Suryaa.co.in

Andhra Pradesh

ఒక సైకో ప్రజలపై పెత్తనం చేస్తున్నాడు

-సమర్థతలేని చెత్తప్రభుత్వాన్ని చూస్తున్నాం
-ప్రజల్నీ ఉద్ధరించింది లేదు
-పవన్ కల్యాణ్ నేను ముక్కుసూటి మనుషులం
-‘యువగళం – నవశకం’ విజయోత్సవ సభలో టీడీపీ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ

“ మేటి ప్రజాశక్తి.. మహానాయకుల కలయికకు వేదికగా మారిన ఈ సభ నభూతో..నభవిష్యత్ గా నిలుస్తుంది. లోకేశ్ ప్రజలందరినీ కలుస్తూ.. వారికి ధైర్యం చెబుతూ.. ముందుకు సాగిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగియలేదు. ఇక నుంచే ఎన్నికల సమరం మొదలైంది. ఇది అంతం కాదు… ఆరంభం. అధికారంలో ఉన్న వైసీపీ చేస్తున్న అక్రమాలు.. దౌర్జన్యాలు .. దుశ్చర్యలకు తగిన గుణపాఠంగా నిలిచింది.

చరిత్రలో చూస్తే మనకు ఎదురై న అనేక అవాంతరాలు..అడ్డంకులు.. ఘటనల్ని ఎలా ఎదిరించి నిలిచామో తెలుస్తుంది. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మాట్లాడనివ్వకుండా మైక్ లాక్కున్నారు.. ప్రజల్లో నిలబడకుండా చేశారు. ప్రభుత్వ అడ్డంకులు.. అవమానాలు అధిగమించి ముందుకు సాగిన లోకేశ్ ను అభినందిస్తున్నాను. అతనికి సహకరిస్తూ.. పాదయాత్ర విజయవంతం కావడంలో తమవంతు పాత్ర పోషించిన ప్రతి ఒక్కరినీ అభినం దిస్తున్నాను.

పవన్ కల్యాణ్ జనసేన స్థాపించినప్పటినుంచీ ప్రజలకోసం పోరాడుతూనే ఉన్నారు ఎన్టీఆర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు .. ఎవరి రుణం ఉంచుకోకూ డదని. పవన్ కల్యాణ్..నేను కేవలం నటులం మాత్రమే కాదు. ఈ సమాజ పౌరులుగా మాకున్న బాధ్యతలు నెరవేర్చాలి. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పటినుంచీ ప్రజలకోసం పోరాడుతూనే ఉన్నారు. సినిమాల్లో కంటే ఎక్కువగా రోడ్లపైనే కనిపిస్తున్నారు.

తన తెలివితేటలతో చంద్రబాబు విజనరీ నాయకుడిగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు చంద్రబాబు దూరదృష్టితో అనేక కార్యక్రమాలు చేపట్టారు. మహిళల్ని ఆర్థికంగా .. సామాజికంగా బలోపేతం చేయడానికి డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు. యువతకోసం ఐటీ సాంకేతిక పరిజ్ఞానం అందించారు. తన తెలివితేటలతో ప్రపంచానికే ఆదర్శంగా విజనరీ నాయకుడిగా నిలిచారు. అలానే స్వర్గీయ ఎన్టీఆర్ గారు ప్రజలకోసం అమలుచేసిన పథకాలు ఎంతో సుసాధ్యమైనవి. ఆయన తర్వాత వచ్చేవారు తన పథకాలు అనుకరించేలా చేశారు. అందుకే అన్నగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు.

రాష్ట్రంలో సమర్థతలేని చెత్తప్రభుత్వాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో సమర్థతలేని చెత్త ప్రభుత్వాన్ని చూస్తున్నాం. పోలవరాన్ని సంవత్సరంలోపు పూర్తిచేస్తామన్నారు… నాలుగున్నరేళ్లు అయినా చేయలేని చెత్తప్రభుత్వంగా మిగిలింది. అభివృద్ధి శూన్యం. నిత్యావసరాలు.. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. వైసీపీ పాలన అంతా కల్తీ మద్యం.. గంజాయి.. మాదకద్రవ్యాల మయం.

