Suryaa.co.in

Andhra Pradesh

నేరస్తుడి పాలనలో గాల్లో దీపంగా మారిన ఆడబిడ్డలు చిన్నారుల జీవితాలు

• జగన్మోహన్ రెడ్డి చేతగానితనం, నిర్లక్ష్యం ఖరీదు మహిళలు, చిన్నారుల మానప్రాణాలు
• అన్న వచ్చాడు.. ఆడబిడ్డలు చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు, అపహరణలు ఎక్కువయ్యాయి.
• నాలుగేళ్లలో 1,22,000 మంది మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి. ఇదీ అన్నసాధించింది.
• 2019- 2021 మధ్య రాష్ట్రంలో బాలికల అపహరణ పెరుగుదల 53శాతం.
• మహిళలపై జరిగిన నేరాలు, అఘాయిత్యాలు 43.45 శాతం పెరిగాయి.
• మహిళలు చిన్నారుల అపహరణలు, వారిపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి కేంద్రహోంశాఖ నివేదికపై జగన్ సమాధానమేంటి?
– తెలుగు మహి ళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

రాష్ట్రంలో ప్రతి 8 గంటలకు ఒక అత్యాచారం, 8ఏళ్లలోపు చిన్నారులపై 12గంటలకొక రేప్, ప్రతి 12గంటలకు ఒక కిడ్నాప్, ప్రతిగంటకు ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపు లు, ప్రతి మూడు గంటలకు ఒకహత్య, వారానికి సగటున నలుగురు ఎస్సీ, ఎస్టీ మహిళలపై అత్యాచారం, రోజుకి 9మంది బాలికలు, 24మంది మహిళల మిస్సింగ్ .. ఇవీ నాలుగేళ్లలో జగన్ రెడ్డి మహిళాసంక్షేమంలో సాధించిన ప్రగతి అని తెలుగు మహి ళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

“ అన్నవస్తున్నాడు… ఆడబిడ్డల్ని ఉద్ధరిస్తాడని తియ్యటి మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మహిళలు, చిన్నారుల మానప్రాణాలతో ఆటలాడు తున్నాడు. మహిళలు చిన్నారుల మిస్సింగ్, ఇతరఘటనలకు సంబంధించిన వివరా ల్ని కేంద్రహోం మంత్రిత్వశాఖ ఆధారాలతోసహా పార్లమెంట్ ముందు ఉంచింది. ఈ లెక్క లు మేం చెబితే, మాపై ఎదురుదాడిచేస్తారు. మరిప్పుడు కేంద్రహోంమంత్రిత్వ శాఖ నివే దికపై జగన్ రెడ్డి, మహిళామంత్రులు, రాష్ట్రమహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఏం సమాధా నం చెబుతారు?

అత్యాచారాలు, ఇతరదారుణాలకు బలైన బాధితురాళ్లకు రూ.155 కోట్ల పరిహారం ఇచ్చామని హోంమంత్రి చెప్పడం ఆడతనానికే అవమానకరం. మహిళ లు, చిన్నారులు మానప్రాణాలకు ఖరీదు కడతారా.. మీఇళ్లలో ఎవరికైనా ఇలా జరిగితే అలానే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా? జగన్ రెడ్డి, హోంమంత్రి ఇచ్చే రూ.5లక్ష లు, రూ10లక్షలతో బాధితురాళ్లు జీవితాంతం బతికేస్తారా? వారిపై పడిన మచ్చలు తొ లగిపోతాయా?

