Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం దివాళా

బీజేపీ పాలనలో అధోగతిలో దేశం
గతంలో ఎట్లుండే? ఇప్పుడు ఎట్లున్నది?
ప్రభుత్వాల పరిపాలన ఎలా ఉందో ప్రజలు విశ్లేషించుకోవాలి
కెసిఆర్ వచ్చాకే వ్యవసాయం పండుగ అయింది
ప్రాజెక్టుల వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి
కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శం
మన రాష్ట్రం ఆచరిస్తున్నది… దేశం అనుసరిస్తున్నది
తెలంగాణ మాడల్ దేశానికి అవసరం
చారిత్రాత్మక పాలకుర్తిలో చరిత్రలో లేనంత అభివృద్ధి
గూడూరు, పాలకుర్తి ఆత్మీయ సమ్మేళనాలలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

గూడూరు, తొర్రూరు (పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం), జూన్ 14: కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం దివాళా తీసింది. బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైంది. గతంలో ఎట్లుండే? ఇప్పుడు ఎట్లున్నది ప్రభుత్వాల పరిపాలన ఎలా ఉందో ప్రజలు విశ్లేషించుకోవాలి. కెసిఆర్ వచ్చాకే వ్యవసాయం పండుగ అయింది. ప్రాజెక్టుల వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి. కెసిఆర్ చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శం. మన రాష్ట్రం ఆచరిస్తున్నది… దేశం అనుసరిస్తున్నది. తెలంగాణ మాడల్ దేశానికి అవసరం. ఇక చారిత్రాత్మక పాలకుర్తిలో చరిత్రలో లేనంత అభివృద్ధి చేసి చూపించాము. ఇదంతా మనం ప్రజలకు చెప్పుకోవాలి. ప్రజలను చైతన్యం చేయాలి అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

14 ఏళ్ల ఉద్యమ ఫ‌లితంగా ఆవిర్భ‌వించిన తెలంగాణ‌లో ఉద్య‌మ సారథి కెసిఆర్‌ సీఎం కావ‌డం మన అందరి అదృష్ట‌మ‌ని, అమ‌రుల ఆశ‌యాలు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా స్వ‌రాష్ట్రంలో సిఎం కెసిఆర్ పాల‌న సాగుతుందని, దేశంలో ఎక్క‌డా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు ప్రతి ఇంటికి చేరాయని , మన రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా తీర్చిదిద్ది అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా చేసిన ఘ‌న‌త మ‌న సీఎం కెసిఆర్ గారికే ద‌క్కుతుంద‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు అన్నారు. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను కూడా తిప్పి కొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు, పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం పాలకుర్తి మండ‌లం గూడూరు, తిరుమల గిరి, కిష్ట పురం, నర్సింగా పురం తండా, గోపాల పురం, ఈరవెన్ను, కోతుల బాద్ గ్రామాలను కలిపి గూడూరు లో, ఎల్లరాయని తొర్రూరు, లక్ష్మీ నారాయణ పురం, తీగారం, శాతపురం, దుబ్బ తండా ఎస్, అయ్యగారి పల్లె గ్రామాలను కలిపి పాలకుర్తి లోని ఓ ఫంక్ష‌న్ హాలులో బుధవారం నిర్వ‌హించిన‌ ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, చావు నోట్లో తల‌పెట్టి తెలంగాణ‌ను తెచ్చిన కెసిఆర్ సీఎం కావ‌డంతో తెలంగాణ అవ‌స‌రాలు, అభివృద్ధిపై అవ‌గాహ‌న ఉన్న ఆయ‌న నేతృత్వంలో తెలంగాణ‌లో అద్భుత అభివృద్ధి, సంక్షేమాలు సాధ్య‌వుతున్నాయ‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయ‌ని మంత్రి తెలిపారు. ఆయా ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ, ఆ ప‌థ‌కాల ప్రాముఖ్యాన్ని ప్ర‌జ‌ల‌కు, పార్టీ శ్రేణుల‌కు అర్థం చేశారు.

గతంలో, ప్రస్తుతం పరిపాలన ఎట్లా వుందో ప్రజలు విశ్లేషించుకోవాలి అని అన్నారు. సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కట్టిన ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం దివాలా తీసింది అందరికీ తెలిసిందే అన్నారు ప్రస్తుత బీజేపీ పాలనలో ఎల్.ఐ.సి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా దేశం అధోగతి పాలు అయిందన్నారు . రైతుల‌కు ఇస్తున్న ఉచిత 24 గంట‌ల విద్యుత్ వెనుక సీఎం కెసిఆర్ చొర‌వ‌తో ప్ర‌తి ఏటా రైతుల త‌ర‌పున 10వేల 500 కోట్ల రూపాయ‌ల‌ను విద్యుత్ సంస్థ‌కు క‌డుతున్నార‌న్నారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతాంగానికి ఎదురు పెట్టుబ‌డిగా రైతు బంధును ఇస్తున్నార‌ని చెప్పారు. రైతు బీమా ప‌థ‌కం ప్రీమియం క‌ట్ట‌డ‌మేగాక‌, ఏ కార‌ణం చేత‌నైనా రైతు చ‌నిపోతే అతని కుటుంబానికి 10 రోజుల్లోపు రూ.5 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం అందిస్తున్నది కూడా ఒక్క తెలంగాణ ప్ర‌భుత్వ‌మేన‌న్నారు. చివ‌ర‌కు రైతుల పంట‌ల‌ను కూడా కొనుగోలు చేస్తున్న విష‌యాన్ని మంత్రి వివ‌రించారు.

