డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డిలు జగన్ ఆడమన్నట్లు ఆడుతున్నారు
-టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు
డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డిలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ జగన్ ఆడమన్నట్లు ఆడుతున్నారని ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడిన మాటలు…
వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి లు జగన్ రెడ్డి ఆడమన్నట్లు ఆడుతున్నారు. వారి ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. రాష్ట్రంలో సివిల్ సర్వీస్ నుంచి, గ్రూపు 1 నుంచి సెలక్ట్ అయిన అధికారులు, ఏపీపీఎస్ సి నుండి సెలక్ట్ అయిన అధికారులు అందరూ కలిపితేనే కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. వాసుదేవరెడ్డి, వెంకట్ రెడ్డి సొంత రాష్ట్రంలో పనిచేయాలన్న కోరికతో కేంద్ర, ఇతర రాష్ట్రాల సర్వీసుల్లో ఉన్న అనేక మంది తెలుగు అధికారులు డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వస్తుంటారు.
అయితే స్వరాష్ట్రాలకు వచ్చినప్పుడు వారికి అత్యంత కీలకమైన, ప్రాధాన్యమైన పోస్టులు ఇవ్వకూడదన్న సంప్రదాయం ఉంది. కానీ జగన్ రెడ్డి మాత్రం వాసుదేవరెడ్డికి ఏపీ బేవరేజేష్ కార్పోరేషన్ ఎండీగా, వీజీ వెంకటరెడ్డికి గనుల శాఖ డైరెక్టర్‌గా కీలక పోస్టులు కట్టబెట్టారు. వీరైతేనే జగన్ రెడ్డి చెప్పినట్టు ఆడుతారని ప్రభుత్వ పెద్దలకు వందల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే ఈ రెండు శాఖలను వారికి కట్టబెట్టారు. నిజానికి వాసుదేవరెడ్డి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు (ఐఆర్‌టీఎస్) అధికారి. జగన్ సర్కారు వచ్చాక 2019 సెప్టెంబరు 13న ఈయన్ను బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు.
ఈయన వచ్చిన తర్వాతే మద్యం వ్యాపారం విధివాధానాలను మార్చి ప్రభుత్వమే మద్యం అమ్మేలా ఏర్పాట్లు చేసి జగన్ రెడ్డికి వేల కోట్ల ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. పాపులర్, నాణ్యమైన మద్యం బ్రాండ్లు నిషేదించి జగన్ బినామీ కంపెనీల్లో తయారయ్యే నాసిరకం మద్యం బ్రాండ్లు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మద్యం డిస్టిలరీలన్నీ అధికార పార్టీ ముఖ్య నేత సన్నిహితుల నియంత్రణలోకి వెళ్లాయి. మద్యం తయారీ, అమ్మకాల్లో నాణ్యత, పారదర్శకతను పాటించేలా చర్యలు తీసుకోవలసిన వాసుదేవరెడ్డి వైసీపీ పెద్దలకు సహకరిస్తున్నాడు.
మద్యంలో విషకారకాలు, మోతాదుకు మించిన డోసులు ఉన్నాయి, కల్తీ మద్యం తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ వాసుదేవరెడ్డి మాత్రం మేమంతా పారదర్శంగా నాణ్యమైన మద్యం అమ్మున్నామంటూ జగన్ రెడ్డిపై స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. దేశం మొత్తం డిజిటల్ పేమెంట్స్ వాడుతుంటే ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రం కేవలం నగదు చెల్లింపులే స్వీకరిస్తున్నారు. దీంతో మద్యంపై ఎంత ఆదాయం వచ్చింది? ఎంత ఖజానాకు జమయుందో అసలు లెక్కలే లేవు.
వీటిన్నిటి నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు నాయుడుపై జగన్ రెడ్డి ఆదేశాలతో వాసుదేవరెడ్డి అక్రమ కేసు పెట్టారు. సర్వీస్ రూల్స్ కి విరుద్దంగా వ్యవహరిస్తున్న వాసుదేవరెడ్డి భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. టీడీపీ అధికారంలోకి రాగానే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఆయన చేసిన ఘనకార్యాలన్ని సమీక్షించి, విచారణ జరిపిస్తాం తప్పకుండా శిక్షిస్తామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.