వాస్తవాలు మాట్లాడామని మాపై తప్పుడుకేసులు పెట్టి, విషప్రచారంచేశారు.. మరిప్పు డు కేంద్రహోం శాఖను ఏమంటారు?
రాష్ట్రంలో రోజుకి సగటున 24 మంది మహిళలు, 9మంది బాలికలు, మొత్తంగా 33 మంది మిస్ అవుతున్నారన్న చేదునిజం నిజంగా ప్రతిపక్షాల్ని, మహిళాలోకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కేంద్రహోం శాఖ వెల్లడించిన వివరాలపై ముఖ్యమంత్రి ఏం సమా ధానం చెబుతాడు? జగన్ రెడ్డి, మంత్రులు ఎవరూ స్పందించరు.. పోనీ డీజీపీ స్పంది స్తాడా అంటే అదీలేదు. నాలుగేళ్లుగా మేం ఆడబిడ్డలు, చిన్నారుల అదృశ్యం,, ఇతర దారుణాలపై గొంతు చించుకుంటుంటే, మాపై తప్పుడుకేసులు పెట్టడం, సోషల్ మీడి యాలో విషప్రచారం చేయడం చేశారు. మరిప్పుడు అదే పని కేంద్రహోంశాఖపై కూడా చేస్తారా?

2019 నుంచి 2021 వరకు చూస్తే, రాష్ట్రంలో బాలికల అపహరణ పెరుగుదల 53శాతం పెరిగింది. మహిళలపై జరిగిన నేరాల పెరుగుదల శాతం 2019 నుంచి 2021 నాటికి 43.45 శాతం పెరిగింది. మొత్తంగా వైసీపీప్రభుత్వంలోనే మహిళల, బాలికల అపహర ణ పెరిగిందని సాక్షాత్తూ ఎన్.సీ.ఆర్.బీ, కేంద్రహోం మంత్రిత్వశాఖ నివేదిక ఇచ్చింది.

మీ దిక్కుమాలిన ప్రభుత్వంలో ఇన్ని దారుణాలు జరిగితే ఏంచర్యలు తీసుకున్నారో చెప్పకుండా లోకేశ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనితలను తప్పుపడతారు. రాష్ట్రంలో నేరాలుఘోరాలు పెరిగినందుకు చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రే పెద్ద నేరస్తుడు. నేరస్తుడు అధికారంపీఠం ఎక్కితే, రాష్ట్రంలో దారుణాలు, నేరాలుఘోరా లు జరక్క, ప్రజాహిత కార్యక్రమాలు జరుగుతాయా? నేరస్తులు జగన్ రెడ్డిని రోల్ మోడ ల్ గా తీసుకొని పేట్రేగిపోతున్నారు.

స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే సిగ్గు, శరం లేకుండా వ్యవహరించిన సందర్భాలు అనేకం. మహిళల్ని వేధించారనే ఆరోపణ లు, అవినీతిఆరోపణలు, ఇతరత్రా కేసులున్నవారే మంత్రివర్గంలో, ఎంపీలు, ఎమ్మెల్యే లుగా ఉంటే, ప్రజలకు, సమాజానికి రక్షణ ఎక్కడ ఉంటుంది? తనచుట్టూ ఉండేవారినే జగన్ రెడ్డి కట్టడిచేయకపోవడంతో, అధికారపార్టీ నేతలు కార్యకర్తలు మరింత బరితెగిం చి ప్రవర్తిస్తున్నారు.

అసమర్థుడి చేతగానితనం వల్లే. 1,22,000మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి
మహిళల రక్షణకు దిశాచట్టం తెచ్చామన్నారు. యువతిపై అత్యాచారానికి తెగబడి, అదే దిశాపోలీస్ స్టేషన్ ముందు పడేశారు. ఆరోజునే జగన్ రాజీనామాచేయాలి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశాచట్టం, పోలీస్ స్టేషన్లు పెట్టామని చెప్పాడుకదా !

ముఖ్యమంత్రి ఆనాడే చర్యలు తీసుకొని ఉంటే నేడు మహిళలు, బాలికల అపహరణ, అత్యాచారాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేదా? జగన్ రెడ్డి చేతగానితనం, నిర్లక్ష్యం అంతి మంగా ఆడబిడ్డలు, చిన్నారుల జీవితాలను గాల్లోదీపాలుగా మార్చాయి. అన్న వచ్చాడు.. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. నాలుగేళ్లలో 1,22,000 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. ఇదీ అన్నసాధించింది.
అన్నవచ్చాడు… అద్భుతాలు సాధించాడు..

