ఈమె పండువృద్ధురాలు. అక్కడ వేసిన కుర్చీలో గంటలపాటు అలానే కూర్చుంది. అది ప్రకాశం జిల్లా. ఓవైపు టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర సందడిగా ఉంది. తోసుకునేవారూ, పరుగెత్తేవారూ.. ఇలా ఎవరి పనిలో వారున్నారు. అందరూ ఆమెను చూస్తున్నారు. వెళుతున్నారు. ఎందుకోసం ఆమె అక్కడ గంటలపాటు కూర్చుందో ఎవరికీ తెలియదు. చివరాఖరకు ఆమె వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి, తన బైఠాయింపునకు కారణమేమిటని ఆరా తీశారు. అందుకామె చెప్పిన జవాబు విని ఆశ్చర్యపోవడం ఆయర వంతయింది.
‘నేను ఎన్టీఆరును చూశా. చంద్రబాబునాయుడును చూశా. ఆయన కొడుకు లోకేషును చూడొద్దా’ అని ప్రశ్నించింది. దానితో ఆశ్చర్యపడటం ఆయనవంతయింది. అయితే లోకేషు పాదయాత్ర చాలారద్దీగా ఉంటుందని, రమేష్ అనే వ్యక్తి ఆమెకు ఎంతనచ్చచెప్పినా, బామ్మగారు తన మొండితనం విడిచిపెట్టలేదు.
లోకేషును చూసిన తర్వాతనే వెళతానని భీష్మించుకుంది. దానితో రమేష్ చొరవ తీసుకుని లోకేష్ దగ్గరకు తీసుకువెళితే, ఆ బామ్మ బోలెడంత సంతోషపడింది. ఈ పుణ్యమంతా నీదే నాయనా అని రమేష్‌కు కృతజ్ఞతలు చెప్పింది. అదిగో.. ఆ చిత్రమే.. ఈ ‘చిత్రం’!