Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం!

– డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండు
– మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్

బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండు. తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగిండు. నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న వీళ్ళ మిత్ర పార్టీ బీజేపీ, 40% కమిషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించింది. అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నది.

ఇప్పుడు తెలంగాణాలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నరు.మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం! కాంగ్రెస్ వస్తుంది! తెలంగాణ గెలుస్తుంది!!

LEAVE A RESPONSE