– హామీలు అమలు కాకపోతే కాంగ్రెస్ నేతల వీపులు పగులుతాయి
– ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఓ గఫ్లత్ ఎమ్మెల్యే
– మాజీ మంత్రి సి .లక్ష్మా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , మర్రి జనార్ధన్ రెడ్డి, ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్
హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు పై మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దాంట్లో తప్పేముంది ? తెలివి లేకనే తిక్క మాటలు మాట్లాడుతున్నారు. శ్రీశైలం కు వరద వచ్చి 35 రోజులవుతున్నా నీళ్లు వాడుకోవడం లేదంటే తప్పా ?
పోతిరెడ్డి పాడు నుంచి ఏపీ వాళ్ళు నీళ్లు తరలించుకు పోతుంటే తెలంగాణ ప్రభుత్వానికి కల్వకుర్తి లిఫ్ట్ ను ఆన్ చేసే సోయి లేదా? పాలమూరు నుంచి వలసలు ఆపింది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నపుడే పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయి.
హరీష్ రావు రేయింబవళ్లు పాలమూరు లోనే ఉండి ప్రాజెక్టుల పూర్తికి ప్రయత్నించారు. ఏడు లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారానే నీరిచ్చిన ఘనత లో హరీష్ రావు కృషి ఉంది. మరో మూడు లక్షల ఎకరాలకు చెరువులు చెక్ డ్యామ్ ల ద్వారా నీళ్లిచ్చాము.
హరీష్ రావు సూచనను స్వాగతించాలి తప్ప విమర్శించ కూడదు. కాళేశ్వరం పై కూడా తెలివి తక్కువ తనం తోనే మాట్లాడుతున్నారు.లక్ష కోట్ల ఖర్చు కూడా కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ఎలా అంటారని రేవంత్ మామే అన్నారు.
తప్పుడు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలే తంతారు. ఫోన్ ట్యాపింగ్ లో మీడియా లో వస్తున్న కథనాలు పచ్చి అబద్దాలని తేలిపోయింది. కట్టు కథలతో కాంగ్రెస్ నేతలు ప్రజలను ఎక్కువ కాలం నమ్మించలేరు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఓ గఫ్లత్ ఎమ్మెల్యే . పదమూడు వందల ఓట్ల తో గెలిచి ఏడు సార్లు గెలిచిన హరీష్ రావు మీద విమర్శలు చేస్తారా ? మైక్ దొరికితే పూనకం వచ్చినట్టుగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కల్లు తాగిన కోతి అయినా మధుసూదన్ రెడ్డి కన్నా మంచిగా ప్రవర్తిస్తుంది.
కాంగ్రెస్ వచ్చింది ..పాపం వచ్చింది.హరీష్ రావు తాట తీసేంతా దమ్ముందా మధుసూదన్ రెడ్డి ? ప్రజలే కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే దూరం ఎంతో దూరంలో లేదు. అవకాశం ఉండి కూడా నీళ్లు ఇవ్వలేకపోతున్నారనే హరీష్ రావు ప్రశ్నించారు.
మోటార్లు ఆన్ చేయమంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రపంచ విషయాలు మాట్లాడుతున్నారు. పాలమూరు లో 33 శాతం కూడా నాట్లు పడలేదు. మంత్రి జూపల్లి సమక్షం లోనే మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏడు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన హరీష్ రావు గురించా మాట్లాడేది ?
.చెక్ డ్యామ్ ల నడిగినా ,పండిన పంటలను అడిగినా హరీష్ రావు కృషి గురించి చెబుతాయి. పాత పనులకే కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి టెంకాయలు కొడుతున్నారు. హరీష్ రావు నుంచి జ్ఞానం తెలుసుకుంటే మంచిది. హామీలు అమలు కాకపోతే కాంగ్రెస్ నేతల వీపులు పగులుతాయి.
వచ్చేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే ..అందరి లెక్కలు తేలుస్తాం. పాలమూరు రంగారెడ్డి ని పూర్తి చేయాలి. అట్ల చేస్తేనే రేవంత్ రెడ్డి ని పాలమూరు బిడ్డ గా గుర్తిస్తాం .నల్లమల బిడ్డను అని సీఎం చెబుతుంటారు .కానీ నల్లమల బేసిన్ ఎక్కడ ఉందో రేవంత్ కు తెలియక పోవడం దౌర్భాగ్యం. ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ నేతలు అభిలాష్ రంగినేని ,హనుమంతు నాయక్ కూడా పాల్గొన్నారు.