Suryaa.co.in

Andhra Pradesh

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజలకు మంచి చేసే వ్యవస్థ కాదు

-సమాజాన్ని విచ్ఛిన్నం చేసే చట్టం
-⁠ ప్రజల ను నియంత్రించడానికి తెచ్చిన చట్టం
-భవిష్యత్‍లో టైటిల్ ఫ్రూవ్ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాలి?
– ప్రముఖ జర్నలిస్టు పూల విక్రం ముఖాముఖిలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్‍

ఆందోళనతో, బాధతో ట్వీట్ చేశా. ⁠కృష్ణా జిల్లా విన్నకోటలో నా తండ్రి పేరు మీద తొమ్మిదిన్నర ఎకరాల భూమి ఉంది. నా తండ్రి చనిపోయే ముందే వీలునామా రాశారు. 30 మంది రైతులు కలిసి చేపల చెరువు ఏర్పాటు చేశారు. ⁠నా తండ్రి భూములను మ్యూటేషన్ చేయమని తహసీల్దారు లేఖ రాశా.

⁠తహసీల్దార్ మ్యూటేషన్ ను తిరస్కరించారు. నా భూమిని ప్రత్యక్షంగా చూపించాలని తహసీల్దార్ చెప్పారు. ⁠చేపల చెరువుగా మారిన 120 ఎకరాల్లో మా భూమిని ఎలా గుర్తించాలి? ⁠విషయాన్ని సీసీఎల్‍ఏ దృష్టికి తీసుకెళ్లాను. ⁠భూమిని మ్యూటేషన్ చేయమని కలెక్టర్‍కు సీసీఎల్‍ఏ ఉత్తర్వులు ఇచ్చారు. ⁠వీటిని కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కు పంపాను. ఇంతవరకూ స్పందన లేదు.

⁠వివాదంలో ఉంది కనుకే మ్యూటేషన్ జరగలేదనడం అవాస్తవం. మా తండ్రికి చెందిన తొమ్మిదిన్నర ఎకరాలు ఆయన కష్టార్జితం.. దీనికి పట్టా ఉంది. చీఫ్ సెక్రటరీగా పని చేసిన నేను కేవలం మ్యూటేషన్‍ కే ఇబ్బందిపడుతున్నా. ⁠తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా బదిలీకే ఇంత ఇబ్బందైతే భవిష్యత్‍లో పరిస్థితి ఏంటి?

భవిష్యత్‍లో టైటిల్ ఫ్రూవ్ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాలి? ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజలకు మంచి చేసే వ్యవస్థ కాదు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే చట్టం ఇది. ⁠ఇది ప్రజలకు కోసం తెచ్చింది కాదు వారిని నియంత్రించడానికి తెచ్చినట్లు ఉంది.

LEAVE A RESPONSE