• ’జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకం’ లో భాగంగా అయిన వారికి దోచిపెట్టడానికి అడ్డగోలుగా రూల్స్ కు విరుద్ధంగా గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్న జగన్ రెడ్డి
• రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు ఒక గ్యారెంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, రాష్ట్ర సంపద దోపిడీకి గ్యారెంటీనిచ్చే పెత్తందారు జగన్ రెడ్డి
• జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో తనకు నచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులకు ప్రజలసొమ్ము దోచిపెట్టడానికి వీలుగా ముఖ్యమంత్రి గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నాడు
• ఫైనాన్షియల్ రూల్స్ కు విరుద్ధంగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫలానా తేదీన మీకు చెల్లింపులు చేస్తామని అడ్డగోలుగా తమకు నచ్చిన సంస్థలకు గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నారు
• ఎంత మొత్తం కమీషన్లు తీసుకొని ఈ విధంగా నచ్చిన సంస్థలు..వ్యక్తులకు గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నారో బురిడీ బుగ్గన సమాధానం చెప్పాలి
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ రెడ్డి సరికొత్త స్కీములు ప్రకటిస్తున్నా డని, తాజాగా ఆ కోవలో జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకానికి తెరలేపాడని, అస్మ దీయులకు అంటే తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా ప్రజలసొమ్ము దోచిపె ట్టడానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడని, పనులు చేసినా..చేయకపోయినా మెగా ఇంజనీరింగ్, పుంగనూరు పుడింగి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పీఎల్ఆర్ లాంటి వాటికి దోచిపెట్టేందుకు ఏకంగా ప్రభుత్వ గ్యారెంటీలు ఇస్తూ దోపిడీ గ్యారెంటీ స్కీమ్ కు ముఖ్యమంత్రి తెరలేపాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వివరించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారికి భవిష్యత్ లో (వచ్చే ఆర్థికసంవత్సరం) ఏ రోజు ఎంత చెల్లిస్తామో వివరిస్తూ జగన్ రెడ్డి సర్కార్ ముందుగానే గ్యారెంటీ లెటర్స్ ఇస్తోంది. అలాంటి టెటర్స్ తీసుకున్న కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులు నేరుగా బ్యాంకుల్ని కలిసి, తమకు ఫలానా రోజు ప్రభుత్వం నుంచి ఇంత మొత్తం వస్తుందని చెప్పి రుణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పోలవరం పనుల కాంట్రాక్ట్ పొందిన మెగా ఇంజనీరింగ్ సంస్థకు దోచిపెట్టడానికి జగన్ రెడ్డి సర్కార్ ఏకంగా 7 గ్యారెంటీ లెటర్స్ ఇచ్చేసింది.
ఏ నిబంధనల ప్రకారం.. మెగా ఇంజనీరింగ్ సంస్థకు 7 గ్యారెంటీ లెటర్స్ ఇచ్చావు జగన్ రెడ్డి?
మే – 8 2024న రూ.56కోట్ల చెల్లింపునకు సంబంధించి గ్యారెంటీ లెటర్ ఇచ్చారు. అలానే మే -15 2024న మరో రూ.34 కోట్లకు, అదేరోజున మరో రూ.66 కోట్లకు, మే 22, 2024న రూ.30,31,34,738 లకు గ్యారెంటీ లెటర్ ఇచ్చారు. అలానే మే 29న రూ.31కోట్లకు, ఆగస్ట్ 28, 2024న మరో రూ.35 కోట్లకు లెటర్స్ ఇచ్చారు. ఈ విధంగా సమారు రూ.255 కోట్ల చెల్లింపునకు సంబంధించి జగన్ రెడ్డి గ్యారెంటీ లెటర్స్ ఇచ్చాడు. ఈ లెటర్స్ తీసుకొని మెగా ఇంజనీరింగ్ సంస్థ వారు నేరుగా రుణాలు ఇవ్వాలని కోరుతూ కెనరా బ్యాంక్ ను సంప్రదించారు.