నాలుగేళ్లలో 22,278 మంది మహిళలు కనిపించకుండా పోయారు. 7,918 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. మహిళలపై జరిగిన దాడులు 14,438.. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగిన ఘటనలు 6,604.. చిన్నారులపై జరిగిన నేరాలు 7,8 41.. సైబర్ నేరాలు 5,660.. గృహహింసఘటనలు 15,065.. గ్యాంగ్ రేపులు 44.. యాసిడ్ దాడులు 9.. హత్యలు 991.. స్థానికసంస్థల్లో మహిళలపై జరిగిన వేధింపులు 442.. వాలంటీర్ల వేధింపుల ఘటనలు 4,320… ఇవీ అన్న సాధించిన అద్భుతాలు. అధికారికంగా నమోదుకానివి ఇంకా 36,000 ఘటనలుఉన్నాయి.

జగన్ రెడ్డి పాల నలో మహిళల మనుగడ ఎంత దారుణంగా మారిందో చెప్పడానికి ఈ ఘటనలే నిదర్శ నం. ఇన్ని దారుణాలు జరిగినా సిగ్గుశరం లేకుండా ముఖ్యమంత్రి కుర్చీలో కొనసాగు తున్నాడు. స్వతాహాగా నేరస్తుడైన వ్యక్తి పాలనలో మహిళలు, చిన్నారులకు రక్షణ ఉంటుందనుకోవడం అత్యాశే. 16నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తి నేరస్తుల్ని శిక్షిస్తాడా ?

మహిళా కమిషన్ వ్యవహారశైలి హేయాతిహేయం..
మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ముఖ్యమంత్రి ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా ఉంటే, మహిళాకమిషన్, ఆ విభాగం ఛైర్ పర్సన్ వ్యవహారశైలి అ త్యంత హేయాతిహేయం. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దివ్యాంగురాలిపై సామూహి క అత్యాచారం జరిగితే, బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్ర బాబు, మహిళనేతలకు మహిళాకమిషన్ నోటీసులిచ్చింది. ప్రతిపక్షనేత చేసిన నేరం … అత్యాచార బాధితురాలిని పరామర్శించి.. ఆమెకుటుంబానికి అండగా ఉంటానని భ రోసా ఇవ్వడం.

అదే మహిళా కమిషన్ కు రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన అత్యాచారంసహా, అనేక దారుణాలు కనిపించలేదు. రైల్వేస్టేషన్లో భర్త, పిల్లల ఎదుటే కొందరు కామాంధు లు వివాహితపై అత్యాచారానికి తెగబడితే స్పందించలేదు. గుంటూరు జిల్లాలో తుమ్మ పూడిలో ఇంట్లోకి చొరబడి గ్యాంగ్ రేప్ చేశారు. నరసరావుపేటలో అనూష అనే బీ.టెక్ విద్యార్థినిని నడిరోడ్డుపై హత్యచేశారు…రాజమహేంద్రవరంలో చిన్నారిపై సామూహిక అత్యాచారం లాంటి దారుణాలపై స్పందించడానికి మహిళాకమిషన్ కు సమయంలేదు.

