Suryaa.co.in

Telangana

తెలంగాణ కోసం పోరాడిన అమరుల ఉసురు తగిలి పోతావ్!

-హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 25 లక్షల భూమి కేసీఆర్ దగ్గర ఉంది
-నీ పాలన కూల్చేస్తాం….కూల్చేసే దాంట్లో నాది ప్రధాన పాత్ర
-దొరల అధీనంలో ఉన్న వేల ఎకరాల భూమిలో నగండ్లు కడుతం
-భూమి దున్నినట్లు నీ పాలన దున్నేస్తాం
-కేసీఆర్ పై ప్రజాగాయకుడు గద్దర్ ఫైర్‌

తెలంగాణ కోసం పోరాడిన అమరుల ఉసురు తగిలి పోతావ్…అంటూ తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య.ఆ నాడు 200 ఏళ్ళు పరిపాలించిన నిజాం రాజు భూమి అంతా నాదన్నడు.భూములన్ని దేశ్ ముక్ లకు ,జమీందారులకు,పోలీసు పటేల్లకు,మాలి పటేల్లకు,కర్ణమోళ్ళకు ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినక ధరణి అని పేరు పెట్టి భూములన్ని తన దగ్గర పెట్టుకున్నాడు.

హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 25 లక్షల భూమి కేసీఆర్ దగ్గర ఉంది. మనకు అసైన్డ్ భూమి ఇచ్చి అమ్మొద్దు కొనొద్దు అన్నడు..ఇప్పుడు కార్పొరేట్ సంస్థల కోసం పేదల నుండి లాక్కుంటున్నడు. భూ సమస్యలు, భూ తగాదాలు పెట్టిన కేసీఆర్ గుర్తు పెట్టుకో.

నీ పాలన కూల్చేస్తాం….కూల్చేసే దాంట్లో నాది ప్రధాన పాత్ర.అందుకే ఎండలో తిరుగుతున్న. మా భూములు మాకే అని,మా నీళ్లు మాకే అని పోరాడి తెలంగాణ తెచ్చుకున్నం.తెలంగాణ కోసం పోరాడి అమరుల ఉసురు తగిలి పోతావ్.

గరీబోని భూమి గుంజుకొని కోట్లకు పడగలెత్తిన కుపేనీలకు ఇస్తున్నవ్. బిఆరెస్స్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గుర్తుంచుకోండి…భూమి జోలికొస్తే ఖబడ్దార్.భూమి పోరాటం మొదలైంది….నీ పాలన అంతమైంది. దొరల అధీనంలో ఉన్న వేల ఎకరాల భూమిలో నగండ్లు కడుతం…భూమి దున్నినట్లు నీ పాలన దున్నేస్తాం.

LEAVE A RESPONSE