పైకి కనిపిస్తున్న వి ఈ 7 లెటర్సే. ఇంకా తెలియకుండా ఎన్ని ఇచ్చారో తెలియదు. ఈ విధంగా ప్రభుత్వ డబ్బులు తీసుకుంటున్న మెగా సంస్థ పోలవరం పనులు చేస్తుందా అంటే అదేమీలేదు. నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో పోలవరం పనులు నాలుగు శాతం కూడా పూర్తికాలేదంటే ఈ ప్రభుత్వం.. నిర్మాణ పనుల కాంట్రాక్ట్ పొందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎంతబాగా పనులు చేస్తున్నాయో అర్థం చేసుకో వచ్చు.
మరలా అధికారంలోకి వచ్చేది లేదని తెలిసే జగన్ రెడ్డి తన బినామీ సంస్థలు.. వ్యక్తులకు ఇలా గ్యారెంటీ లెటర్స్ రూపంలో ప్రజలసొమ్ము దోచిపెడుతున్నాడు
ఈ ప్రభుత్వ బడ్జెట్ ఇప్పుడు 2024 మార్చి వరకే ఆమోదం పొందింది. 2024-25 బడ్జెట్ ఇంకా శాసనసభలో ప్రవేశపెట్టకముందే.. శాఖలవారీగా నిధుల కేటాయింపు జరక్కముందే జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన.. ఏ నిబంధనల ప్రకారం వచ్చే ఆర్థికసంవత్సరంలో ఫలానా తేదీన ఇంత మొత్తం చెల్లిస్తామని ఏ లెక్కన గ్యారెంటీ లెటర్స్ ఇస్తోంది. ఫైనాన్షియల్ రూల్స్.. బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా ఇలాలెటర్స్ ఇవ్వడం ముమ్మాటికీ చట్టవిరుద్ధం. ఇదే విషయాన్ని అధికారులు నోట్ ఫైల్ పై రాసినా.. కిందిస్థాయి అధికారులు కొందరు హెచ్చరిం చినా కూడా ముఖ్యమంత్రి ఐ డోంట్ కేర్ అంటూ నియంత్రత్వ పోకడలతో ఈ విధంగా లెటర్స్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టీ మరీ ఇలా చేస్తున్నాడు.
భవిష్యత్ లో ఎలాగూ ప్రజలు తనకు..తన పార్టీకి అవకాశమివ్వరని గ్రహించే నిబంధనలకు విరుద్ధంగా ఇలా తనకు నచ్చిన వ్యక్తులు.. సంస్థలకు గ్యారెంటీ లెటర్స్ ఇప్పిస్తున్నాడు. దానికి ప్రతిఫలంగా తనకు కావాల్సినంత వాళ్లవద్ద నుంచి దోచుకుంటున్నాడు. దీనిపై పిట్టకథల మంత్రి బుగ్గన ఏం సమాధానం చెబుతాడ ని ప్రశ్నిస్తున్నాం. ఈవిధంగా గ్యారెంటీ లెటర్స్ఇవ్వడం జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో భాగంగా ఇస్తున్నవో కాదో బుగ్గన చెప్పాలి.
నచ్చిన సంస్థలు, వ్యక్తులకేనా జగన్ రెడ్డి.. పేదల ఆరోగ్యానికి గ్యారెంటీ ఇవ్వవా? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతున్నా 1000కోట్ల బకాయిలు చెల్లించవా?
నచ్చిన సంస్థలు… వ్యక్తులకు ఈ విధంగా దోచిపెట్టడంలో ముందున్న జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం నెట్ వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి మాత్రం నిధులు లేవంటోంది. ఇప్పటికే రాష్ట్రంలోని నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోతే వెంటనే వైద్యసేవలు నిలిపివే స్తామని మొత్తుకుంటున్నది నిజంకాదా? జగన్ రెడ్డి సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందిస్తున్న నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.1000కోట్లకు పైబడి బకాయి ఉన్నది నిజంకాదా?