అధికారపార్టీ మహిళా ఎమ్మెల్యే మహిళలపై అఘాయిత్యాలు జరిగితున్నాయి అన్నా ప్రభుత్వంలో స్పందనలేదు. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరిగిన దారుణాల్ని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నిస్సిగ్గుగా సమర్థించుకుంటోంది. దేశంలో ఏపీ 11వ స్థానంలో ఉందని, మాకంటే పైన 10రాష్ట్రాలు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటుకాదా? ఆడబిడ్డలు, చిన్నారులపై జరిగే దారుణల్ని నిరోధించకుండా, కేంద్రహోంశాఖ నివేదిక లో తాముసాధించిన స్థానాన్ని సిగ్గులేకుండా సమర్థించుకుంటోంది.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు మహిళలంటే గౌరవం లేదంటా…జగన్ కు బాగా గౌరవమర్యాదలు ఉన్నాయని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ అంటోంది. ముఖ్యమం త్రికి గౌరవమర్యాదలు ఉండబట్టేనా 1.22,000 మంది మహిళలు, చిన్నారులు కనిపించకుండాపోయారు. జగన్ రెడ్డికి మహిళలపై గౌరవం ఉండబట్టేనా సొంత తల్లి, చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేశాడు.. గంట అరగంటా అన్న మంత్రుల్ని, నగ్నంగా ఊరేగి న ఎంపీని పక్కనపెట్టుకొని నవ్వుతున్నాడు.

ఇంతనీచంగా మీ నాయకుడిని సమర్థిం చుకోవడం కరెక్ట్ కాదమ్మా! పవన్ కల్యాణ్ కు నోటీసులిచ్చిన మహిళాకమిషన్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఎందుకివ్వలేదు. ఆయనచేసింది సబబేనని సమర్థిస్తున్నా రా? గంట, అరగంటా అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ కు, ఎందుకు నోటీసులివ్వ లేదు? టీడీపీసహా, ఇతరప్రతిపక్ష పార్టీల మహిళానేతల్ని దూషిస్తూ, అసభ్యకర కామె ట్స్, పోస్టింగ్స్ పెడుతున్నవారికి నోటీసులు ఇవ్వదు. ఎందుకంటే అవన్నీ ఆమెదృష్టి లో నేరాలుఘోరాలు కావు.

ఆడబిడ్డలు చిన్నారుల మానప్రాణాలు కాదు.. బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడటమే జగన్ కు ముఖ్యం
సిగ్గులేని జబర్దస్త్ నటి ఒకామె.. ఒకటి రెండూ ఘటనలకే ఇంతగా ఎందుకు బాధపడు తున్నారని సిగ్గులేకుండా మాట్లాడటం. సాటి ఆడబిడ్డల మానప్రాణాలపై అంత తేలిక గా మాట్లాడుతున్న ఆమెను ఏమనాలి? మహిళలు చిన్నారుల జోలికి వచ్చినవాళ్ల ను దారుణంగా శిక్షిస్తే, ఎవడైనా వాళ్లపై చేయేస్తాడా? ఆపని చేయలేని దద్దమ్మలు మీరు. అందుకే నేరగాళ్లు, కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తున్న మమ్మల్ని దుర్భాషలాడటం, వ్యక్తిత్వహననానికి పాల్పడటం బాగాచేస్తారు. సొంత నియోజక వర్గంలో నాగమ్మ అనే దళితమహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి, ఆమెను చంపేసినప్పుడే జగన్ లో చలనంలేదు.

పొద్దుటూరులో 15ఏళ్లబాలికపై సామూహిక అత్యాచారం జరిగినా సీఎం పట్టించుకోడు. ముఖ్యమంత్రే పట్టించుకోకపోతే పోలీసులు న్యాయంచేస్తారా? డీజీపీ చర్యలు తీసుకుంటాడా? తమబిడ్డలు కనిపించకుండా పోయారని పోలీసులుకు ఫిర్యాదుచేయడానికే తల్లిదండ్రులు భయపడుతున్నారు. హత్యలు, అత్యాచారకేసుల్ని పోలీసులు తమ సెటిల్మెంట్ల కోసం వాడుకుంటున్నారు.

ఆడబిడ్డల ఓట్లతో జగన్ కు పనిలేదు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడటమే. ఇక రాష్ట్రం ఎటుపోయినా, ఆడబిడ్డల జీవితాలు ఏమైపోయినా పరవాలేదు. మహిళలు చిన్నారుల రక్షణను గాలికి వదిలేసిన జగన్, గంజాయి, మాదకద్రవ్యాల్లో మునిగితేలేవారికి అండగా నిలుస్తున్నాడు.” అని అనిత స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE