Suryaa.co.in

Andhra Pradesh

రిమాండ్‌లో ఉన్న వ్యక్తి కూడా మాకు చెబుతున్నారు.. హవ్వ!

– మీరు అధికారా? వైసీపీ కార్యకర్తనా?
దుర్గ గుడిలో ఏర్పాట్లు అధ్వానం
ఇన్ని లక్షల బడ్జెట్ ఏమైపోతోంది
– దుర్గగుడి స్పెషలాఫీసర్ ఆజాద్‌పై జనసేన విజయవాడ నగర అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఫైర్

అమ్మవారి దసరా ఉత్సవాల బడ్జెట్ 7-8 కోట్లు రూపాయలతో సామాన్య భక్తులకు మీరు ఏర్పాటు చేసిన సౌకర్యాలు కేవలం క్యూలైన్లు, 30 పైసలు వాటర్ ప్యాకెట్,10000 మందికి అన్న ప్రసాద పంపిణీ అంతకుమించి ఏమైనా చేశారా?

ఎండ తీవ్రంగా ఉంది కనీసం చల్లటి మంచినీళ్లు, మజ్జిగ కూడా ఏర్పాటు చేయలేకపోయారు ఇది మీ వైఫల్యం కాదా? ఇందులో రాజకీయం ఏమన్నా ఉందా? ఫెస్టివల్ స్పెషల్ ఆఫీసర్ ఆజాద్ ఏం ఏర్పాట్లు పర్యవేక్షించారు. సామాన్య భక్తుల కోసం ఏం ఏర్పాటు చేశారు సమాధానం చెప్పాలి.

మీరు నిన్న మీడియా పాయింట్ వద్ద ఒక వైసీపీ కార్యకర్త లాగా ప్రవర్తించారు. మీరు ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఏసీబీ రైడింగ్ లో దొరికిపోయి రిమాండ్లో ఉండి బయటకు వచ్చిన వ్యక్తి మీరు. మీ లాంటోళ్లు కూడా మేము ఎలా మాట్లాడాలో చెప్తే హాస్యాస్పదంగా ఉంది. నిన్న దుర్గగుడి పైన మద్యం సీసాలు సిగరెట్టు పీకలు దొరికాయి ఇది అపచారం కాదా దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఆజాద్ గారు సమాధానం చెప్పాలి.

జమ్మి దొడ్డి దగ్గర నుంచి దొరక్క గుడి పైకి దొంగ టిక్కెట్లు రీసైక్లింగ్ చేస్తూ చాలామంది బ్రోకర్లు దర్శనాలు చేయుచున్నారు వారిపై చర్యలు తీసుకోవాలి. పాలకమండలి చైర్మన్ సూచనలు చేయాలని చెప్పారు మంచిదే కనీసం మీ కార్యాలయానికి 200 అడుగుల దూరంలో ఉన్న అమ్మవారి ఆలయానికి రంగులు వేయలేకపోయిన, బంగారు తాపడానికి పాలిష్ పెట్టడం మరిచి పోయిన, అంతరాలయ లో పూల అలంకరణ చేయలేని విషయాన్ని గుర్తించలేని బాధ్యత రాహిత్యమైన పాలకమండలి కాదా మీది. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు అమ్మవారి ఆలయ అభివృద్ధి మీద సామాన్య భక్తుల సౌకర్యాలు మీద దృష్టి సారించాలి.

LEAVE A RESPONSE