శ్రీలంక దుస్థితి.. వారసత్వ రాజకీయాలు!

శ్రీలంకలో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులకి కారణం ఎవరు ?
ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు అని చెప్పవచ్చు.
ప్రజలు తమ విజ్ఞతని ప్రదర్శించక పొతే అది దేశం కావచ్చు లేదా దేశంలో ఒక భాగంగా ఉండే ప్రావిస్స్ లేదా రాష్ట్రాలు కావచ్చు ఎలాంటి దుష్ఫలితాలని అనుభవిస్తాయో మన దేశంలో కొన్ని రాష్ట్రాలని ఉదాహరణగా చూపవచ్చు అలాగే ఒక దేశంగా మన భారతదేశం ఎలాంటి స్థితిలోకి నెట్టబడిందో మనకి అనుభవమే!

తాము అధికారంలో ఉంటె చాలు ప్రజలు ఏమయిపోయినా ఫరవాలేదు అనే మనఃస్వత్వం సహజంగా వారసత్వ రాజకీ య నాయకులలో ఉండి తీరుతుంది. ఎందుకంటే అధికారం అనే మత్తు మహత్యం అది!

వారసత్వ రాజకీయాలు ఆసియా ఖండంలో ఉన్న దేశాలలో సహజ విషయంగా పరిగణిoచడం పరిపాటిగా మారింది.
శ్రీలంక,భారత్,పాకిస్థాన్,బంగ్లాదేశ్ తో పాటు కంబోడియా, లావోస్, బర్మా, ఇండోనేషియా,మలేషియా దేశాలలో ఉన్నదే మొదటి నుండి. ఈ దేశాలలో ఒక్క బంగ్లాదేశ్ లో ఉన్న వారసత్వం మాత్రం కొంచెం ఫరవాలేదు అనిపించే విధంగా కొనసాగుతున్నది షేక్ హసీనా పాలన!

శ్రీలంక – నలుగురు సోదరుల గుత్తాధిపత్యం !
2 కోట్ల 20 లక్షల జనాభా కలిగిన ద్వీప దేశం శ్రీలంక మొదటి నుండి సంక్షోభాలకి నిలయంగా ఉంటూ వచ్చింది. సరయిన నిర్ణయాలు తీసుకోగల నాయకత్వ లోపం వలన గత నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయంగా వార్తలలో ఉంటూ వచ్చింది. నిత్యం ఎదో ఒక సమస్యతో విలవిలలాడుతూ ఒక దాని తర్వాత ఇంకో సమస్యని ఎదుర్కుంటూ వస్తున్నది.ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే 2019 లో అధికారంలోకి వచ్చాడు.

rajapakseఅధ్యక్ష్య పదవి చేపట్టగానే తన సోదరుడు మహిందని ప్రధానమంత్రిగా నియమించాడు.
రాజపక్సే మరో సోదరుడు బసిల్ రాజపక్సే ని ఆర్ధిక మంత్రిగా నియమించాడు గొటబయ రాజపక్సే జులై 2021 లో. బసిల్ రాజపక్సే ని ఆర్ధిక మంత్రిగా నియమించడం మీద పెద్ద దుమారమే రేగింది శ్రీలంక పార్లమెంట్ లో ఎందుకంటే బాసిల్ రాజపక్సే కి ద్వంద పౌరసాత్వం ఉంది. బసిల్ కి శ్రీలంక పౌరసత్వం తో పాటు అమెరికన్ పౌరసత్వం కూడా ఉంది. మన దేశంలో లాగే శ్రీలంక రాజ్యాంగం కూడా ద్వంద పౌరసత్వం ఉన్నవారిని చట్ట సభల్లోకి అనుమతి ఇవ్వదు. అయితే గోటబయ రాజపక్సే తన తమ్ముడి కోసం రాజ్యాంగ సవరణ చేసి మరీ ఆర్ధిక మంత్రిగా కూర్చోబెట్టాడు.

