Suryaa.co.in

Andhra Pradesh

తిరుమల స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న మంత్రి చెల్లు బోయిన

తిరుమల, ఏప్రిల్ 15: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వ ర స్వామి వారికి జరుగుతున్న వసం తోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వర్ణ రథోత్సవం తిరుమలలో నేత్ర పర్వంగా నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత శ్రీ మలయ ప్ప స్వామి వారు స్వర్ణ రథంలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

ఈ స్వర్ణ రథోత్సవం లో టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి దంపతులు, సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్ర సమా చార పౌర సంబం ధాల, సినిమాటోగ్రఫీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ పాల్గొన్నారు.

ఈ స్వర్ణ రథోత్సవంలో టిటిడి చైర్మన్ తో పాటు రాష్ట్ర సమాచార పౌర సంబం ధాల శాఖ మంత్రి, ఈవో జవహర్ రెడ్డి తదితరులు, భక్త బృందం అంతా కలసి గోవింద నామస్మరణతో మా స్వర్ణరథాన్ని లాగారు.

అంతకుమునుపు విఐపి బ్రేక్ సమయంలో ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి దర్శించుకున్నారు… అనంతరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరి కాయ లు కొట్టి మొక్కులు చెల్లించుకొని అక్కడే ఉన్న బేడి ఆంజ నేయ స్వామి వారిని మంత్రి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు

LEAVE A RESPONSE