Suryaa.co.in

Telangana

నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి: గద్దర్

సీఎల్పీ నేత భట్టిని కలిసి వినతిపత్రం ఇచ్చిన గద్దర్

నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ప్రజాయుద్ధ నౌక గద్దర్ బుధవారం సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్ష నేత భట్టి విక్రమార్క కు వినతి పత్రం అందజేశారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. అదే విధంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

 సీఎల్పీ నేత భట్టి, గద్దర్ మధ్య ఆసక్తికరమైన చర్చ…
జాతిని ఏకం చేయడానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర లో పాల్గొనాలని గద్దర్ ను కోరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలంగాణలోకి ఎంటర్ అయ్యాక భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తా అని చెప్పిన గద్దర్. కాంగ్రెస్ పార్టీలో చేరి పార్లమెంటరీ డెమోక్రసీలో పాల్గొని పార్లమెంటుకు పోటీ చేయాలని గద్దర్ ను కోరిన భట్టి. దానికి సానుకూలంగా స్పందించిన గద్దర్. పెద్దపల్లి పార్లమెంట్ కు పోటీ చేయాలని గద్దర్ కు విజ్ఞప్తి చేసిన Ex mlc ప్రేమ్ సాగర్ రావు…

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె. ప్రేమ్ సాగర్ రావు, ఆలిండియా ఎస్సీ ఎస్టీ కాన్ఫిడ్రేషన్ అధ్యక్షులు మహేష్ రాజ్, నాయకులు దయానంద్, డి. పవన్ కుమార్, హనుమంతరావు, చేతన్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE