నుంచి అనేక మంది నాయకులను ఊచకోత కోసి చంపినప్పుడు ఎక్కడికి పోయింది నీ ప్రశ్నించే తత్వం?.
రాయలసీమలో న్యాయ రాజధానిని అడ్డుకుంటున్న వ్యక్తులను ప్రశ్నించలేని నువ్వు ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నావు.
ఆయన ఎజెండా అంతా కేవలం చంద్రబాబును సంతృప్తి పర్చడమే.

ఇప్పటికైనా మారండి:
చంద్రబాబు, లోకేశ్, పవన్‌.. మీరు ప్రజల్లోకి వెళ్లినప్పుడు హుందాగా మాట్లాడటం నేర్చుకోండి.
రాజకీయాల్లో విలువలు దిగజార్చవద్దు. ఇప్పటికే భవిష్యత్తు తరాలు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు.
రాజకీయాలంటే ఒక బాధ్యత అనేది గుర్తుంచుకోండి.
అలా కాకుండా ఊగిపోయి అధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు దిగడం కాదు రాజకీయాలు అంటే.
జగన్‌గారు రాజకీయ నాయకుడికి ఒక రోల్‌ మోడల్‌. రాజకీయాల్లో ఉండాల్సింది మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేయడం.
నూటికి 99 శాతం అమలు చేశాను. ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి అని జగన్‌ గారు అడుగుతున్నారు.
ఇచ్చిన హామీలను మర్చిపోవాలంటూ మేనిఫెస్టోని ఆన్‌లైన్‌ నుంచి తొలగించిన వ్యక్తి ఎక్కడ?.
2014 నీ మేనిఫెస్టోను తీసుకుని మీరు ఒక్క సారి ప్రజల వద్దకు వెళ్లండి ఏం జరుగుతుందో చూడండి.

చర్చిండానికి మేము సిద్ధం:
మేం నేడు ధైర్యంగా మా మేనిఫెస్టో తీసుకుని ఇంటింటికీ వెళ్తున్నాం.
రాయలసీమలో తండ్రిని మించి మంచి చేసేందుకు జగన్‌ గారు ముందుకు వెళ్తున్నారు.
డాటెడ్‌ ల్యాండ్స్‌ విషయంలో బడుగు బలహీనవర్గాలకు మేలు జరిగేలా తీసుకున్న చర్యలు భేష్‌ అంటున్నారు.
30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కడుతుంటే పేదవారు రాజధానిలో ఉండకూదడని కోర్టుకెళ్లిన మీరెక్కడ?
జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుని, కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్లలో మహిళలను వేదించిన మీరెక్కడ?. ఇళ్లకు సేవలందిస్తున్న వాలంటీర్లు ఎక్కడ?.
ఏ విషయంలోనైనా మేం చర్చకు సిద్ధం. మీకు ధైర్యం ఉంటే రండి.
మేం అందిస్తున్న 32 సంక్షేమ పథకాల నుంచి దేనిలోనూ మీరు మాకు పోటీకి రాలేరు.
పరిశ్రమలు నుంచి ఉద్యోగాల కల్పన వరకూ మేం ఏమేం చేశామో వివరించడానికి మేం సిద్దం.
జీఐఎస్‌లో ఎన్ని పెట్టబడులపై ఒప్పందాలు జరిగాయో?. అవన్నీ ఇప్పుడు ఎలా గ్రౌండ్‌ అవుతున్నాయో మీకు కనిపించడం లేదా?.

రామోజీ మీకు ఆ దమ్ముందా?:
రాజకీయ ఆధిపత్యం కోసం పల్లెల్లో రక్తచరిత్ర అంటూ రామోజీ వార్తలు రాస్తున్నాడు.
80 ఏళ్లు దాటాయి. ఇలాంటి రాతలు రాయించడానికి కొద్దిగన్నా సిగ్గనిపించడం లేదా?
చంద్రబాబు హయాంలో కక్షలు కార్పణ్యాలు డేటా తీసుకుని రాయండి.
గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం 29 మందిని చంపాడో ధైర్యముంటే రాయండి.
ప్రజలు ప్రశాంతంగా ఉన్న తరుణంలో మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, బాబును తిరిగి సీఎంను చేయడం కోసం మీ తపన చూస్తుంటే నవ్వొస్తుంది.
ఎక్కడో చిన్న భూతగాదా, అన్నదమ్ముల సమస్యలను చూపించి లా అండ్‌ ఆర్డర్‌ సమస్య అంటూ రాయడానికి సిగ్గనిపించడం లేదా?
రాయలసీమ ఫ్యాక్షన్‌ గురించి రాసే ముందు ఆ ఫ్యాక్షన్‌ మీ రాజకీయ పార్టీ వచ్చిన తర్వాతే వచ్చిందని గుర్తు చేసుకోవాలి.
మేం ప్యాక్షన్‌ను నిర్మూలిస్తే.. మీ అధికారం కోసం మళ్లీ ఫ్యాక్షన్‌ రెచ్చగొట్టాలని చూస్తున్నారు.

