భీమవరం: యువ ఇంజనీర్లలో వినూత్న ఆలోచనలను కార్యరూపం దాల్చెందుకు స్టార్టప్ హౌస్ ప్రోత్సాహాన్ని అందిస్తుందని స్టార్టప్ హౌస్ వ్యవస్తాపకలు , సిఇఒ డా.పి.వినోద్ కమార్ పేర్కొన్నారు. . మంగళవారం భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో యవ ఇంజనీర్లు ఆలోచనలకు వాస్తవరూపం వచ్చెవిధంగా ఆడిసన్ నిర్వహించారు.
ఈసందర్భంగా ఐటి కంప్యూటర్స్ విభాగం నండి వచ్చిన పలువురు విద్యార్దలు మాట్లాడుతూ ప్రధానంగా సైబర్ సెక్యూరిటీపై పరిశోధనల పట్ల ఆసక్తి కనబర్చారు. ప్రస్థుత పరిస్థితల్లో దీని అవశ్యక్త ఎంతో ఉందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడతూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో విద్యార్దల నుండి వినూత్న ఆలోచనలతో మందుకు వచ్చిన వార్ని ఒక వేదిక పైకి తీసుకొచ్చి అక్కడ విజేతగా నిలిచిన విద్యార్ధికి రు. కోటి రూపాయలలతో స్టార్టప్ ప్రారంభించేందుకు వివిధ సంస్థలతో సహకారం అందించటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈసందర్భంగా కళాశాల సిఇఒ ఎస్.ఆర్.కె.నిశాంతవర్మ మాట్లాడుతూ భారతదేశంలో 113 బిలియన్స్ ప్రజల ఉండగా అందులో 50శాతం మంది యువతీ యువకులేనన్నారు . వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకొని, మంచి స్టార్టప్స్ ప్రారంభించాలన్నారు.
కళాశాల సెక్రటరి అండ్ కరస్పాండెంట్ సాగి విఠల్ రంగరాజు మాట్లాడుతూ యువతలో కొందరు మంచి కంపెనిల ప్రారంబించి,మరికొందరు మంచి ఉద్యోగాలు చేసి దేశపునర్ నిర్మాణంలో బాగస్వామల కావాలని కోరారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. జగపతిరాజు మాట్లాడుతూ భారతదేశ నూతన విద్యావిధానంలో ప్రతి ఒక్కరు విధ్యార్ధి దశనండె సాంకేతిక శిక్షణ పొందాల్సి ఉందన్నారు.. కళాశాల ప్లేస్ మెంట్ సెల్ డీన్ కె.ఆర్.సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో డా.బి. హెచ్.వి.ఎన్. లక్ష్మి, స్టార్టప్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఎం.వేణుగోపాల్ తదితరలు పాల్గొన్నారు.