-ప్రజలారా మీరు ఒక్క అడుగు వేయండి మేం వంద అడుగులు ముందుకేస్తాం
-రాష్ట్రం కోసం అంతా కలిసి రావాలి….విధ్వంస జగన్ ను ఇంటికి పంపాలి
-టీడీపీ జనసేన పొత్తుతో జగన్ కి ఓటమి భయం పట్టుకుంది
-టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్ – జగన్ సినిమా అయిపోయింది
-ప్రజా మ్యానిఫెస్టో ఇస్తాం, అన్ని వర్గాలకు అండగా నిలబడతాం
-యువగళం నవశకం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు
చంద్రబాబు నాయుడు
నెల్లిమర్ల:-భారతదేశంలో పాదయాత్రలు కొత్త కాదు, నేను పాదయాత్ర చేశాను… ఎన్టీఆర్ గారు చేశారు. ఎన్టీఆర్ చైతన్య యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు
• జగన్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని యువగళం ఆపటానికి ప్రయత్నం చేశాడు. యువగళం వాలంటీర్లపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపించారు. వీటన్నింటికీ వడ్డీతో సహా తీరిగిస్తాం.
• యువగళం జన గళంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది.
• రోజు రోజుకి ప్రజా ఉద్యమంగా ముందుకు వెళ్ళింది. దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలకు నా అభినందనలు
• జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తానని 5 సంవత్సరాలు గడిచినా ప్రకటించలేదు. బంగారు భవిష్యత్తు ఉండాల్సిన యువతకు ఉద్యోగాలు లేకుండా చేశాడు.
• వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు పారిపోయాయి. అగ్రస్థానంలో ఉండాల్సిన తెలుగు యువతను ఆంధ్రప్రదేశ్ లో అదపాతాళంలో ఉంది.
• టీడీపీ-జనసేన కలిసి యువతకు ఉపాధి కల్పిస్తాము, మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము.
• ఏదైనా సంకల్పం ఉండి చిత్తశుద్ధితో పని చేస్తే ఉంటే ప్రజలు ఆదరిస్తారు. అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నారా లోకేష్‌కు నా అభినందనలు.
• భోగాపురం విమానాశ్రయానికి నాంది పలికాను. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే 2020కే విమానాశ్రయం ప్రారంభమయ్యేది. కానీ ఇప్పటికీ దానిని పూర్తి చేయలేదు.
• 5 సంవత్సరాలలో ఉత్తరాంధ్ర వైసీపీ కబ్జాలో మునిగిపోయింది. ఈసారి మాకోసం కాదు 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేయండి.
• మెట్రో పోయింది, వైజాగ్ లో వచ్చిన పరిశ్రమలు అన్నీ పోయాయు, హెచ్ఎస్బీసీఎల్ వంటి ఐటీ కంపెనీలు మేం తీసుకువస్తే నేడు అవి కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది.
• ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయు, వైసీపీ పాలన వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆగిపోయింది. కబ్జాలు, సెటిల్మెంట్ లు పెరిగాయి. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు బలవంతంగా రాయించుకుంటున్నారు.
• ఈ 5 ఏళ్లలో విశాఖపట్నంలో జరిగినన్ని అరాచకాలు నా జీవితంలో చూడలేదు.
• ఒకప్పుడు విశాఖ ఆర్థిక రాజధాని.. ఈ రోజు విశాఖ గంజాయి రాజధానిగా మారిపోయింది.
• విశాఖ అంటే నాకు ఎప్పుడు అత్యంత ప్రీతి ప్రాంతం. హుద్ హుద్ వస్తే 10 రోజులు ఇక్కడే ఉండి విశాఖ ప్రజల సహకారంతో హుద్ హుద్ కు ముందు హుద్ హుద్ తర్వాత అన్నట్లు మార్చాము.
• జగన్ రెడ్డి రివర్స్ పాలన అన్నాడు కానీ విద్వంస పాలనకు నాంది పలికాడు. కక్ష సాధింపులు, విద్వంసాలు చేస్తే ఏం జరుగుతుందో ఉదాహరణ ఆంధ్రప్రదేశ్.
