తెలంగాణ ఎన్నికల ఫలితాల ముందస్తు అంచనా !
తెలగాణ కు చెందిన వివిధ వర్గాలనుంచి సేకరించిన , సమాచారం ఆధారంగా .. ఇది ఎగ్జిట్ పోల్స్ కాదు .. నా అభిమతం కాదు . మెజారిటీ ప్రజల ఆలోచన తీరును మదింపు చేసే ప్రయత్నం మాత్రమే ! నా అంచనా తప్పుకావొచ్చు . ఢంకా బజాయించి ఇదే జరుగుతుంది అని నేను చెప్పడం లేదు . నా అంచనా తో మీరు ఏకీభవించక పొతే ఇక్కడ కామెంట్స్ కాలమ్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చెయ్యొచ్చు . ఆరోగ్య కరమయిన చర్చ ప్రజ్వమ్యానికి ఎంతైనా అవసరం ..
తెలంగాణ లో ఓటింగ్ ముగిసింది . రాష్ట్రమంతా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వ వ్యతిరేకత కు ముఖ్య కారణాలు .
1. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ భావన .
2. నియామకాలు .
3. పదేళ్ల తరువాత ప్రజలు మార్పు కోరుకోవడం .
4. “తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వాలి” అని అనుకోవడం .
ఇంకో సారి చెబుతున్నా.. ఇవి నా ఆలోచనలు కావు .. నా మాటలు కావు . మెజారిటీ తెలంగాణ ప్రజల ఆలోచన .{ వారి ఆలోచన ను అంచనా వేసే ప్రయత్నమే ఇది . భిన్నాభిప్రాయాలు సహజం }
నిరుద్యోగులు , ప్రభుత్వోద్యోగులు, ముస్లిం లు { ఓల్డ్ సిటీ మినహాయించి }
క్రైస్తవులు { వీరిలో ఎక్కువ భాగం } BRS ను వ్యతిరేకించి కాంగ్రస్ పక్షాన నిలిచారు .
ఉమ్మడి రాష్టం లో అగ్ర కులాలుగా పేర్కొన తగ్గ రెండు అగ్ర కులాలు తమ వ్యతిరేకతను మరచి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన నిలవడం ఒక పరిణామం !
పాత జిల్లాల పరంగా తీసుకొంటే నల్గొండ , ఖమ్మం , మహబూబ్ నగర్ .. ఈ మూడు జిలాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోంది .
మహిళలు, వృద్ధులు, నగర వాసులు.. స్థూలంగా బిర్ఎస్ వైపు నిలిచారు .
బహుశా ఒక సంవత్సరం క్రితం ఎన్నికలు జరిగివుంటే బీజేపీ గెలిచివుండేది . తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేసివుండేది .
కానీ అటుపై రాజకీయ వైచిత్రి వేగంగా మారింది . బీజేపీ – BRS ఒకటే అని ప్రచారం జరిగింది . ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఈ ప్రచారాన్ని బీజేపీ తిప్పికొట్టలేక పోయింది . దీనితో ప్రభుత్వ వ్యతిరేఖ ఓటును బంగారు పళ్ళెరం లో పెట్టి కాంగ్రెస్ కు అప్పగించినట్టయ్యింది .
వారం పది రోజుల క్రితం అయితే … బీజేపీ కి మూడు సీట్స్ మాత్రమే వస్తాయి అనే పరిస్థితి . గత వారం రోజుల్లో బీజేపీ బాగా పుంజుకొంది . ఉత్తర తెలంగాణ లో త్రిముఖ పోటీ నెలకొని వుంది . బీజేపీ 8 సీట్స్ గెలుస్తుంది అంటున్నారు . అన్నీ కలిసొస్తే బీజేపీ కి 18 దాకా రావొచ్చు అంటున్నారు .
ఒక పరిశీలకుడు “బీజేపీ ఆరునెలల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది . దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరిగిపోయింది” అన్నారు .
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది . 65 సీట్ లకు తగ్గకపోవచ్చు .
బూత్ స్థాయి పోల్ మేనేజిమెంట్ లో కాంగ్రెస్ కాస్త వెనుక పడింది . ఇది గ్రామాల్లో అయితే పెద్దగా ప్రభావం చూపలేదు . డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకొని అత్యధిక శాతం గ్రామీణ వాసులు కాంగ్రెస్ వైపు నిలిచారు .
అదే నగరాల్లో బూత్ మేనేజిమెంట్ BRS కు అనుకూలం . ఉత్తర తెలగాణ లో బీజేపీ చీల్చేది ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక వోట్ అయితే కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీ సాధిస్తుంది . బీజేపీ అక్కడ BRS ఓట్ ను కూడా చీలిస్తే కాంగ్రెస్ 80 సీట్లు దాక గెలుచుకొని రాజకీయ సునామీ సృష్టిస్తుంది .
హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో మజ్లీస్ .మిగతా సిటీ లో కాంగ్రెస్ బీజేపీ BRS ఈ .. మూడు సీట్స్ ను పంచుకొంటాయి .
రంగారెడ్డి కాంగ్రెస్ వైపే . మెదక్ కూడా .
భారత రాష్ట్ర సమితి కి ఈ ఎన్నికల్లో ఏదీ కలిసిరాలేదు అని చెప్పవచ్చు . వారి ఎత్తుగడల అనేకం బెడిసి కొట్టాయి . అరవై డెబ్భై సీట్స్ లో నువ్వా- నేనా అని ఈ పార్టీ నిలిచినా, చివరకు 25 సీట్స్ తో అవమానకర పరాజయం తప్పదేమో అనే పరిస్థితి నెలకొంది .
గ్రూప్స్ పరీక్షలు , ధరణి లాంటి విషయాల్లో ముందస్తు చర్యలు చేపట్టివుంటే బహుశా మూడో సారి అధికారంలోకి వచ్చేదే . కానీ అతివిశ్వాసం దెబ్బతీసినట్టుంది . అలాగే వాచాలత్వం కూడా !
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది సకల జనులు . … వారి నాయకుడు కెసిఆర్ .
పదేళ్లకు పైగా తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడిని తెలగాణ ప్రజలు పదేళ్ల పాటు చీఫ్ మినిస్టర్ చేశారు .
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ . కాకపోతే దానికోసం పదేళ్లు తెలంగాణ ప్రజలు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది . బహుశా అందుకేనేమో .. ప్రజలు కాంగ్రెస్ ను అధికారం కోసం పదేళ్లు వెయిట్ చేసేలా చేశారు . తెలంగాణ ఇవ్వడం లో సహకరించింది బీజేపీ . మరి బీజేపీ ను వచ్చే ఎన్నికల్లో ఎలా ఆదరిస్తారో చూడాలి .
కేంద్రీకృత పాలన భారత రాష్ట్ర సమితి బలం .. బలహీనత .
కాంగ్రెస్ లో వికేంద్రీకృత పాలన ఉంటుంది . అది వారి బలం .. బలహీనత .
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకొన్న వారే నాయకులు. ప్రజా తీర్పును గౌరవించాలి .
కాంగ్రెస్, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ పార్టీ కి .. నాయకులకు శుభాకాంక్షలు .
ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పక్షాలు అలవి కాని హామీలు ఇచ్చాయి .
ఏ పార్టీ గెలిచినా ఆర్థిక సంకటం తప్పదు . ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అగమ్య గోచరం . ఇంకా ఉచితాలు . తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి పదవి ముళ్ల కిరీటం .దాన్ని ధరించడం ఇప్పుడెవ రే “వంతు” ?