సుప్రీంకోర్టు లో అవినీతి ఉందా…? అన్న ప్రశ్నకు మాజీ CJI సమాధానం…
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు అయిన రంజన్ గొగోయ్ ఇటీవల్ ఓ పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో భాగంగా జీ టీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో యాంకర్ వేసిన ప్రశ్న ఏమిటంటే… సుప్రీం కోర్టులో కూడా అవినీతి ఉందా? ప్రధాన న్యాయమూర్తిగా కాదు… ఓ వ్యక్తిగా సమాధానం ఇవ్వండని ప్రశ్నించారు. దీనికి గొగోయ్ స్పందిస్తూ… ఈ ప్రశ్నకు సమాధాంన నేను ఇలా ఇస్తాను. సమాజం ఎంత పాతదో, అవినీతి కూడా అంత పాతది. మనిషి జీవిత విధానంలో అవినీతి ఒక భాగంగా మారింది. ఆమోదయోగ్యమైన జీవిత విధానంగా మారింది. జడ్జీలు స్వర్గం నుంచి ఊడి పడలేదు. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా…? అంటూ బదులిచ్చారు.