Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధి చేయలేనని చేతులెత్తేసిన జగన్ రెడ్డి

• కొత్త సీసాలో పాత సారాలా వైసీపీ మేని ఫెస్టో
• చేయగలిగినవే చెబుతున్నామంటూ చేతగాని మాటలు
• అవ్వాతాతాలకు, అమ్మఒడి తల్లులకు షాక్
• ఉద్యోగాలు, ఉపాధి, సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి, పరిశ్రమలు, ప్రత్యేక హోదా ఊసెత్తని వైసీపీ
– వైసీపీ మేని ఫెస్టో పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ నేత జీవిరెడ్డి

వైసీపీ మేనిఫెస్టో చూస్తే అభివృద్ధి చేయడం చేతగాదని జగన్ రెడ్డి చేతులెత్తేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. జగన్ రెడ్డి మేని ఫెస్టో కొత్త సీసాలో పాత సారాలా ఉంది. అని టీడీపీ నేతలు ఎమ్మెల్సీ అశోక్ బాబు, జీవీరెడ్డిలు అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ… మేనిఫెస్టో పేరుతో జగన్ రెడ్డి మరోసారి జనాన్ని మోసం చేస్తున్నాడు. 2019 అంకెను – 2024 గా మర్చి చేయగలిగినవే చెబుతానంటూ చేతకాని మాటలు మాట్లాడుతున్నాడు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల ముందు జగన్ మేనిఫెస్టో తేలిపోయింది. అవ్వాతాతలకు జగన్ రెడ్డి మేని ఫెస్టోతోనే షాక్ ఇచ్చాడు. మరో నాలుగేళ్లపాటు నెలకు రూ.3000 మాత్రమే ఇస్తానంటూ చెబుతున్నాడు. 2028లో 250 మాత్రమే పెంచుతానన్నాడు. మరోవైపు అధికారం వచ్చిన వెంటనే అవ్వాతాతలకు చంద్రబాబు రూ.4000 వేలు ఇస్తానని భరోసా ఇచ్చారు.

2019లో మద్య పాన నిషేదం చేస్తే గాని ఓటు అడగనని చెప్పిన జగన్ రెడ్డి 2024 మేని ఫెస్టోలో మద్యపాన నిషేధం గురించి అసలు ఊసెత్తలేదు. నాడు 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని డంబాలు పలికిన జగన్ రెడ్డి నేడు వైసీనీ మేని ఫెస్టోలో ప్రత్యేక హోదా మాటే పెట్టలేదు. అధికారంలోకి వచ్చిన ఒక్క సవంత్సరంలో పోలవరాన్ని పూర్తి చేస్తానన్న జగన్ రెడ్డి దాన్ని పూట్లోకి తోసి ఈ మేని ఫెస్టోలో అసలు పోలవరం గురించి ప్రకటించలేదు.

ఉద్యోగ ఉపాధి కల్పన పై కాకి లెక్కలు చెబుతూ.. రాష్ట్రంలో అందరికీ మంచి జరిగిందంటూ పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. కాపు నేస్తం నగదు జమ చేయకుండానే పెంపు అంటూ కాపులు మోసం చేస్తున్నాడు. సామాజిక భద్రత పేరుతో జిమ్మిక్కులు చేస్తూ.. 2019 మేనిఫెస్టో లో 99 శాతం హామీలు అమలు చేశానంటూ గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. జగన్ రెడ్డి మేనిఫెస్టోను చూసి వైసీపీ శ్రేణులే తీట్టుకునే పరిస్థితి వచ్చింది.

జీవి రెడ్డి మాట్లాడుతూ… ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ రూ.2.20 లక్షల కోట్లు కాగా.. రానున్న ఐదేళ్లలో రూ.4 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అయినా పాత హమీలను కొనసాగిస్తామని చెప్పడం సిగ్గు చేటు. ఇంతే ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం చూస్తే చేతకాక జగన్ రెడ్డి చేతులెత్తేశాడని పూర్తిగా అర్థం అవుతుంది.

2014 -2019 లో జగన్ రెడ్డి రైతులకు ఇచ్చింది 37,500 మాత్రమే. అది టీడీపీ హయాంలో యావరేజ్ గా ఒక్క రైతుకు రూ. 75 వేల వరకు రుణమాఫి చేయడం జరిగింది. అదే 2019 బడ్జెట్ తీసుకుంటే లక్ష వరకు రుణమాఫి జరిగినట్లే. రైతు భరోసా రూ. 13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామన్నారు. అది కూడా కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి. టీడీపీ మేనిఫెస్టోలో అన్నదాత పథకం ద్వారా రైతుకు ఏడాదికి రూ.20 వేలు హామీ ఇవ్వడం జరిగింది.

వైసీని మేని ఫెస్టో పవిత్ర గ్రంథం అని చెప్పి పదే పదే అబద్దాలు చెబుతూ.. ఆ పవిత్ర బైబిల్, ఖురాన్, భగవ్ గీత గ్రంథాల్ని అపవిత్రం చేశాడు. మద్యనిషేదం చేసి ఓట్లు అడుగుతానన్న హామీపై మాట తప్పాడు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న హామీపై మడమ తిప్పాడు. ఇసుక, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తానన్న హామీని గాలికొదిలేశాడు. 25 లక్షల ఇళ్ళు నిర్మిస్తానని పేదలను వంచించాడు.

అంగన్వాడీ, ఆశా, హోంగార్డుల జీతాలు తెలంగాణా కన్నా రూ.1000 అదనంగా పెంచుతానని మోసగించాడు. మెగా డీఎస్పీపై మాట తప్పాడు. అధికారంలోకి వచ్చిన నెలకే సీపీయస్ రద్దు అన్నాడు. ఐదేళ్ల అధికారం పూర్తి అయినా చేయలేదు. ఇలా 85% హామీల అమలుపై మాట తప్పి మడమ తిప్పి పైగా 99% పైగా అమలు చేశానని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి మేని ఫెస్టోనే చెబుతుంది జగన్ రెడ్డికి ఓటమి ఖాయం అయ్యిందని

టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.68 వేల కోట్లు ఖర్చు చేస్తే. జగన్ ఖర్చు చేసింది కేవలం రూ.30 వేల కోట్లు మాత్రమే. రూ.5 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించి 5.13 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధిని చంద్రబాబు ప్రభుత్వం నాడు కల్పించింది. టీడీపీ ప్రభుత్వంలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మించించారు. ఈ విధంగా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో చంద్రబాబు ప్రభుత్వం జగన్ కన్నా ఎంతో ఎక్కువ చేసిందనేది నిజం. జనాలను మోసం చేస్తున్న జగన్ కు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి.

LEAVE A RESPONSE