వైసీపీనేతలు ల్యాండ్, శాండ్, ఇతర కుంభకోణాలతో కోట్లు కొల్లగొడుతున్నారు. అమరావతిని గాలికి వదిలేసి రాష్ట్రా నికి రాజధాని లేకుండా చేశారు. అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసి జైళ్లకు పంపారు. ఈ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిపోయింది. జగన్ తెలంగాణకు వెళ్లాలనుకుంటే అక్కడి ప్రజలు సరిహద్దుల్లోనే ఆయన్ని అడ్డుకుంటారు.

ఉద్యోగులు..  ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు కూడా జగన్ నెరవేర్చలేదు. అందరిపై పెత్తనం చేయడం.. అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నా రు. హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రిస్థాయిలో తీర్చి దిద్దాము. అలాంటి ఆసుపత్రిని ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ఎక్కడా రాష్ట్రంలో ఒక్క రోడ్డు వేసిందిలేదు. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. కనకపు సింహాసనంపై శునకం అన్న రీతిలో ఒక సైకో ప్రజలపై పెత్తనం చేస్తున్నాడు.

తెలంగాణ ప్రభుత్వం గతపాలకుల సాగించిన అభివృద్ధిని కొనసాగించింది. ఎక్కడా ఏమీ నష్టపరచలేదు. జగన్ రెడ్డిని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే అక్కడి ప్రజలు సరిహద్దుల్లోనే అడ్డుకుంటారు. రాష్ట్ర ప్రజల్లో ఒక ఉద్యమం రావాలి. కులాలు.. మతాలు.. ప్రాంతాలకు అతీతంగా అందరూ రాష్ట్రంకోసం ఒక్కటవ్వాలి. మన రాష్ట్రాన్ని చూసి ఇప్పటికే పొరుగు రాష్ట్రాలు అవహేళన చేస్తున్నాయని తెలుసుకోండి. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. చంద్రబాబు తెలుగువారి శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటారు. ఇక మనకు సమయం లేదని గుర్తుంచుకోండి. ఉచిత పథకాల మాయలో పడకుండా..ప్రజలంతా ముందుకు రావాలి. రాష్ట్రాన్ని ఈ సైకో సర్వ నాశనం చేశాడని తెలుసుకోండి.

జగన్ బావిలో కప్పమాదిరి రాష్ట్రాన్ని మార్చాడు
వైసీపీలో జరుగుతున్న సీట్ల మార్పిడిపై సొంతపార్టీ నేతలు కూడా జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. సామాజిక న్యాయం అనేది లేకుండా దళితులు… బీసీలనే జగన్ మారుస్తున్నాడు. యువతను మత్తుపదార్థాలకు బానిసల్ని చేశాడు. రాష్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి.. ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారంటే ప్రభుత్వం నుంచి సమాధానంలేదు. టీడీపీ ప్రభుత్వం పేదలకోసం కట్టించిన టిడ్కో ఇళ్లను నిరుపయోగంగా మార్చాడు. బావిలో కప్ప.. ఆ బావే సర్వస్వం అనుకున్నట్టు రాష్ట్రంలో పరిస్థితిని మార్చాడు. నాలుగున్నరేళ్ల పాటు ఈ ముఖ్యమంత్రి ఎవరికీ ఏమీ చేసింది లేదు. ప్రజల్నీ ఉద్ధరించింది లేదు.

పవన్ కల్యాణ్ నేను ముక్కుసూటి మనుషులం.. ప్రజలకోసం ఎంతకైనా తెగిస్తాం
టీడీపీ-జనసేన కలయిక మహా కలయిక. పవన్ కల్యాణ్..నేను ఇద్దరం ముక్కుసూటి మనుషులమే. ప్రజలకోసం మేం ఎంతకైనా తెగిస్తాం. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రానికి.. తెలుగుజాతికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు.. పిల్లల భవిష్యత్ కోసం కలిసి పోరాడదాం.. కలిసి ఉద్దమిద్దాం. అడ్డొచ్చిన వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో చెబుదాం.” అని బాలకృష్ణ తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE