Suryaa.co.in

Telangana

లిక్కర్ కేసుకు, మహిళా రిజర్వేషన్ల అంశానికి పొంతన లేనే లేదు

– వేర్వేరు అంశాలను రాజకీయం చేయడమేంటి..?
– మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పలు మార్లు నిలదీశా
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

ఢిల్లీ లిక్కర్ కేసుకు, మహిళా రిజర్వేషన్ల అంశానికి పొంతన లేనే లేదు. అవి రెండూ వేర్వేరు అంశాలు.వేర్వేరు అంశాలను జత చేయడం ఏమిటీ..?కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు బండి సంజయ్, డి.కే. అరుణ, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ల తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.

చట్ట సభల్లో 33% మహిళా రిజర్వేషన్లు సాధించేందుకే కల్వకుంట్ల కవిత దీక్ష చేస్తోంది.ఈనెల 13 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి పెంచడమే కవిత, బీ.ఆర్.ఎస్. ఎంపీల లక్ష్యం.చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 14వ తేదీ జూన్ 2014 నాడు తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

మహిళా రిజర్వేషన్లు కోసం ఆనాడు టి.ఆర్.ఎస్ పార్టీగా, ప్రస్తుతం బీ.ఆర్.ఎస్ పార్టీగా ఎంపీలు పార్లమెంట్లో పోరాడుతూనే ఉన్నారు.ప్రధాన మంత్రిగా దేవే గౌడ ఉన్నప్పుడు 12వ తేదీ సెప్టెంబర్ 1996 నాడు మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.12వ తేదీ సెప్టెంబర్ 2016 నాటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేను పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పలు మార్లు నిలదీశాను.

రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల తీర్మానాన్ని జత చేస్తూ సీఎం కేసీఆర్ ఢిల్లీకి స్వయంగా వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి మహిళా రిజర్వేషన్ల కోసం పలు దఫాలుగా కోరారు.అప్పుడు సీఎం కేసీఆర్ తో పాటు నేను, కవిత, 16 వ లోక్ సభ ఎం.పీ. లు అందరూ ఉన్నారు.మహిళా రిజర్వేషన్ల కోసం పలు మార్లు పార్లమెంట్ లో నేను గళమెత్తాను.

 

LEAVE A RESPONSE