– ఏ ఒక్క దళిత కుటుంబానికైన పది లక్షల రూపాయలు ఇచ్చారా ?
– ఏమాత్రం సిగ్గు లేకుండా బీజేపీ వాళ్లు పాదయాత్రలు చేస్తున్నారు
– ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
మెదక్ జిల్లా అందోల్ నియోజక వర్గంలో రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దళితబంధు కింద లబ్ధిదారులైన దళితులకు యూనిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ”ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైన ఏ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రంలోనైన కేసీఆర్ ఇచ్చిన దళితబంధు పథకం అమలు చేస్తున్నారా.మీ ముఖాలకు ఎన్నడైన ఏ ఒక్క దళిత కుటుంబానికైన పది లక్షల రూపాయలు ఇచ్చారా .? మీ ముఖానికి ఇవ్వాలని తెలివి ఉందా.. ఎన్నడైన లక్ష రూపాయలు ఇచ్చారా?
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద ఎస్సీలకు ఇరవై లక్షలు ఇస్తున్నాం ఏ బీజేపీ పాలిత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా అని ప్రశ్నించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచే ప్రభుత్వం .తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పంచే ప్రభుత్వం.టీఆర్ఎస్ ప్రభుత్వం సంపదను పెంచింది. పేదలకు పంచింది.కానీ కేంద్ర ప్రభుత్వం సంపదను పెంచి పెద్దోళ్లకు పంచుతుంది.కార్పోరేట్లకు పంచింది.పారిశ్రామికవేత్తలకు పంచుతుంది. పేదల ఉసురు పోసుకుంటుంది.బీజేపోళ్లకు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే పేదలకు పంచండి,.పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించండి..లేదా పేదలకు సబ్సిడీ ఇవ్వండి. గతంలో ఉన్ననాలుగొందల సబ్సిడీని నలబై రూపాయలకు తగ్గించారు.సబ్సిడీని ఎగబెట్టిండ్రు.. ధరలను మాత్రం పెంచిండ్రు.
దేశంలో పేదరికం పెరగడానికి కారణం బీజేపీ ..కాంగ్రెస్ పార్టీలే.ఒక పార్టీనేమో ఎస్సీలను రాజకీయం కోసం వాడుకుంటున్నారు.ఇంకొ పార్టీనేమో ఓట్ల కోసం వాడుకుంటున్నారు తప్పా డెబ్బై ఏండ్ల స్వాతంత్ర భారతంలో ఎస్సీ,బీసీ ,ఎస్టీల జీవితాలను ఎందుకు మార్చలేదు.వాళ్ల జీవితాల్లో వెలుగులు తీసుకురాలేకపోయారు. ఎందుకు వాళ్ల జీవితాలను ఎందుకు మార్చలేదు.బీజేపోళ్లకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి. దాని కోసం నిధులు కేటాయించండి . బీసీల్లో ఉన్న పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేయండి.
పక్కన ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రంలో పింఛన్ ఆరు వందల రూపాయలు. మన దగ్గర రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాం.ఇక ఏ ముఖం పెట్టుకుని బీజేపోళ్లు మాట్లాడుతున్నారు..వీళ్లు వచ్చి ఇక తెలంగాణను ఉద్దరిస్తరంట.కర్ణాటక రాష్ట్రంలో కరెంటు లేదు. ఆగమైపోతూ పంటలు ఎండిపోతున్నాయి. ఐదారు గంటలు కూడా కరెంటివ్వడం లేదు.కరెంటు సక్కగా లేదు. ఆరు వందలు పించన్ ఇస్తారు. దళితబంధు లేదు. రెసిడెన్సియల్ స్కూల్స్ లేవు.కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు ఇవ్వరు.తెలంగాణ బీజేపోళ్లు మాట్లాడే ముందు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి మాట్లాడండి.తెలంగాణలో అమలై ఒక్క పథకమైన కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలుచేస్తున్నారా.
బీజేపీ వస్తే ఏముంది మతకల్లోలు తప్పా? ప్రజల సంక్షేమం పట్టని పార్టీ బీజేపీ పార్టీ.ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందటం తెల్సిన పార్టీ బీజేపీ పార్టీ .పేదల గురించి ఆలోచించరు.ఏమిచ్చింది బీజేపీ సిలిండర్ ధర వెయ్యి యాబై రూపాయలు చేసింది. మళ్లీ కట్టల పొయ్యిలు వాడే పరిస్థితులోచ్చాయి.ఏమాత్రం సిగ్గు లేకుండా బీజేపీ వాళ్లు పాదయాత్రలు చేస్తున్నారు.గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి యాబై రూపాయలు పెంచినందుకు పాదయాత్రలు చేస్తున్నారా.పెట్రోల్ డిజిల్ ధరలు పెంచుతున్నందుకు పాదయాత్రలు చేస్తున్నారా.పేదల ఉసురు పోసుకున్న పార్టీ బీజేపీ.దేశంలో పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీలుంటే భర్తీ చేయకుండా నిరుద్యోగులనుమోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని మంత్రి హరీష్ రావు బీజేపీ పై ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.