Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు రాసిన లేఖపై విచారణ చేయిస్తారుగానీ.. పుంగనూరులో బీసీలపై జరిగిన దాడులపై విచరాణ చేయరు

చంద్రబాబు, లోకేష్ లను చూస్తే భయపడే జగన్.. ఇప్పుడు పసుపు చొక్కా చూసినా భయపడుతున్నారు
-మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

చంద్రబాబు రాసిన లేఖపై విచారణ చేయిస్తారుగానీ పుంగనూరులో బీసీలపై జరిగిన దాడులపై విచరాణ చేయరని, చంద్రబాబు, లోకేష్ లను చూస్తే భయపడే జగన్.. ఇప్పుడు పసుపు చొక్కా చూసినా భయపడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..

రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో సామాన్య ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్లాలన్నా భయపడుతున్నారు. వీసాలు తీసుకెళ్లాలనే విధంగా పరిస్థితి ఉంది. మొన్న పుంగనూరు లో జరిగిన సంఘటనను బట్టి ఈ విషయం నిర్ధారణ అవుతోంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఒక నియంత పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు సైకిల్ యాత్రగా వెళ్తుంటే పుంగనూరులో పుంగనూరులో వారికి అవమానం జరిగింది. బట్టలూడదీసి కొట్టారు. ఈ ఏరియాకు రావటానికి మీరెవరని చెప్పి దాడి చేశారు. అసలు ఎటు వెళ్తోంది ఈ రాష్ట్రం?. పోలీసు వ్యవస్త నిర్వీర్యమైంది. పుంగనూరును ఏమైనా రిజర్వ్ జోన్ లో పెట్టారా? పుంగనూరు ఏమైనా పెద్దిరెడ్డి జాగీరా? అనుమతులు తీసుకొని రావాలా? ఈ వైసీపీ నాయకులకు బీసీలంటే ఎందుకంత చులకనా?

పుంగనూరులో బీసీలపై జరిగిన దాడి విషయంలో డీజీపీ ఇంతవరకు స్పందించలేదు. పుంగనూరులో నడిరోడ్డుమీద బట్టలూడదీసి కొట్టారు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ వర్గాలు వస్తే చేసిన అవమానం అంతా ఇంతా కాదు.ఈ సంఘటన పట్ల డీజీపీ బాధ్యత వహించాలి. చంద్రబాబుగారు రాసిన లేఖపై నిమిషాల్లో విచారణ చేసి చట్టరీత్యా శిక్షిస్తారంటున్నారు. చంద్రబాబు, లోకేష్ లను చూస్తే భయపడే జగన్ ఇప్పుడు పసుపు రంగు చూసినా భయపడుతున్నాడు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రానికి ఏం చేశారని వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్రలు చేస్తున్నారు.

బీసీలు, ఎస్సీలు, ఎస్టీల శవాలపై మీరు బస్సు యాత్ర చేస్తారా? వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. వేలాదిమందిపై అక్రమ కేసులు పెట్టించి జైళ్లల్లో పెట్టించారు. తోట చంద్రయ్యను నడిరోడ్డుపై కోడిని కోసినట్లు పీక కోశారు. రాయలసీమలో బీసీ సోదరులను అవమానపరుస్తున్నారు. ఏ రకంగా సామాజిక న్యాయం చేస్తారు?

నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటారు వారికి ఇంతవరకు ఏం చేశారు?. వారి బతుకులు రోడ్డుపాలయ్యాయి. ఏ రంగంలో చూసినా మీ సామాజిక వర్గంవారే ఉన్నారు. వాళ్ల పదవుల కోసం దళితుల జీవితాలను మీ కాళ్ల కింద పెట్టాల్సి వస్తోంది. గతంలో వైసీపీ చేసిన బస్స యాత్రల్లో జనాలు లేక, రికార్డు డ్యాన్సులు పెట్టుకొని జనాన్ని రప్పించుకున్నారు.

బీసీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి?
బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి? ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఎస్సీ సోదరులకు చెందిన అసైన్డ్ భూములు లాక్కున్నారు. బీసీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు బలవంతంగా మీ అధికారులను పెట్టి లాక్కున్నారు. వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని కోట్లు గడిస్తున్నారు. పేదలకు భూములు లేకుండా చేసి సామాజిక న్యాయమంటారా?

లక్షా 14 వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో దోపిడీ చేశారు. బ్యాంకుల నుండి రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఏ కుటుంబం అభివృద్ధి లోకి వచ్చిందో చెప్పాలి. టీడీపీ హయాంలో అంబేద్కర్ భవన్ బీసీ భవన్, ఎస్సీ భవన్ లు కట్టాం. వాటన్నింటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది వైసీపీ బస్సు యాత్రను ప్రజలు అడ్డగిస్తారు. ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరముంది. అందరి మంచి కోరే, అందరి బాగు కాంక్షించే నాయకులను ఎన్నుకోవాలి.

LEAVE A RESPONSE