• ఒక మంచి చేస్తే ఆ మంచి ఫలితాలు అందరికీ వస్తాయో అదే పబ్లిక్ పాలసి. ఒక చెడు చేస్తే అందరికీ నష్టం వస్తుంది. అదే జగన్ రెడ్డి చేస్తున్నాడు.
• ఒక్క ఛాన్స్ అన్నాడు… దాని పాపానికి 30 సంవత్సరాలకు రాష్ట్రం వెనక్కిపోయింది.
• ఇప్పుడు కానీ మనందరం కలవకపోతే… వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని భేషరతుగా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ని అభనందిస్తున్నాను.
• రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ అందరికీ ఉంది కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే అధికారం ఎవరికీ లేదు.
• హైదరాబాద్ ని నేను అభివృద్ధి చేశాను, నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు జగన్‌లా విధ్వంసం చేసి ఉంటే ఈ రోజు హైదరాబాద్ అంత సంపద ఉండేది కాదు.
• అమరావతి రాజధానిగా ఉంటుంది విశాఖ ఆర్థిక రాజధాని, ఐటి హబ్‌గా ఉంటుందని నేను చెప్పాను.
• అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కల ఆటాడాడు. రుషికొండకు బోడు గుండు కొట్టి విలాసం కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టే హక్కు ఈ ముఖ్యమంత్రికీ ఎవరిచ్చారు?
• ఇవన్నీ తలుచుకుంటుంటే ఆవేదనతో గుండెలు పిండేసినట్లుంటుంది.
• పోలవరం రాష్ట్రానికే వరం, తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2020కి పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఆంధ్రప్రదేశ్‌లో కరువనే మాట లేకుండా చేసేవాళ్ళం.
• విద్య, వైద్యం, రోడ్లు, వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించాడు.
• మ్యానిఫెస్టోలో ఏమేమి చేయబోతామో త్వరలోనే ఉమ్మడి మ్యానిఫెస్టోను తయారు చేస్తాం.
• ఇసుక, లిక్కర్ స్కాంలు చేస్తూ స్వార్దం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.
• అబద్దాల పునాదులుమీద వైసీపీ నిర్మితమైంది, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తెస్తామన్నారు తెచ్చారా?
• మద్యపాన నిషేదం అన్నారు చేశారా? మద్య నిసేదం చేయకపోగా మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.
• సీపీఎస్ రద్దు అన్నారు, చేశారా? సొంత బాబాయిని చంపారు, నాడు సీబీఐ విచారణ కావాలన్నారు, అధికారంలోకి వచ్చాకా సీబీఐ విచారణ వద్దన్నారు.
• వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.
• గతంలో పవన్ కళ్యాణ్ పై కేసులు లేవు, నేడు ఆయనపై కూడా కేసులు పెట్టారు.
• నాపై తప్పుడు కేసులు పెట్టారు, అవి కోర్టులో అంశం కాబట్టి మాట్లాడటం లేదు
• అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజలెవరూ స్వేచ్చగా బ్రతికే పరిస్థితి లేదు.
• ప్రజల గొంతు మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నా… రక్షించే నాధుడే లేడు.
• పోలీసులను భయపెట్టి ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, కొంత మంది పోలీసులు మాత్రం అధికార పార్టీకి తొత్తులుగా మారారు.
• తప్పుడు పనులు చేసిన అధికారులను చట్టపరంగా శిక్షించే వరకు వదలిపెట్టం
• ముఖ్యమంత్రి పదవి కావాలనో, అధికారం కావాలనో మేం పోరాటం చేయటం లేదు, రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతున్నాం.
• ఈ సభకు కేంద్రం అద్దెకు రైళ్లు ఇచ్చింది గానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వలేదు.
• ప్రవేట్ వాహనాలు ఇవ్వకుండా అడ్డుపడ్డారు, ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా లక్షలాది మంది స్వచ్చందంగా సభకు వచ్చి విజయవంతం చేశారు.
• త్వరలో ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటిస్తాం, త్వరలో జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో రెండు మీటింగ్ లు నిర్వహిస్తాం.
