Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంతో పాటు జిల్లాలో పోలీసు వ్యవస్థ గాడి తప్పింది

– పోలీసు ఉన్నతాధికారుల హామీతో ఛలో మర్రిపాడు తాత్కాలిక వాయిదా…
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
అధికారుల హామీతో తాత్కాలికంగా ఛలో మర్రిపాడు కార్యక్రమాన్ని వాయిదా చేస్తున్నాం.రాష్ట్రంతో పాటు జిల్లాలో పోలీసు వ్యవస్థ గాడి తప్పింది. పోలీసుల వ్యవహార శైలి నిజంగా బాధాకరం. మర్రిపాడు మండల టీడీపీ కన్వీనర్,సీనియర్ నాయకులు జనార్ధన్ నాయుడు స్టేషనుకి వెళ్తే ఎస్సై వెంకటరమణ నీచమైన భాష మాట్లాడి దాడి చేయడం దుర్మార్గం.ప్రజలపై దాడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు…సహించే పరిస్థితి కాదు.
2005, 2006లో డక్కిలి మండలంలో దళితులపై దాడి చేస్తే 5 వేల మందితో స్టేషన్ ముట్టడిచాం. ప్రజల సమస్యలపై పోరాడటం మాకేం కొత్త కాదు.ఎస్ ఐ వెంకటరమణ జిల్లాలోని కోట దగ్గర నుంచి చేసిన ప్రతిచోటా వివాదాస్పదమే..తాడేపల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితి తెచ్చారు.నిష్కారణంగా…మానసికంగా కుంగిపోయేలా దుర్భాష లాడే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు.ప్రజల డబ్బును జీతాలుగా తీసుకుంటూ తిరిగి వారినే హింసిస్తారా?


ఒకరా ఇద్దరా.. ఇంకా ఎంతమంది ఎస్ ఐ వెంకటరమణ బాధితులుగా మారాలి.దొంగ కేసులు పెట్టినా బాథపడం…కానీ మానసికంగా నానా భూతులు మాట్లాడి దాడి చేస్తారా?ఇప్పటికే చాలా ఓపికగా భరించాం…ఇక మీ ఆటలు సాగవు.అధికారుల హామీతో ఛలో మర్రిపాడు కార్యక్రమాన్ని తాత్కాలిక వాయిదా వేస్తున్నాం. తర్వాత జరిగే పరిణామాలను సైతం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాం. ఎస్ ఐ వెంకటరమణకు పోస్టింగ్ ఇస్తే ఖచ్చితంగా ఆందోళన చేపడుతాం.
కొంత మంది ఎమ్మెల్యేలు ఎస్ ఐ లను ఎంకరేజ్ చేసి వాడుకుంటున్నారు.జిల్లాలో ఇంత జరుగుతుంటే అసలు మంత్రులు ఏం చేస్తున్నారు.పోలీసుల అక్రమాల పై ప్రజలు తిరగ బడుతున్నా మంత్రులు ఎందుకు స్పందించడం లేదు. ఆయన నియోజకవర్గంలో ప్రజలను మానసికంగా ఇబ్బంది పెడుతుంటే మంత్రి గౌతమ్ రెడ్డి ఏం చేస్తున్నాడు.తక్షణం ఎస్ ఐ వెంకటరమణను సస్పెండ్ చేయాలి.

LEAVE A RESPONSE