మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు… ముఖ్యమంత్రి జగన్ ని

– తల్లి, చెల్లికి గౌరవం ఇవ్వని వాడు, మన ఇంటిలో ఆడపడుచులకు ఏం గౌరవం ఇస్తాడు
– భారీసభ ఏర్పాటుచేసి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తాం
– మాటకు,మైత్రికి చాలా విలువ ఇస్తా
– లోకేష్ యువగళం జగన్ లాంటి ఆషామాషీ పాదయత్ర కాదు, మాటల యాత్ర కాదు, చేతల యాత్ర
– నవశకం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

యువగళం సభకు ఆహ్వానించిన కింజరపు అచ్చెన్నాయుడు, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు, యువనాయకులు నారా లోకేష్ కు, టిడిపి పెద్దలు, తెలుగుమహిళలు, తెలుగుదేశం కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్సుమాంజలి. పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన శ్రేణులు, వీరమహిళలకు శుభాభివందనం. సోదరుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక అభినందనలు.

నన్ను సభకు ఆహ్వానించినపుడు నేను ఒకటే చెప్పాను, 226రోజులు, 3132 కి.మీ. నడిచినందున యాత్ర ముగింపుసభలో ఆయనే ఉండాలి అన్నాను. నువ్వు ఉండాలని లోకేష్ ఆహ్వానించాను, నాలుగుదశాబ్ధాల సుదీర్ఘ అనుభవజ్ఞుడు చంద్రబాబు కోరడంతో ఇక్కడకు వచ్చాను. లోకేష్ యువగళం జగన్ లాంటి ఆషామాషీ పాదయత్ర కాదు, మాటల యాత్ర కాదు, చేతల యాత్ర. ఈ సందర్భంగా లోకేష్ కు అభినందనలు.

నేను నడుద్దామంటే నడిచే పరిస్థితిలేదు, పాదయాత్ర వల్ల చాలామంది కష్టసుఖాలు తెలుసుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు రానందుకు బాధపడుతున్నా. లోకేష్ దిగ్విజయం పూర్తిచేసినందుకు ఆనందంగా ఉంది. బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పొట్టిశ్రీరాముల బలిదానం త్యాగ ఫలం, భారతదేశానికి స్పూర్తినిచ్చిన నేల ఇది. గతంలో ఐఎఎస్ లు, ఐపిఎస్ లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రావాలి ఉవ్విళ్లూరేవారు. ఐఎఎస్ అకాడమీల్లో ఎపి మోడల్ స్టేట్ వెళ్లాలని చెప్పేవారు, ఇప్పుడు ఎందుకు వెళ్లకూడదో జగన్ మోడల్ చూపిస్తున్నారు.

చంద్రబాబును అన్యాయంగా జైలులో పెట్టినపుడు చాలా బాధ కలిగింది. కష్టాల చిన్నప్పుడు నుంచి దగ్గరగా చూసిన వాడ్ని, ఓటమి ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో నాకు తెలుసు. భువనేశ్వరి గారి బాధను అర్థం చేసుకున్నాను. కష్టాల్లో ఉన్నపుడు నావంతు సాయంగా రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపాను. ఎన్ డిఎలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును అరెస్టుచేసి, జైలుకు పంపడం నన్ను బాధించింది. జగన్ ను జైలులో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే, చంద్రబాబుపై కక్షగట్టారు.

రాజధాని లేకుండా, సరైన పంపకాలు లేకుండా విభజన జరగడంతో రాష్ట్ర భవిష్యత్తుకోసం ఆనాడు టిడిపి సంకీర్ణానికి మద్దతు ఇచ్చాను. అప్పట్లో ఒక దశాబ్ధకాలం పాటు అండగా నిలుద్దామని భావించాను. దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాలవల్ల 2019లో ముందుకు తీసుకెళ్లలేకపోయాను. ఆ లోటు తాలూకు ఫలితమే జగన్ ప్రభుత్వం వచ్చింది. దశాబ్ధ కాలంపాటు సుదీర్ఘ రాజకీయ నేత కావాలని భావించాను, దురదృష్టవశాత్తు మిస్ అయ్యాం. 2024లో మనం ప్రభుత్వం స్థాపిస్తున్నాం, మార్పు తెస్తున్నాం, జగన్ ను ఇంటికి పంపిద్దాం.

పాతికమంది ఎమ్మెల్యేలను మార్చారు, మరో 80మందిని మారుస్తారని విన్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు… ముఖ్యమంత్రి జగన్ ని. నాకు జగన్ పై వ్యక్తిగత కక్షలేదు. ప్రభుత్వాన్ని సమర్థంగా నడపాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ఎదురు తిరిగితే కేసులు పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటుందని భావించలేదు. మేము ఒక రాజకీయపార్టీగా ఆయన ముఖ్యమంత్రి అయితే శుభాకాంక్షలు చెప్పాం, ఆయనకు మాత్రం ప్రజాస్వామ్య స్పూర్తి తెలియదు. మేం ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే నీచంగా తిట్టించడం దారుణం, దశాబ్ధాల రాజకీయ జీవితంలో వైఎస్ కూడా ఆడపడుచులను, ఇంటికి బయటకు రాని వ్యక్తులను విమర్శించలేదు, ఇది ఏం రాజకీయం?

