– 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్ గెజిట్
– 11 తో విశాఖలో తక్కువ మండలాలు
– 38 మండలాలతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు
– 51 నుండి 73కి పెరిగిన రెవెన్యూ డివిజన్లు
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది.
26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్ గెజిట్ సిద్దమైంది. ఈ క్రమంలో పలు మండలాలను
ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.
కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..
1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం
2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం
3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ
4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం
5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం
6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం
7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ
8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)
9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు
10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)
11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు
12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
13. ఎన్టీఆర్ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)
14. గుంటూరు : గుంటూరు, తెనాలి
15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)
16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)
17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)
18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)
20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్ (కొత్త), నంద్యాల
21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్ (కొత్త)22.
శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)
23. వైఎస్సార్ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు
24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)25.
చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.
కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య
– శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు
– విజయనగరం జిల్లా.. 27 మండలాలు
– పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు
– అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు
– విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు
– అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు
– కాకినాడ జిల్లా.. 21 మండలాలు
– కోనసీమ జిల్లా.. 22 మండలాలు
– తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు
– పశ్చిమగోదావరి జిల్లా.. 19 మండలాలు
– ఏలూరు జిల్లా.. 28 మండలాలు
– కృష్ణా జిల్లా.. 25 మండలాలు
– ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు
– గుంటూరు జిల్లా.. 18 మండలాలు
– బాపట్ల జిల్లా.. 25 మండలాలు
– పల్నాడు జిల్లా.. 28 మండలాలు
– ప్రకాశం జిల్లా.. 38 మండలాలు
– నెల్లూరు జిల్లా.. 38 మండలాలు
– కర్నూలు జిల్లా.. 26 మండలాలు
– నంద్యాల జిల్లా.. 29 మండలాలు
– అనంతపురం జిల్లా.. 31 మండలాలు
– శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు
– వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు
– అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు
– చిత్తూరు జిల్లా.. 31 మండలాలు
– తిరుపతి జిల్లా.. 34 మండలాలు