తమిళ్ష్‌నాడులో అటూ ఇటూగా ఏడాది కాలంగా పెరియార్ అనే ఏ సమాజానికీ ప్రయోజనకరం కాని వ్యక్తి(?)ని ఒక వేపుడు వేయిస్తున్నారు.
ముస్లీములు, క్రైస్తవులు కూడా పెద్ద మొత్తంలో పెరియార్ అన్న దుష్ట శక్తిని తూర్పారపడుతున్నారు!
‘హార్వర్డ్ యూనివర్సిటీ పెరియార్‌కు ఆసియా సోక్రటీస్ బిరుదును ఇచ్చింది’ అని 50యేళ్లుగా పాఠంగా చలమణి ఔతున్న ఘోర అసత్యాన్ని 5యేళ్ల క్రితం ‘మారిదాస్’ అనే ఒక మంచి సామాజిక కార్యకర్త సాక్ష్యాధారాలతో పటాపంచలు చేశారు. (మారిదాస్ వంటి వాళ్లు తెలుగులో లేకపోవడం పెద్ద లోటు) అటు తరువాత పెరియార్ రంగు పెద్ద ఎత్తున వెలిసిపోవడం మొదలైంది.
పెరియార్ దళితుల్ని, ముస్లీముల్ని, క్రైస్తవుల్ని, బ్రాహ్మణుల్ని హేయంగా పరిగణించాడు. దేశాన్ని, హిందూత్వాన్ని, మట్టి సంస్కృతిని, చివరికి తమిళ్ష్ భాషను కూడా తీవ్రంగా దూషించాడు. దేశ, హిందూ వ్యతిరేక శక్తి అన్న ఒకే ఒక్క కారణంగా పెరియార్‌కు కూడా ఒక వర్గం ఏర్పడింది.
పెరియార్ అన్న బురద ఇవాళ తమిళ్ష్నాడులోనే కడిగెయ్యబడుతోంది! సీమాన్ అనే వ్యక్తి పెరియార్‌ను పెద్ద ఎత్తున తూర్పారపడుతున్నారు. ఈ సీమాన్ నిమ్న వర్గాల వ్యక్తి; ఎల్.టీ.టీ.ఈ. సానుభూతి పరుడు. ఈ సీమాన్ పెరియార్‌పై దాడికి దిగడంతో దేశ వ్యతిరేక కులోన్మాద మూక చేష్టలుడిగిపోయింది. ఈ సీమాన్ ఇటీవల “బ్రాహ్మణత్వం అన్న పలుగుతో ఈ ద్రావిడ ప్రభుత్వాన్ని కూలగొడతాను” అని చాల గట్టిగా చెప్పారు. ఆ మాట తీవ్ర సంచలనం రేపుతోంది.
పెరియార్ అన్న భ్రష్టుడు, దేశ, హిందు, ప్రజా వ్యతిరేకి, హానికరమైన, హేయకరమైన శక్తి గురించి నేను 5యేళ్ల క్రితం నుంచీ సాక్ష్యాధారాలతో తెలుగులో తెలియజేస్తూ వస్తున్నాను.
తమిళ్ష్‌నాడులో ఊపందుకున్న ‘పెరియార్ వ్యతిరేకత’ అన్న సమాజ, దేశ హితం తెలుగులోనూ తెలివిడిగా రావాలి. తెలుగులో ఉన్న పెరియార్-బురదను మనం కడిగేయాలి.
– రోచిష్మాన్
9444012279