ఆ మొత్తం నవంబర్ 27 లోగా (కేవలం 6 రోజుల్లో) చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపివేస్తామని ఇప్పటికే జగన్ సర్కార్ కు అల్టిమేటం జారీ చేసింది నిజం కాదా? కాంట్రాక్ట్ సంస్థలు.. నచ్చిన వారికి గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్న జగన్ రెడ్డి పేదల ఆరోగ్యానికి మాత్రం ఎలాంటి గ్యారెంటీలు ఇవ్వడా? పెద్దిరెడ్డి కాంట్రాక్ట్ సంస్థ పీ.ఎల్.ఆర్.. మెగా ఇంజనీరింగ్ సంస్థలకు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధలో సగంకూడా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లింపులో ముఖ్యమంత్రి ఎందుకు చూపడంలేదో ప్రజలకు చెప్పాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆసుపత్రులకు రూ.1000 కోట్లు కట్టలేని ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి కొత్తగా ‘జగనన్నసురక్ష’ అని కొత్త నాటకాలు మొద లెట్టాడు.
మెడికల్ క్యాపులు..హెల్త్ క్యాంపులని ఎన్నాళ్లు ప్రజల్ని మోసగిస్తారు? దీనిపై వైద్యఆరోగ్య శాఖా మంత్రి విడదల రజనీ ఏం సమాధానం చెబుతుంది? ప్రజలకు వైద్యసేవలు అందించిన ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించలేని ఈ ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాడా? అలా చెప్పేవారికి సిగ్గుందా? బకాయిలు చెల్లించని పరిస్థితుల్లో నవంబర్ 27 తర్వాత పేదల ఆరోగ్యానికి గ్యారెంటీ ఏమిటి?
వివిధ అభివృద్ధి ప్రాజెక్ట్ లు, పనులు చేసిన సంస్థలు, వ్యక్తులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్ల సంగతేంటి జగన్ రెడ్డి?
కావాల్సిన కాంట్రాక్టర్లకు.. నచ్చిన సంస్థలకు గ్యారెంటీ లెటర్స్ఇస్తున్న జగన్ రెడ్డి.. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కింద పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులకు మాత్రం రూ.30 వేలకోట్లు బకాయి పెట్టాడు. ఈ బకాయిల చెల్లింపులు ఎప్పుడు చేస్తాడో ముఖ్యమంత్రి చెప్పాలి? ఇప్పటికే అలాంటి వారంతా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పనులన్నీ నిలిపివేశారు. అయినా సరే ముఖ్యమంత్రిలో చలనంలేదు. బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డిండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విభాగం వారు ఇప్పటికే రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు.
పలుచోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు అందరూ బకాయిలు చెల్లించాల్సించే అంటూ చేస్తున్న పనులు ఆపేసినా జగన్ రెడ్డికి చీమకుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు చెల్లించడానికి జగన్ రెడ్డికి మనసురాదా? ఏమాత్రం పనులు చేయకపోయినా పీఎల్ఆర్.. మెగా ఇంజనీరింగ్.. షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ వంటి తన వారిసంస్థలకు దోచి పెట్టడానికి మాత్రం మనసు ఉరకలేస్తుందా?
రోడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయినా.. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయమైనా.. కాంట్రాక్టర్లు రోడ్డు పనులు చేయమని తెగేసి చెబుతున్నా… వారికివ్సాల్సిన సొమ్ముకు గ్యారెంటీ లేదా జగన్ రెడ్డి?
ఏఐబీ, ఎన్.డీ.బీ పనులకో దండం… మేం పనులు వదిలేస్తున్నామని రోడ్లు వేస్తున్న కాంట్రాక్ట్ సంస్థలు.. కాంట్రాక్టర్లు మొత్తుకుంటుంటే జగన్ రెడ్డికి కనిపించడం లేదా? చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న అన్నిరకాల రోడ్లు వేయడానికి గతంలోనే అనేక చర్యలు తీసుకున్నారు. చాలావరకు ప్రధాన రోడ్లు వేయడం పూర్తైంది కూడా. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం చంద్రబాబు ఏఐబీ (ఏషియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్), ఎన్.డీ.బీ (న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్) నుంచి రూ.6400 కోట్ల రుణం తీసుకొస్తే… జగన్ రెడ్డి ఆ డబ్బులన్నీ మింగేసి, నాలుగేళ్లలో రోడ్లను నరకానికి నకళ్లుగా మార్చాడు.
