– మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి: రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టే బడ్జెట్ లో విద్యుత్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను కోరారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో గురువారం సచివాలయంలో మంత్రి గొట్టిపాటి సమావేశం అయ్యారు.
ఈ క్రమంలో అత్యంత కీలకమైన విద్యుత్ శాఖకు కేటాయింపుల పరంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యుత్ శాఖ అనుబంధ విభాగాలకు సంబంధించిన కేటాయింపుల ప్రతిపాదనలను ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులకు అందజేశారు. మేనిఫెస్టో హామీలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కేటాయింపులు జరగాలని మంత్రి గొట్టిపాటి కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, ఆర్థిక శాఖకు సంబంధించిన పలువురు అధికారులు పాల్గొన్నారు.