బాబు అనైతిక రాజకీయం:
యువతను పాడు చేసి, వాళ్లలో విషం నించి ఐటీడీపీ పేరుతో వేలాది యువత జీవితాలు నాశనం చేస్తున్నారు.
కొన్ని వేల మందిని రాంగ ట్రాక్‌ పట్టించి వారితో వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారు.
ఆబద్ధాలను నిజాలుగా నమ్మించే క్రమంలో మహిళలపై కూడా నీచంగా పోస్టులు పెట్టిస్తున్నాడు.
మరో వైపు తనకున్న ఎల్లో మీడియాను వక్రమార్గాల కోసం వాడుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది.

మేమే కనక సహనం కోల్పోతే..:
పవన్‌ కల్యాణ్‌ జీవితం ఒక డిసిప్లేన్‌ లేకుండా పోతోంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తికి డిసిప్లేన్, హుందాతనం ఉండాలి.
చిన్నప్పుడు నిన్ను బాగా పెంచి ఉంటారు. నువ్వు కుటుంబం నుంచి వేరైన తర్వాత ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకో మాకు అనవసరం.
రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు నిబద్ధత, ఓపిక, సహనం, హుందాతనం ఉండాలి.
నీవు ఎన్ని పిచ్చి విమర్శలు చేసినా మేం చాలా రోజుల నుంచి మౌనంగా భరిస్తున్నాం. కారణం మాకు బాధ్యత ఉంది కాబట్టి. మేమే కనక ఆ సహనం కోల్పోతే బాగోదు.

మీకు నిజంగా బలం ఉంటే..:
ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ మా విధానాలివి అని ప్రజల్లోకి వెళ్తుంది.
కానీ ఆయన మాత్రం జగన్‌ గారినే తిట్టేందుకే రాజకీయ పార్టీ పెట్టినట్లుంది.
మీరు నిజంగా స్ట్రాంగ్‌ ఉంటే ఎందుకు ఢిల్లీలో కుక్కలు తిరిగినట్లు తిరుగుతున్నారు?
అక్కడే మీకు ప్రజాదరణ లేదని తెలిసిపోతోంది.

దాని గురించి నీవు మాట్లాడ్డం హాస్యాస్పదం:
హిందూ ధర్మం గురించి పవన్‌కళ్యాణ్‌ మాట్లాడితే నవ్వొస్తోంది.
వేదికలపైకి వచ్చి చెప్పులు చూపించడం, వితండవాదంలో ముఖ్యమంత్రి ని దూషించడాన్ని ప్రజలు అసహ్యంచుకుంటున్నారు.
పవన్‌ చెప్పు చూపించినా.. చంద్రబాబు శృతి మించిన మాటలకు కాలమే సమాధానం చెప్తుంది.
వ్యక్తిగతంగా నేను మాట్లాడను కానీ.. పవన్‌కల్యాణ్‌ రష్యాకు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు.
అలాంటి ఆయన హిందూ ధర్మం గురించి మాట్లాడటం చూస్తే నవ్వొస్తుంది. ఏ అర్హతతో ఆయన మాట్లాడుతున్నాడో చెప్పాలి.

మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం:
300పైగా సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని గేటు వద్ద నిలబడి రాష్ట్ర హక్కుల కోసం అలా రాకుండా ఉంటే బాగుండు అని చెప్పిన ధైర్యవంతుడు వైఎస్‌ జగన్‌ .
వైజాగ్‌లో మోదీ సమక్షంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.. ఇచ్చిన హోదా హామీని నెరవేర్చండి నిలదీసింది జగన్‌ .
యూపీఏ, ఎన్డీయేతో మాకు సంబంధం లేదు. మా రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు కాపాడుతారో వారికి సహకరిస్తాం.
మేం వెళ్తున్న దారిని ఎవరు ఆటంకపర్చినా వ్యతిరేకిస్తాం.

మీ హామీలు ఏమయ్యాయి?:
బీజేపీ విమర్శలు చేయడం కాదు. కేంద్రంలో వారే అధికారంలో ఉన్నారు కదా?. అధారాలతో రమ్మనండి.
రాజకీయాల్లో ఇమేజ్‌ పెంచుకోవడం కోసం విమర్శలు చేయడం కాదు.
విమర్శించే ముందు బీజేపీ వారిని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఏమైంది..? కడప స్టీల్‌ ప్లాంటు ఏమైంది..?
చంద్రబాబు మొన్నటి వరకూ బీజేపీ అన్నాడు. మళ్లీ కాంగ్రెస్‌ అన్నాడు..
కాంగ్రెస్‌లో ఉన్న రేణుకా చౌదరి, బీజేపీలో ఉన్న సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు వైఎస్సార్సీపీనే తిడతారు.
కాంగ్రెస్‌లో కొంతమందిని, బీజేపీలో కొంత మందిని పెట్టి డ్రామాలు అడే తత్వం మాది కాదు.

LEAVE A RESPONSE