జగన్ రెడ్డి నిర్వాకంతో ఎన్.డీ.బీ పనులు మేం చేయమని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు. రహదారుల కాంట్రాక్టర్లకు బకాయి లు ఇవ్వకపోవడంతో ఎవరూ రోడ్లువేయడానికి.. ఆఖరికి కనీసం గుంతలు పూడ్చటానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. రాష్ట్రంలో రోడ్లకు గ్యారెంటీ ఇవ్వవా జగన్ రెడ్డి? నీ పరిపానలలో గుంతల రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేదా జగన్ రెడ్డి?
ప్రజల దాహాం తీర్చే తాగునీటి సరఫరా కాంట్రాక్టర్లకు.. వాటర్ ట్యాంకర్ల యాజమాన్యాల బకాయిల చెల్లింపులకు గ్యారెంటీ లేదా జగన్ రెడ్డి?
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు, ట్యాంకర్ల యజమానులు బకాయిలు కోసం గొంతు ఎండేలా గోలపెడుతున్నారు. ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ యజమానులకు.. ఒక్క ప్రకాశం జిల్లాలోనే జగన్ రెడ్డి రూ.130కోట్లు బాకీ పెట్టాడు. ప్రజల దాహార్తిని తీర్చే వాటర్ ట్యాంకర్ల బకాయిల చెల్లింపుకు కూడా గ్యారెంటీ లేదా జగన్ రెడ్డి?
కోవిడ్ సమయంలో ఆసుపత్రులకు మాస్కులు… ఆక్సిజన్ సిలిండర్లు..ఇతర పరికరాలు అందించిన కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలకు గ్యారెంటీ లేదా జగన్ రెడ్డి?
తాను చెల్లించాల్సిన సొమ్ము చెల్లించడు. ఏదోరకంగా బకాయిలు రాబట్టుకోవాలని ఎవరైనా ఈ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తే వారికి బెదిరింపులు. డబ్బులు ఇవ్వమని.. టెండర్లు రద్దుచేస్తామని.. ఇకపై టెండర్లు వేయకుండా అనర్హులుగా ప్రకటిస్తామని భయపెట్టడం..ఇదీ జగన్ రెడ్డి వరస. కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు .. మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతరత్రా పరికరాలు సరఫరా చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు ఇప్పటికీ జగన్ రెడ్డి బకాయిలు చెల్లించలేదు. తమకు రావాల్సిన సొమ్ము ఇవ్వాలని లేకుంటే కోర్టులకు వెళ్తామని సదరు సంస్థలు చెబుతుంటే.. వాటిని బెదిరిస్తారా? కోర్టుకు వెళ్తే టెండర్లు వేయనీయమని భయపెడతారా?
గతంలో ఏపీఎండీసీ ద్వారా ఇసుకసరఫరా చేసిన లారీ యజమానులు.. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలకు గ్యారెంటీ లేదా జగన్ రెడ్డి?
ఇసుక తవ్వకాలు.. సరఫరాకు సంబంధించి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ రంగంలోకి దిగకముందు, ఏపీ ఎండీసీ ద్వారా 2019 నుంచి 2021 వరకు ఇసుక సరఫరా చేసిన లారీ యజమానులు.. కాంట్రాక్టర్లకు నేటికీ ఇసుకాసురుడు జగన్ రెడ్డి బిల్లులు చెల్లించలేదు. ఈ ముఖ్యమంత్రి మాకు బాగా శాస్తి చేశాడని వారం తా వారిచెప్పులతో వాళ్ల చెంపలే వాయించుకుంటున్నారు. ఇసుకదోపిడీతో గత నాలుగేళ్లలో రూ.40వేలకోట్లు దిగమింగిన జగన్ రెడ్డికి.. గతంలో ఇసుకసరఫరా చేసిన వారికి ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వడానికి మాత్రం చేతులు రావడంలేదు. వారికి చెల్లించాల్సిన బకాయిలకు నీ ప్రభుత్వంలో గ్యారెంటీ లేదా ఇసుకాసురా?
అన్నమయ్యప్రాజెక్ట్ దుర్ఘటనలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారపు సొమ్ముకు గ్యారెంటీ లేదా జగన్ రెడ్డి?
