– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు: రాష్ట్ర పరిస్థితులు చేస్తే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడంలేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు మీకోసం.. సినిమా టికెట్లు తగ్గిస్తానని చెప్పి పేద ప్రజల్ని ఆకట్టుకోవాలని చూశారు. సినిమా పరిశ్రమ మూతపడేలా చేస్తున్నాననే ఆలోచన జగన్ కు రాకపోవడం బాధాకరం. 125 సినిమా హాళ్లు మూతపడ్డాయంటే బాధాకరం. సినిమా హాళ్లు మత్తుపదార్థాల తయారీ కేంద్రాలా? మూసేయడానికి. మత్తు పదార్థాలు తయారుచేసే ఎస్ఎన్ జే లాంటి కంపెనీలపై మీ ప్రతాపం చూపాలి.కక్ష సాధింపుకు కూడ ఒక హద్దుంటుంది. సూళ్ళూరుపేటలో ప్రపంచంలోనే అతి పెద్ద స్రీన్ థీయేటర్. అలాంటిదాన్ని కూడా మూసేసే పరిస్థితులు తెచ్చారంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. పక్కనే షార్క్ కాలనీలు, శ్రీసిటీ, ఎస్ సి జెడ్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, మ్యాన్ క్యురెస్ జెడ్ ఉంది. వారందకి వినోదాన్ని ఇవ్వడానికి 7 ఎకరాల స్థలంలో 50 కోట్ల పెట్టుబడితో కట్టిన హాల్ ని మూసేయడం అన్యాయం. సినిమా ఫీల్డ్ ని నాశనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ప్రజల నుండి ఓటిఎస్ పై వస్తున్న తిరుగుబాటును వేరేవాటిపై మరల్చాడినికే ఈ పన్నాగం.
రైతుల వద్దనుంచి అందరికీ అవసరమయ్యే పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించి పేదలను ఆదుకోవాలి. టాలీవుడ్ బాలివుడ్ తో పోటీ పడాలని అనుకోవాలేగాని మూతపడాలనుకోకూడదు. కర్నాటకలో డీజలు 85 రూపాయలుంటే ఇక్కడ 90కు అమ్మడం భావ్యమా? రైతులకు మొదలుకొని అందరికీ అవసరమయ్యే పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించి ఆదుకోవాలి. రైతు బంధు పేరిట ఎకరాకు పదివేలు ఇస్తున్నారు. మీరు మొత్తం కుటుంబానికి 7,500 ఇస్తున్నారు. అందులో పోటీ పడాలి. తెలంగాణ రేట్లు పెంచింది. మీరు పెంచొద్దు. ఉంచండి. డిస్ట్రిబ్యూటర్లకు నష్టమొచ్చేలా చేయొద్దు.
తెలంగాణలో సినిమా టికెట్ల ధరకు పది శాతం తగ్గిస్తే ఓకే, తెలంగాణలో రూపాయి ఉంటే ఇక్కడ పావలా చేయమనటం ఎగ్జిబ్యూటర్లకు నష్టం, కష్టం. పీకే మాట విని ప్రజల ప్రాణాలు పీకేస్తున్నారు. నిత్యవసర వస్తువులు కంట్రోల్ చేయాలి. టీడీపీ హయాంలోఉచితంగా లభించే ఇసుకను టన్ను12వందలకు బ్లాక్‌లో అమ్మటం మంచిపనా? టీడీపీ హయాంలో లీటరు 70 రూపాయలుండిన పామాయిల్ ప్రస్తుతం 170 రూపాయలైంది. సిమెంటు ఫ్యాక్టరీల వల్ల పొల్యూషన్ పెరుగుతోంది. వాటిని తగ్గించాలి.
పేదలతో అతితక్కువతో దొరికే ఎంటర్ టైన్ మెంట్ ను మూసేయడం భావ్యంకాదు. డీఏపీ ఎరువు టీడీపీ హయాంలో 11వందలు ఉండేది 12వందలు చేశారు. బ్లాక్ లో 16 వందలకు జనం కొంటున్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచారు. రైతులకు అవసరమగు విత్తనాలకు మేం 75 శాతం సబ్సిడీ ఇస్తుంటే ఈ ప్రభుత్వం 20 శాతం ఇస్తోంది. ధరలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.