ఇంటిలో ఉన్న తల్లి, చెల్లికి గౌరవం ఇవ్వని వాడు, మన ఇంటిలో ఆడపడుచులకు ఏం గౌరవం ఇస్తాడు, 30వేలమంది ఆడపడుచులు మాయమైతే పట్టించుకోని వాడు మహిళల కష్టాలను ఏం పట్టించుకుంటాడు, ఎన్ సిఆర్ బి నివేదిక ప్రకారం గతఏడాది ఒక సంవత్సరంలో 10వేలమంది అదృశ్యమయ్యారు

వైసిపి వాలంటీర్లు ఆడపడుచుల డాటా సేకరిస్తున్నారు, మాట్లాడాలని పెద్దలు చెప్పినపుడు నేను నమ్మలేదు. వాస్తవాలు తెలుసుకున్నాక నేను వైసిపి వాలంటీర్ వ్యవస్థపై గళమెత్తాను. ఒంటరి మహిళలు, ఆడవాళ్లు, భర్తలేనివారు అన్యాయానికి గురవుతుంటే తెగించి మాట్లాడాను. వారాహి యాత్ర ప్రారంభమైతే నాపై కువిమర్శలు చేశారు, విశాఖపట్నంలో ఎయిర్ పోర్టునుంచి పార్టీ కార్యక్రమాలకు వస్తుంటే పోలీసులతో అడ్డగించారు. ఒక ఉన్నతస్థాయి అధికారి నాతో నీచంగా ప్రవర్తించారు. ఆ అధికారి స్పీకర్ ఫోన్ నొక్కుకుపోగా సకలశాఖ మంత్రి నన్ను అడ్డగించాలని డైరక్షన్ ఇచ్చారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబులాంటి వారికే ఇలాంటి పరిస్థితి వస్తే, భవిష్యత్తులో సామాన్యుడి పరిస్థితి ఏమిటి? రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఎలా వస్తాయి?

ఇప్పటం సభలో వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాను. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి పెట్టుబడుల రావాలని భావించి నేను ఆ మాటలు అన్నాను. ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యతుతను నిర్దేశించే క్షణాలు. బిజెపిని మోసం చేశానని నన్ను వైసిపి నేతలు విమర్శించారు. అయితే నేను ఏపీ పరిస్థితులను బిజెపి జాతీయ నాయకత్వానికి వివరించాను. ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడితే నోరునొక్కుతున్నారు. సినిమా టిక్కెట్ల విషయంలో కూడా కుట్రతో అప్రజాస్వామ్యంగా వ్యవహరించారు. టీడీపీ-జనసేన పొత్తుకు మీ మద్దతు కావాలని అమిత్ షాకు తెలియజేశాను. వారు ఎంతవరకు ఒప్పుకుంటారో తెలియాదు.

వైసిపి గూండాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు, ఆడపడుచులను అగౌరవపర్చేవారికి నేను ఒకటే చెబుతున్నా. మీ బెదిరంపులకు మేం భయపడం. రాబోయే ఎన్నికల పొత్తు కీలకమైంది. పొత్తుపెట్టకోకపోతే భవిష్యత్తులో కర్రలు, కత్తులతో రోడ్లపైకి వచ్చి కొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నాతో సహా అందరం ఆయుధాలతో రోడ్లపైకి రావాల్సి వస్తుందని బిజెపి కేంద్రనాయకత్వానికి చెప్పాను. వైసీపీ వస్తే కొండలు, గుట్టలను దోచేస్తారు, వారికి ప్రజాస్వామ్యంపై గౌరవంలేదు. పొత్తు సాధ్యమైనంత ఎక్కువకాలం ఉండాలని మనస్పూర్తిగా ఆకాంక్షస్తున్నాను. జనసేన ఆలోచన విధానంపై లోకేష్ తో మాట్లాడాను. భవిష్యత్తులో ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తాం.

రోడ్లు, హెల్త్ కేర్, యువతకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ పై నిర్ణయం, పోలీసు శాఖ సంస్కరణలు, టీచర్ ఉద్యోగాల భర్తీ, వ్యవసాయం లాభసాటిగా మార్చడం, సంక్షేమ హాస్టల్ స్థితగతులను మార్చడం, మత్స్యకారులు, గిరిజనులకు ఎలాంటి పథకాలు ఉంటే వారి జీవితాలు మారతాయి, బిసిలకు ఎలా అండగా ఉండాలనే విషయమై కసరత్తు చేస్తున్నాం. చంద్రబాబు, నేను కలిసి రానున్నరోజుల్లో భారీసభ ఏర్పాటుచేసి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తాం.

ఇది లోకేష్ సభ కాబట్టి కుదించి మాట్లడుతున్నాను. నేను మాటకు,మైత్రికి చాలా విలువ ఇస్తాను, కష్టాలువస్తే ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడ్ని. టిడిపి అధినేత అరెస్టయినపుడు, వారి కుటుంబసభ్యులు, టిడిపి కేడర్ కొండంత కష్టంలో ఉన్నపుడు పరిస్థితులను అర్థం చేసుకున్నా. వ్యక్తి, వర్గప్రయోజనాలు దాటి సాటి మనిషిగా చంద్రబాబుకు, వారి కుటుంబానికి అండగా నిలబడ్డా. నేను ఆలోచిస్తున్నది 5కోట్లమంది రాష్ట్ర భవిష్యత్తు తప్ప వేరే ఆలోచన నాకు లేదు. ఈ మైత్రి, స్పూర్తిని చాలాసంవత్సరాలు కొనసాగాలని ఆశిస్తున్నాను. హలో ఎపి… వైసిపి బైబై, టిడిపి-జనసేన మైత్రి వర్థిల్లాలి. టీడీపీ-జనసేన మైత్రికి బిజెపి అధినాయకత్వం మద్దతునిస్తుంది ఆశిస్తున్నాను.

Leave a Reply