-నిర్దిష్ట గడువులోపు నియామకాలు జరగాలి
-బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు డిమాండ్
జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం జనవరికి విడుదల చేస్తా అని మోసపు మాటలు పలికి ఓట్లు వేపించుకొని , తీరా కుర్చి ఎక్కాక నాలుగు సంవత్సరాలు నిరుద్యోగ యువత సమయాన్ని నట్టేట ముంచిన జగన్ ?
కళాశాలలు , యూనివర్సిటీల నందు ఖాళీలు , అరకొర కాంట్రాక్టు అధ్యాపకుల వల్ల విద్యాబ్యాసం పూర్తిగా కుంటుపడడం ! యూనివర్సిటీలలో పరిశోధనలు పడకేయడం , చివరకు నూతనంగా విద్యార్థులు సైతం క్యాంపస్ లలో చేరడానికి ముందుకు రాకపోవడమే కాదు ఇటీవల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు న్యాక్ ర్యాంక్ లు సైతం పడిపోవడానికి కారణం వైకాపా నే కాదా !!
ఈ పరిణామాల మీద ఆగ్రహించి మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వడంతో, జడిసి ఓట్ల కోసం ఎన్నికల ముందు గ్రూప్ 1 , 2,పోస్టులకు నోటిఫికెషన్స్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడాన్ని, అర్థం చేసుకోలేనంత అమాయకులు లేరు ముఖ్యమంత్రి గారు? ఇవ్వబోతున్న నోటిఫికెషన్స్ కి గడువు లోపు నియామకాలు జరగాలి. మీ కాలయాపన వల్ల నష్టపోయిన వయస్సు అర్హత ను సడలించి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తుంది .. వయస్సు సడలించక పొతే నిరుద్యోగ యువత పక్షాన బిజెపి నిలుస్తుంది.