అన్నమయ్యప్రాజెక్ట్ దుర్ఘటన రాష్ట్రప్రజలకు తెలిసిందే. జగన్ రెడ్డి అతని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడపజిల్లాలోని చెయ్యేరు నదిపై ఉన్న అన్నమయ్యప్రాజెక్ట్ కొట్టుకు పోయి రాత్రికిరాత్రి అనేక గ్రామాలు నీట మునిగాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 33 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే, వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయి రెండేళ్లు దాటింది. అయినా ఒక్కకుటుంబానికి కూడా ఈ కసాయి జగన్ రెడ్డి నేటికీ పైసాఇవ్వలేదు. ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులకు రూ.640కోట్లతో జగన్ రెడ్డి టెండర్లు పిలిచాడు.
కానీ ఒక్కరూపాయి కూడా విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభించడానికి గుత్తేదారు సంస్థ ముందుకు రావడం లేదు. జగన్ ప్రభుత్వ నిర్వాకంవల్ల అన్నమయ్య ప్రాజెక్ట్ దుర్ఘటనలో సర్వంకోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారపు సొమ్ముకు గ్యారెంటీ ఇవ్వవా జగన్ రెడ్డి? ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల దిక్కులేనివిగా మిగిలిన వందల కుటుంబాలు నీ కళ్లకు కనిపించడం లేదా జగన్ రెడ్డి?
తనకు కమీషన్లు ఇచ్చే వ్యక్తులు..సంస్థలు బాగుంటే చాలు.. ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా జగన్ రెడ్డికి పట్టదు
ఈ విధంగా న్యాయంగా.. ధర్మంగా ఇవ్వాల్సిన వారికి డబ్బులివ్వకుండా తనకు కమీషన్లు ఇచ్చేవారికి… తన బినామీ సంస్థలకు.. తన పార్టీ వారికి మాత్రం జగన్ రెడ్డి అప్పనంగా ప్రజలసొమ్ము దోచిపెడుతున్నాడు. ఆ సొమ్ముచెల్లింపులకు ఏకంగా ఫైనాన్షియల్ రూల్స్ కు విరుద్ధంగా గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నాడు. ఈ విధంగా లెటర్స్ ఇవ్వడం ఎంతవరకు సరైందో ముఖమంత్రి.. పిట్టకథల మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలి. ఈ విధంగా గ్యారెంటీ లెటర్స్ ఇవ్వడం జగనన్న దోపిడీ పథకం కాక మరేమిటి? ప్రజల ఆరోగ్యం.. గుంతలమయమైన రోడ్లు… తాగునీటిసరఫరా…ఇసుకసరఫరా.. కోవిడ్ సమయంలో వైద్యపరికరాలు అందించినవారు.. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితులు.. వీళ్లెవరూ జగన్ రెడ్డికి కని పించరు.
వారు ఏమైపోయినా.. ఆఖరికి రాష్ట్రమే చంకనాకిపోయినా ఈ ముఖ్య మంత్రికి పట్టదు. తనబినామీలు…తన మంత్రులు.. తన ఎమ్మెల్యేలు.. తనకు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్ట్ సంస్థలు బాగుంటేచాలు.. వారికి దోచిపెట్టడమే నిజమైన ప్రజాసంక్షేమం అన్నట్టు వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాసంక్షేమ పాలన? జగన్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చిన ‘జగనన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్’ అసలు గుట్టుని ప్రజలు గ్రహించాలి. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు గ్యారెంటీ అందించే ప్రజా నాయకుడు చంద్రబాబు అయితే, రాష్ట్ర సంపద ప్రజలసొమ్ము దోపిడీకి గ్యారెంటీనిచ్చే పెత్తందారు జగన్ రెడ్డి అనే నిజాన్ని ప్రతిఒక్కరూ తెలుసు కోవాలి. ఎంతమొత్తం కమీషన్లు తీసుకొని ఈ విధంగా నచ్చినసంస్థలు..వ్యక్తులకు గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నారో బురిడీ బుగ్గన సమాధానం చెప్పాలి ” అని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.