ఇక మూడవ సోదరుడు అయిన చమల్ కి కూడా కేబినేట్ మంత్రి పదవి కట్టబెట్టాడు గొటబయ. చమల్ కొడుకుకి కూడా మంత్రి పదవి కట్టబెట్టాడు కానీ కేబినేట్ రాంక్ కాదు.
ఇక శ్రీలంక ప్రధానమంత్రి మహింద కొడుకుకి కూడా కాబినెట్ మంత్రి పదవిని కట్టబెట్టాడు గొటబయ.
మరో కొడుకు కి చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి ఇచ్చాడు గోటబయ.
ఇక్కడితో ఆగలేదు గోటబయ తన మేనల్లుడు పార్లమెంట్ సభ్యుడు అంటే ముందు ముందు వీళ్ళు శ్రీలంక ప్రధానులుగా మరియు అధ్యక్షులుగా అవడానికి ఇప్పటినుండే శిక్షణ ఇస్తున్నాడు గొటబయ రాజపక్సే.

…..ఇదంతా చదువుతుంటే మనకి మన తెలుగు ర్రాష్ట్రాలలో ఎవరయినా గుర్తుకు వస్తే అది నా తప్పుకాదు! కాకపోతే గొటబయ రాజపక్సే మాత్రం, ఏదన్నా సమస్య వస్తే తిరుపతి,సింహాచలం వచ్చి మొక్కు తీర్చుకొని వెళుతుంటాడు తప్పితే యజ్ఞాలు,యాగాలు చేయడు అలా అని అవి చేయడం ఇష్టం లేక కాదు కానీ శ్రీ లంక బౌద్ధ భిక్షువులు అలాంటివాటికి అనుమతి ఇవ్వరు.
శ్రీ లంకలో భౌద్ధ భిక్షువుల ప్రాబల్యం ఎక్కువ ప్రభుత్వాల మీద.
మొత్తం శ్రీలంక దేశపు బడ్జెట్ లో 75% రాజపక్సే కుటుంబ సభ్యుల చేతిలో ఉంది ! అందుకే నిన్న శ్రీలంక ప్రజలు దాగాపుగా 10 వేల మంది శ్రీలంక అధ్యక్ష్య భవనం ముందు తీవ్ర ప్రదర్శనలు చేసారు. నిరసన హింసాత్మకం కావడంతో అధ్యక్షుడు మూడు రోజుల కర్ఫ్యూ విధించాడు. కనిపిస్తే కాల్చివేత కి ఆజ్ఞలు ఇచ్చాడు అంటే శ్రీలంకలో పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

రోజుకి 10 గంటల విద్యుత్ కోతని విధించాడు లోడ్ షేడ్డింగ్ కోసం. దాదాపుగా అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. ప్రాణ రక్షణ మందుల కొరత తీవ్రంగా ఉండడంతో మోదీజీ హుటాహుటిన మందులు పంపించారు శ్రీలంకకి.
పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే విద్యుత్ కొరత వల్ల రోజువారీ ఆపరేషన్లు చేయడం ఆపేశాయి అక్కడి హాస్పిటల్స్ పైగా ఆపరేషన్ కి ముందు ఇచ్చే మత్తు మందుల కొరత తీవ్రంగా ఉంది.

కుటుంబ వారసత్వం దాని పరిణామాలు !
2019 లో రాజపక్సే అధికారం చేపట్టే నాటికి శ్రీలంక సెంట్రల్ బాంక్ లో $9 బిలియన్ డాలర్లు నిల్వ ఉన్నాయి! ఇది ప్రమాద సూచిక ! కానీ తీవ్రమయిన అలసత్వం వలన అవి నేడు 1 బిలియన్ కంటే తక్కువ స్థాయిలోకి వచ్చాయి. గత మూడేళ్ళలో రాజపక్సే ముందు జాగ్రత్తలు తీసుకున్నది శూన్యం.

కోవిడ్ వలన టూరిజం దెబ్బతిన్నది అయితే ఇది శ్రీలంకకి పరిమితం కాదు ఇతర ఆసియా దేశాలు అయిన ఇండోనేషియా లాంటి దేశాలు కూడా టూరిజం వల్ల దెబ్బతిన్నాయి కానీ మరీ ఇంతలా కాదు.

రాజపక్సే కుటుంబ పాలన పూర్తిగా అవినీతిమయం!
చైనా కి కావాల్సింది అవినీతి ప్రభుత్వాలు. శ్రీలంక చైనీయులకి ఒక వరం. ప్రతి ప్రాజెక్ట్ లో రాజపక్సే కి ముడుపులు ఇవ్వడం, అవి చైనా చేతిలోకి వెళ్ళిపోవడం ఆనవాయితీగా మారింది.
2021 లో భారత్ మరియు జపాన్ లు కలిసి సంయుక్తంగా నిర్మించ తలపెట్టిన కొలంబో పోర్ట్ ఈస్ట్
lanka-chaina కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్ట్ [Colombo Port East Container Terminal project ] ని మనసు మార్చుకొని చైనా కి అప్పచెప్పింది శ్రీలంక. ఇది పూర్తిగా చైనా రాజపక్సే కి లంచం ఇచ్చి మరీ తన చేతుల్లోకి తీసుకుంది.

2021 జనవరి నెల 13 ఇదే రాజపక్సే మంత్రివర్గం [కుటుంబం ] జపాన్ మరియు భారత్ లకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని అప్పట్లో అక్కడే ఉన్న భారత విదేశాంగ మంత్రి శ్రీ జైశంకర్ గారికి తెలిపింది కానీ ఫిబ్రవరి 1 వ తేదీన ఆ ప్రాజెక్ట్ ని చైనాకి అప్పచెప్పింది. అంటే 18 రోజుల్లో చైనా డబ్బు ఆశ చూపి మరీ రాజపక్సే చేత నిర్ణయం మార్పించింది.

దీని మీద భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది ఎందుకంటే శ్రీలంకకి భారత్ నుండి చేసే ఎగుమతులు మరియు శ్రీలంక నుండి జరిగే దిగుమతులు మొత్తం కొలంబో పోర్ట్ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్ట్ నుండి జరుగుతాయి. కానీ దానిని నిర్వహించేది చైనా !
అంటే శ్రీలంక భారత్ ల మధ్య జరిగే ఎగుమతులు,దిగుమతుల మీద చైనా నిఘా ఉంటుంది అన్నమాట !

శ్రీలంక హంబన్ తోట అంతర్జాతీయ పోర్ట్ !
2009 లో ‘హంబన్ తోట పోర్ట్’ నిర్మాణ పనులు మొదట భారత్ కే ఇచ్చింది శ్రీలంక. తరువాత దానిని చైనా కి అప్పచెప్పింది కానీ తీరుకున్న ఋణం తీర్చలేక ఒప్పందం ప్రకారం దానిని చైనాకి కట్టపెట్టింది 99 సంవత్సరాల లీజు కింద. అసలు పెద్ద మొత్తంలో ఎగుమతులు దిగుమతులు జరిగే అవకాశమే లేదు హంబన్ తోట పోర్ట్ నుండి కానీ ముడుపులకి ఆశపడి మరీ చైనాకి అప్పచెప్పింది శ్రీలంక. ఇప్పుడు ఈ పోర్ట్ మీద 99 సంవత్సరాల వరకు హక్కులు చైనాకి ఉంటాయి. తాజాగా చైనాకి చెందిన సబ్ మెరైన్ లు హంబన్ తోట పోర్ట్ దగ్గర తిరుగుతున్నట్లు సమాచారం. అంటే మన మీద నిఘా వేయడానికే ఇదంతా !

ఇప్పటి సంక్షోభానికి ప్రధాన కారణం శ్రీలంక ప్రభుత్వాలు భారత్,జపాన్ లతో సఖ్యతగా లేకపోవడమే కారణం. నిజానికి శ్రీలంక కి ఉన్న అప్పుల్లో సింహ భాగం జపాన్ దేశానిది అయితే తరువాతి స్థానంలో చైనా ఉంది. భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ మూడు దేశాల నుండే కాక ఆసియా అభివృద్ధి బాంక్ నుండి కూడా అప్పులు తీసుకుంది శ్రీలంక.

కొలంబో పోర్ట్ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్ట్ నుండి జపాన్ భారత్ లని తప్పించినప్పుడు అప్పటి జపాన్ ప్రధాని షిజో అంబే శ్రీలంక కి తీవ్రంగా నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. ఇప్పటికే అప్పులో ఉన్న మీకు కావలసినప్పుడల్లా అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది జపాన్ ఎల్లప్పుడూ అంటూ ! కానీ ముడుపులకి ఆశపడిన రాజపక్సే కుటుంబ జపాన్ ప్రధాని మాటలని పెడ చెవినపెట్టింది. ఫలితం ? ఇప్పటి పరిస్తితి .

జపాన్ కి 3$ బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు జపాన్ ని అడగలేదు. భారత్ ని అడగడానికి మొహం చెల్లదు. చైనా తనకి లాభం లేకుండా ఏ దేశానికి అప్పు ఇవ్వదు.

కుటుంబ పాలన వలన వచ్చే నష్టం!
ఈ నెల చివరికి శ్రీలంక అంతర్జాతీయ బండ్ల కి కాలపరిమితి తీరిపోయిన వాటికి తిరిగి చెల్లించాలి కానీ చేతిలో డబ్బు లేదు కాబట్టి దివాలా తీసినట్లుగా ప్రకటిస్తుంది IMF.

2007 నుండి ప్రపంచవ్యాప్తంగా చెల్లె విధంగా ఇంటర్నేషనల్ సావరిన్ బాండ్స్ పేరుతొ[sovereign bonds (ISB)] అప్పులు తీసుకుంటూ వచ్చింది శ్రీలంక. వాటిలో సింహ భాగం ఈ నెల చివరికి గడువు ముగుసిపోతాయి. ఈ బాండ్స్ విలువ $11.8 బిలియన్ డాలర్లు గా ఉంది. మొత్తం విదేశీ అప్పుల్లో ఇది 36.4%. పూట గడవడానికే దిక్కు లేదు ఇప్పుడు వీటి చెల్లింపులు ఎలా చేస్తుంది ?
అయితే కేవలం రాజపక్సే కుటుంబం ఒక్కటేనా శ్రీ లంకలో ఉన్న కుటుంబ పాలన ?
గతంలోనూ ఉంది. మొదటి ఆసియాలోనే శ్రీలంక మహిళా ప్రధాని సిరిమావో బండారునాయకే ది కూడా కుటుంబ పాలనే !సిరిమావో బండారు నాయకే శ్రీ లంకని ఏలింది తరువాతి కాలంలో తన కూతురు అయిన చంద్రికా కుమారతుంగ ని కూడా రాజకీయాలలోకి దింపింది. 1994 లో చంద్రిక కుమారతుంగ భారీ మెజారిటీతో అధ్యక్షురాలిగా ఎన్నికఅయింది వెంటనే తన తల్లి అయిన సిరిమావో బండారు నాయకే ని ప్రధానిగా నియమించింది.

తమ కుటుంబాలు బాగుంటే చాలు ప్రజలు ఎలా పోయినా ఇబ్బంది లేదు అనే ధోరణి కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉంటాయి. ఇంతకీ శ్రీలంక ప్రస్తుత సంక్షోభం నుండి బయట పడుతుందా ?కేవలం దిగుమతులు ఎక్కువ ఎగుమతులు తక్కువగా ఉండే శ్రీలంక లాంటి దేశం ఇప్పట్లో కోలుకునే సూచనలు కనుచూపు మేరలో లేవు.ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఇలా కుటుంబాలు ఏళ్ళకి ఏళ్ళు దేశాలని,రాష్ట్రాలని ఎలుతూనే ఉంటాయి.శ్రీలంక లాంటి దేశాలే చైనాకి తాటకి రక్ష !

– రవీంద్ర తీగల

Leave a Reply