Suryaa.co.in

Andhra Pradesh

అనంతపురం జిల్లాలో లేపాక్షి స్కాం జగన్ రెడ్డి అవినీతికి అద్దం పడుతోంది

• వైఎస్ హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8844 ఎకరాల భూముల్ని ఎకరం రూ.యాభై వేలకు కేటాయింపు అన్యాయం.
• పరిశ్రమలు.. ప్రాజెక్టులు.. పెట్టని ఇందూ ఆ భూముల్ని తనఖా పెట్టి రూ.4,531.44 కోట్ల రుణాలు తెచ్చి దారి మళ్లించడం అవినీతి కాదా?
• ఎర్తిన్ కంపెనీ రూ.ఐదు వందల కోట్లిస్తాం.. ఇందు ఆస్తులన్నీ ఇచ్చేయండన్న ప్రతిపాదనని బ్యాంకులూ అంగీకరించడం అన్యాయం.
– మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసారధి

అనంతపురం జిల్లాలో లేపాక్షి స్కాం జగన్ రెడ్డి అవినీతికి అద్దం పడుతోందని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…2004లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో అనంతపురం జిల్లా, చిలుమత్తులూరు మండలంలోని కుడికుండ దగ్గర లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8844 ఎకరాల భూముల్ని ఇందు ప్రాజెక్టుకు ఎకరం రూ.యాభై వేలకు చొప్పున (ఏపిఐఐసిసి) కేటాయించడం అన్యాయం. ఇందు అనే సంస్థ తమకు 10వేల ఎకరాలు కేటాయిస్తే పరిశ్రమలు, ప్రాజెక్టులని పెట్టి అభివృద్ధి చేస్తాం అని ప్రభుత్వానికి నివేదించింది.

దీంతో రాజశేఖర్ రెడ్డి కారుచౌకగా ఎకరా 50వేల రూపాయలతో రైతుల భూములన్నింటిని కేటాయించారు. వాటిలో పరిశ్రమలు, ప్రాజెక్టులు పెట్టలేదు. ఇందూ ఆ భూముల్ని తనఖా పెట్టి రూ.4,531.44 కోట్ల రుణాలు తెచ్చుకుంది. వాటిలో కొన్ని జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా దారి మళ్లించారు. దీనిపై సీబీఐ కేసులు పెట్టగా.. ఈడీ ఆ ఆస్తులను ఆటాచ్ చేసింది.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇందు ప్రాజెక్ట్స్ దివాలా తీసింది, రుణాలు కట్టలేమని బ్యాంకులకి తేల్చి చెప్పింది. దివాలా తీసినట్లు బ్యాంకులు అంగీకరించాయి. ఇదే సమయంలో ఎర్తిన్ అనే కంపెనీ తాము రూ.ఐదు వందల కోట్లిస్తాం ఆ ఆస్తులన్నీ ఇచ్చేయండి అని ప్రతిపాదించారు. బ్యాంకులు ఒప్పుకుని ఎర్తిన్ కంపెనీకి ఆ భూములను ధారదత్తం చేశాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ.4 కోట్ల ఆస్తులు కూడా లేని ఎర్తిన్ కంపెనీకి రూ.500 కోట్లు బ్యాంకులకు చెల్లించే శక్తి ఎక్కడిది? దీని వెనుక విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డిల హస్తం ఉంది. లిక్కర్ లో అక్రమంగా సంపాదించిన సంపాదనను విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి ఎర్తిన్ కంపెనీ ద్వారా దారి మళ్లించారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో భూములను ఇచ్చిన అనంతపురం, లేపాక్షి ప్రజలంతా వాళ్ల ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశ పడ్డారు. వారి ఆశలు అడియాశలైయ్యాయి.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత సౌత్ కొరియాకు చెందిన కియా పరిశ్రమను తీసుకొచ్చారు. నాడు ఎకరా లక్షన్నర విలువ చేసే భూమిని దాదాపు పదిన్నర లక్షల రూపాయలకు కియా సంస్ధకు ఇప్పించారు. 13వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కియా పరిశ్రమ ఏర్పాటు జరిగింది. అప్పుడు 30 వేల ఉద్యోగాలు రావడం చంద్రబాబు నాయుడు ఘనత. కియా పరిశ్రమ రావడంతో పెనుగొండ ప్రాంతంలో భూములన్ని కోట్ల రూపాయలు పలుకుతున్నాయి.

జగన్ రెడ్డి గాల్లో మేడలు కడతారు. ఏమీ లేని కంపెనీలకు భూములు కట్టబెడతారు. వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు బొక్కేస్తారు. రూ.5వేల కోట్ల వరకు రుణాలిచ్చిన బ్యాంకులు.. కేవలం రూ.500 కోట్లకు డీల్ ఓకే చేసుకోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో నిజం నిగ్గు తేల్చాలి. ఈ విషయం పై ఆర్బిఐ, ఈడి, సిబిఐ విచారణ చేపట్టాలి.

భూముల్ని వెనక్కి ఇవ్వకపోతే రైతులే స్వయంగా వాళ్ళకి కేటాయించుకుంటారు. దానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతుంది. జగన్‌ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి కుమారుడు నరేన్ రామానుజుల రెడ్డి.. ఎర్తిన్ కంపెనీలో హోల్ టైం డైరెక్టర్‌. బ్యాంకుల అంగీకారంలో విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి ల ప్రమేయం ఉంది. ఇందూ స్కాంకు సహకరించి రూ.70 కోట్లు సొంత కంపెనీల్లోకి తరలించుకున్నారు. ఇప్పుడు క్విడ్ ప్రోకో -2 కు తెరలేపారు. లక్షల కోట్ల విలువైన భూముల్ని కారు చౌకగా తీసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. జగన్ రెడ్డికి ఈ భూముల స్కాంలో ఎలాంటి పాత్ర లేకుంటే.. తక్షణమే ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలి. పరిశ్రమలు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి లేదా ఆ భూముల్ని తిరిగి రైతులకే అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసారధి డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE