Suryaa.co.in

Andhra Pradesh

పోలీసులు అమ్ముడు పోయారు

-నియోజకవర్గ పరిధిలో సెటిల్మెంట్లు, దందాలు
-క్రైమ్ రేట్ పెరిగిపోతుంది
-పోలీసు స్టేషన్లో బైఠాయించిన ధర్మాన కృష్ణ దాస్ తనయుడు కృష్ణ చైతన్య

ఆయన అధికార పార్టీ జెడ్పీటీసీ. అంతేనా?.. కొద్దికాలం క్రితం వరకూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అధికార వైసీపీ నేత తనయుడు. అంతేనా?.. ఇప్పుడు రెవిన్యూ మంత్రిగా ఉన్న ప్రముఖుడు ఆయన చిన్నాన్న. అంటే ఆ నియోజకవర్గాన్ని ఆ కుటుంబమే శాసిస్తోంది. అయినా సరే.. ఆ యువనేతకు సంతృప్తి కలగలేదు. పోలీసులపై ఆగ్రహించి, ఏకంగా స్టేషన్‌కే వెళ్లి బైఠాయించారు.

ఇది శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధికార పార్టీకి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తనయుడు ధర్మాన కృష్ణచైతన్య నిర్వాకం. స్వయంగా అధికార పార్టీ నేతనే, పోలీసుస్టేషన్‌కు వెళ్లి బైఠాయించడం బట్టి.. వైసీపీ క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేసినట్టయింది. పోలీసులు లంచగొండులు, సెటిల్మెంటు చేస్తున్నారంటూ ఒక అధికార పార్టీ నేతనే ఆరోపించడం బట్టి, ఇప్పటివరకూ అలాంటి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షానికి అస్త్రం ఇచ్చినట్లే లెక్క.

నరసన్నపేట నియోజకవర్గం పోలాకి పోలీస్ స్టేషన్లో వింతైన అరుదైన సంఘటన ఎదురైంది. సాక్షాత్తు మాజీ ఉప ముఖ్యమంత్రి ,ప్రస్తుత శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ తనయుడు జడ్పిటిసి అయిన కృష్ణ చైతన్య సోమవారం పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. అధికార పార్టీలో ఉంటూ ఓ పోలీస్ స్టేషన్లో ఇటువంటి వంటి చర్యలకు పాల్పడడం పోలీసులు చేస్తున్న చర్యలు వ్యతిరేకించడం బహుశా అధికార పార్టీ నాయకులు ఎదురు కాదు.

కానీ ఆ పరిస్థితి ఇక్కడ చోటు చేసుకోవడం చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకుల హవాఎలా ఉందో అర్థం అయిపోతుంది. పైసలు కక్కుర్తి పడుతున్నారని, నేర ప్రవృత్తి పెరిగిందని, రికార్డింగ్ డ్యాన్సులు, చందాలు… పోలీసులు కనుసైగలో జరుగుతున్నాయని జడ్పిటిసి సభ్యులు ధర్మాన కృష్ణ చైతన్య నేరుగా ఆరోపిస్తూ సోమవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో బయట నుంచి తన కేడర్ కి సమయాయత్నం చేశారు.

ఈ చర్యలకు అధికార పార్టీ నాయకులు కొంతమంది ఆయనతో ఉన్నారు. ఈ సమస్య తీరకపోతే పోలీసులు పోలీసులపై తను ఎంతవరకైనా వెళ్తానని హెచ్చరిస్తూ… అవసరమైతే జైలుకు వెళ్తానని కూర్చున్నారు. మునుపెన్నడూ లేని విధంగా అధికార పార్టీలో నాయకులు ఇలా పోలీస్ స్టేషన్లో బయటయింపు చేయడం విష్మయానికి గురిచేస్తుంది.

కృష్ణ చైతన్య నియోజకవర్గంలో అందరి సమస్యలను తనే స్వయంగా చూస్తుంటారు. భవిష్యత్తు రాజకీయ నాయకుడిగా ఆ నియోజకవర్గానికి పరిచయమయ్యారు. కృష్ణ దాస్ లేని లోటును తీర్చుతూ అన్ని సమస్యలు ఓపిగ్గా తీరుస్తుంటారు. చాలా రోజుల నుండి పోలీస్ సమస్యలపై తనకు ఓపిక నశించింది. పెరుగుతున్న క్రైమ్ రేటు, తెలుగుదేశం నాయకులు ఒత్తిడి పోలీస్ స్టేషన్లో పెరిగిపోవడంతో.. ఏదో తేల్చుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ధర్నాకు స్వీకారం చుట్టారు. ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్న పోలీసులు చర్యలకు పోలీస్ పెద్ద బాసులు ఏం చేస్తారు వేచి చూడాలి.

LEAVE A RESPONSE