సీఎం కెసిఆర్ గారు వచ్చాకే వ్యవసాయం అందరికీ పండుగ అయ్యింది అన్నారు.ఏడాదికి 30వేల కోట్ల న‌ష్టం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర పెట్టి వారి పండించిన ధాన్యాన్ని, మక్క‌ల‌ను కొనుగోలు చేస్తున్నార‌న్నారు.

టూరిజం అభివృద్ది
పాలకుర్తి చారిత్రాత్మక ప్రాంత ప్రాశస్త్యాన్ని సీఎం కెసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పాలకుర్తి, బమ్మెర, వల్మీడి, చెన్నూరు లను కలుపుతూ .. టూరిజం కారిడార్ ను అభివృద్ది చేస్తున్నాం అని అన్నారు. త్వరలో సీఎం కెసిఆర్ లేదా మంత్రి కేటీఆర్ లతో అభివృద్ది పనులు ప్రారంభించుకుందాం అన్నారు

అర్హులైన వాళ్ళంద‌రికీ త్వ‌ర‌లోనే పెన్ష‌న్లు
57 ఏండ్లు నిండిన‌, అర్హులైన అంద‌రికీ త్వ‌ర‌లోనే పెన్ష‌న్లు అంద‌చేస్తామ‌ని మంత్రి తెలిపారు. ఇటీవ‌లే ఈ ప‌థ‌కం కింద అనేక మందికి పెన్ష‌న్లు ఇస్తున్నామ‌ని, అయితే ఇందులో అనేకానేక కార‌ణాల వ‌ల్ల కొంద‌రి పేర్లు రాలేద‌ని అంటున్నారని, అలాంటి వాళ్ళల్లోనూ అర్హులైన వారంద‌రికీ త్వ‌ర‌లోనే పెన్ష‌న్లు అందేలా చేస్తామ‌ని మంత్రి వివ‌రించారు.

మ‌హిళా సాధికార‌త దిశ‌గా ఉచిత కుట్టు శిక్ష‌ణ‌, మిష‌న్ల పంపిణీ, ఉపాధి, ఉద్యోగావ‌కాశాలు
మ‌హిళ‌లు బాగుప‌డితేనే దేశం బాగుప‌డ‌త‌ది. అందుకే మ‌హిళ‌ల‌కు ఎక్క‌డా లేని విధంగా నియోజ‌క‌వ‌ర్గంలో ఉచితంగా కుట్టు శిక్ష‌ణ‌, మిష‌న్ల పంపిణీ, ఉపాధి, ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. అలాగే నిరుద్యోగ యువ‌కుల కోసం కూడా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్న‌ట్లు మంత్రి వివ‌రించారు.

ఒక్కో మండ‌లాన్ని రూ.100 కోట్ల‌తో అభివృద్ధి చేశాను
తాను మంత్రి అయ్యాక పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కో మండ‌లానికి రూ.100కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టిన‌ట్లు మంత్రి వివ‌రించారు. మండ‌ల కేంద్రాల్లో సెంట్ర‌ల్ లైటింగ్ సిస్ట‌మ్‌, రోడ్ల వెడ‌ల్పు, అన్ని గ్రామాల‌కు లింకు రోడ్లు, ఉన్న రోడ్ల‌ను డ‌బుల్ రోడ్లుగా మార్చ‌డం, అంత‌ర్గ‌త రోడ్లు, డ్రైనేజీలు ఇలా అనేక మౌలిక వ‌స‌తుల‌ను గ్రామాల‌కు క‌ల్పించిన‌ట్లు మంత్రి వివ‌రించారు. కొత్త గ్రామ పంచాయ‌తీల‌కు కూడా కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి, ప‌లు అభివృద్ధి ప‌నులు చేపట్టామ‌ని మంత్రి వివ‌రించారు.

మ‌నం చేసుకుంటున్న అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు చెప్పుకుందాం
తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ధి ఉత్స‌వాలు నిర్వ‌హించుకుంటున్న సందర్భంలో మ‌నం చేసుకున్న, చేసుకుంటున్న అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌తి పార్టీ కార్య‌క‌ర్త మీదా ఉంద‌న్నారు. చేసిందే చెప్పుకుందాం. ఇంకా చేయాల్సింది ఉంటే, ఆయా ప‌నులు వేగంగా పూర్తి చేసుకుందామ‌న్నారు.జరిగిన అభివృద్ది కళ్ళ ముందే కనబడుతుందని సిఎం కెసిఆర్ కు అండ‌గా నిల‌వాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

తాను నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాన‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను క‌డుపులో పెట్టుకుని చూస్తున్న‌ద‌ని, ప్ర‌జ‌లు సీఎం కెసిఆర్ కి అండ‌గా నిలవాల‌ని, సీఎం కెసిఆర్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌కు వ‌చ్చిన పార్టీ శ్రేణుల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆత్మీయంగా ప‌ల‌క‌రించారు. ఆత్మీయ స‌మ్మేళ‌నాల ప్రాధాన్యాన్ని పార్టీ శ్రేణుల‌కు వివ‌రించారు. వారి బాగోగులు తెలుసుకున్నారు.

అంత‌కుముందు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కి ఆయా గ్రామాల ప్ర‌జ‌లు, పార్టీ శ్రేణులు మేళ తాళాల‌తో, డ‌ప్పు వాయిద్యాల‌తో, బ‌తుక‌మ్మ‌ల‌తో, బోనాల‌తో, సంప్ర‌దాయ కోలాట నృత్యాల‌తో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. వేదిక మీద మంత్రి ఎర్ర‌బెల్లిని ఘ‌నంగా సన్మానించారు. త‌న‌కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా, ఈ ఆత్మీయ‌ స‌మ్మేళ‌నంలో సిఎం కెసిఆర్ సందేశాన్ని చ‌దివి వినిపించారు.ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ ముఖ్య నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, ప‌లువురు ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE