– ప్రభుత్వం కావాలని కౌంటర్ వేయకుండా సమయాన్ని వృధా చేస్తుంది
– న్యాయవాది రవితేజ వాదనలు
– పీఆర్సీ నివేదిక ను గోప్యంగా ఉంచటానికి ప్రభుత్వానికి విశేష అధికారాలు లేవలేవన్న హైకోర్టు
– పదిరోజుల్లో పీఆర్సీ జీఓలు పిటషనర్ న్యాయవాదికి ఇవ్వాలని ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వం రివైజ్డ్ పే స్కేల్స్ ను ప్రకటించిన విధానం చట్ట విరుద్ధం అని కే వి కృష్ణయ్య దాఖల చేసిన రిట్ పిటిషన్ పైన న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. ప్రభుత్వం కావాలని కౌంటర్ వేయకుండా సమయాన్ని వృధా చేస్తుంది అని, పీఆర్సీ నివేదిక అత్యంత గోప్యంగా ఉంచటం కూడా చట్ట విరుద్ధమని, తమ బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తుంది అని వాదించారు. అదే విధంగా ఈ సమస్యను దాట వెయ్యాలని ఆశిస్తుంది కాబట్టే, ఇప్పటి వరకు కౌంటర్ వేయలేదని అన్నారు.
స్పందించిన అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం చర్చలు జరుపుతుందని కావున PRC నివేదికను బహిర్గతం చేయలేమని, కోర్టు ఆదేశిస్తే జడ్జిల ముందు ఉంచుతామన్నారు.దీని పైన స్పందించిన ధర్మాసనం.. పీఆర్సీ నివేదికను గోప్యంగా ఉంచటానికి ప్రభుత్వానికి విశేష అధికారాలు లేవని పది రోజుల్లో పీఆర్సీకి సంభందించిన జీ.ఓ లన్నీ పెటిషనర్ న్యాయవాదికి ఇవ్వాలని, రెండు వారాల్లో కౌంటర్ తో పాటు పీఆర్సీ నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.