లోన్‌ కోసం వెళితే…

– నోరెళ్లబెట్టిన మహిళ

ఇంటి నిర్మాణం కోసం లోన్‌ కోసం బ్యాంక్‌ కు వెళ్లిన వ్యక్తి కనీ వినీ ఎరుగని రీతిలో బ్యాంక్‌ అధికారులు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. అతని పేరుపై ఇప్పటికే 38 ఖాతాలు ఉన్నట్లు చెప్పడంతో.. లోన్‌ కోసం వెళ్లిన వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. తను లోన్‌ తీసుకోలేదని అయినా 38 ఖాతాలు బ్యాంక్‌ వారు ఎలా చేశారని ప్రశ్నించడంతో బ్యాంక్‌ సిబ్బంది కూడా సమాధానం చెప్పలేక షాక్‌ తిన్నారు. ఒక వ్యక్తిపై 38 ఖాతాలు ఎలా ఓపెన్ చేశారనేది అందరికి ప్రశ్నార్థంగా మారింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈఘటన వెలుగులోకి వచ్చింది.

వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి పేరు మీద 38 బ్యాంకు ఖాతాలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. పెద్దేముల్‌ మండల కేంద్రానికి చెందిన మంగళి అనంతయ్య ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టాడు. కొంతమేర పనులు పూర్తి చేసిన అనంతయ్య మిగిలిన పనులు పూర్తి చేసేందుకు లోన్ తీసుకుందామని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈనేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంకుకు వెళ్లాడు.

బ్యాంక్‌ లో అనంతయ్య నుంచి వివరాలు సేకరించిన బ్యాంకు సిబ్బంది షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. అనంతయ్య పేరుతో 38 అకౌంట్లు ఉన్నాయని తెలిపారు. అందులోనూ.. 12 అకౌంట్లు యాక్టివ్‌లో, మిగతా 26 క్లోజ్‌ అయ్యాయని, తన పేరు మీద ఓ లోన్ కూడా ఉందని చెప్పడంతో అనంతయ్యకు కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను ఇప్పటి వరకు ఏలోన్‌ తీసుకోలేదని బ్యాంక్‌ సిబ్బంది తను లేకుండా ఎలా లోన్‌ ఇచ్చారని, ఖాతాలు ఎలా చేశారని ప్రశ్నించాడు. అయితే బ్యాంక్‌ సిబ్బంది ఎవరూ స్పందిచకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించాడు.

తనకే తెలియకుండా ఎవరో తన పేరు మీద బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారనే అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈసంఘటనతో తాను షాక్‌కు గురయ్యానని అనంతయ్య తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం వెళితేగానీ ఈ విషయం తెలియలేదని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మరి దీనిపై పోలీసులు, బ్యాంక్‌ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు. అసలు అనంతయ్యకు తెలియకుండా బ్యాంక్‌ సిబ్బంది లోన్‌లు ఎలా ఇచ్చారు. దీని వెనుక ఎవరి హస్తం ఉన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply