– సీఆర్డీఏ లో ఉన్న సమస్యలపై సవరణలు
– అమరావతి రైతు ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షుడు మాదల శ్రీనివాసరావు
– కూటమి విజయం సాధించిన తర్వాత ఐక్యకార్యాచరణ సమితి మొదటి సమావేశం
అమరావతి ఉద్యమం లో అసువులు బాసిన వారికి శ్రద్ధాంజలి
గుంటూరు: అమరావతి రాజధాని అభివృద్ధి కోసం నిధులు మంజూరు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండటం ముదాహం. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి హక్కులపై కూటమి ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు ఇవ్వడానికి సిద్ధం అని తెలపడం సంతోషంగా ఉంది.
కేంద్రం అమరావతి కిగెజిట్, బౌoడ్రిలుఅనగా హద్దులుఏర్పాటుకు చర్యలు చేపట్టారు. గత 5సం. ల వైసీపీ విద్వంసకర పాలన నుంచి అమరావతి అభివృద్ధి వైపు పరుగులు పెట్టడానికి సిద్ధమైన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో అమరావతి అభివృద్ధి ప్రణాళికను ఎలా చేస్తారనే విషయాలపై ముఖ్యమంత్రి తో సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సీఆర్డీఏ లో ఉన్న సమస్యలపై సవరణలు చేయాల్సినవి ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ని కోరారు. గత 8 సం. ల క్రితం విజయదశమి రోజున జరిగిన అమరావతి శంకుస్థాపన తర్వాత రైతులకు టీడీపీ హయాంలో మాత్రమే పనులు ముమ్మరంగా జరిగాయి.
ఇప్పటి కూటమి ప్రభుత్వం త్వరలోనే రైతులకు ఇచ్చిన ప్లాట్లు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అమరావతి అభివృద్ధి పేరుతో కొంతమంది మోసగాళ్ళు , భూముల ధరలు ఆకాశంలో ఉన్నాయని ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.