• తల్లికి వందనం కింద చదువుకునే ప్రతి విధ్యార్దికి ఏడాదికి రూ. 15 వేలిస్తాం.
• దీపం పధకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పిస్తాం.
• యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తాం.
• వైసీపీ పాలనలో రైతన్నలు చితికిపోయారు, రైతుల అప్పులు, ఆత్మహత్యల్లో రాష్ట్రం నెం 1 స్ధానంలో ఉంది.
• టీడీపీ అధికారంలోకి రాగానే రైతులను అన్ని విధాల ఆదుంకుంటాం.
• బీసీలకు రక్షణ చట్టం తెస్తాం, బీసీలను అన్ని విధాల ఆదుకుంటాం, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందిస్తాం.
• ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు ఆర్దికంగా ఆదుకుంటాం.
• జగన్ పని అయిపోయింది, రేపు జరిగే కురుక్షేత్ర యుద్దంలో వైసీపీ ఓటమి ఖాయం
• టీడీపీ జనసేన పొత్తు ప్రకటనతోనే వైసీపీ పని అయిపోయింది, వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు
• ఎమ్మెల్యేలను ట్రాన్స్ పర్ చేస్తున్నారు, ఇక్కడ అవినీతి చేశాడని మరో నియోజకవర్గానికి పంపిస్తారా?
• పనికిరానివాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు కాదు, రాజకీయాలకు పనికి రాని వ్యక్తి జగన్
• జగన్ క్యారెక్టర్ ఇప్పటికీ అర్దం కావటం లేదు, ఎంతో మంది రాజకీయ నాయకులను చూశా, కానీ ఇంత విచిత్రమైన వ్యక్తిని చూడలేదు
• మన ఆస్తులకు, ప్రాణాలకు, ఆడబిడ్డలకు రక్షణ కావాలంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి.
• ఒక్క ఓటు వైసీపీకి వేసినా రాష్ట్రానికి శాపంగా మారుతుంది, ఇప్పటికే 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు
• రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు, టీడీపీ జనసేన ఓట్లు తొలగిస్తున్నారు, మన ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
• ప్రతి ఒక్కరూ మీ ఓట్ చెక్ చేసుకోండి, మీ ఓటు ద్వారా ఈ రాష్ట్రాన్ని కాపాడండి
• ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా….మీరు ఒక అడుగేస్తే మేం వంద అడుగులు ముందుకేస్తాం.
• మీరు ముందుకు రాకుంటే భావితరాల భవిష్యత్ ప్రశ్నార్దకంగా మారుతుంది
• కష్టపడి మీరు చదివించిన మీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా మీలాగే కూలీ పనులు చేయాలా?
• నిత్యసవర ధరలు పెరిగిపోయాయి, 5 ఏళ్లలో మీ జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగాయా?ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయో ఆలోచించండి
• యువతకు బంగారు భవిష్యత్ కావాలంటే మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి
• 100 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల తర్వాత మీ భవిష్యత్ ని ఉజ్వలంగా మార్చే భాద్యత టీడీపీ జనసేన తీసుకుంటుంది.
• రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి, మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు, వాళ్లు సరెండర్ అయ్యారు
• అంగన్ వాడీలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవటం లేదు
• ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇచ్చాం, మళ్లీ ఉద్యోగస్తులకు న్యాయం చేస్తాం
• టీడీపీ జనసేన పొత్తు చరిత్రాత్మకం ఇది రాష్ట్రానికి అవసరం
• పోత్తు సూపర్ హిట్, జగన్ సినిమా అయిపోయింది, వైసీపీ మునిగిపోయేపడవ అది మునిగిపోవటం ఖాయం
• టీడీపీ జనసేన అదిష్టానాలు ఏ నిర్ణయం తీసుకున్నా..కార్యకర్తలు వాటిని పాటించండి
• 100 రోజులు కష్టపడండి, కష్టపడ్డ వారందరికీ గుర్తింపు ఇచ్చే బాధ్యత మాది
• వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేసి మీ రుణం తీర్చుకుంటాం.