– సెమినార్ లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
వాజ్ పేయి జయంతిని పండుగలా నిర్వహించుకుంటూ వారి జ్ఝాపకాలను నెమరవేసుకోవడం ఆనందంగా ఉంది. నేటి తరానికి, భావి తరాలకు వాజ్ పేయి చరిత్రను వివరించాల్సిన అవసరం ఉంది.వాజ్ పేయి చాలా అరుదైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు. వాజ్ పేయి హయాంలో అనేక అద్బుత కార్యక్రమాలు నిర్వహించారు. వాజ్ పేయి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వాజ్ పేయికి వ్యక్తిగతంగా సేవ చేసే అవకాశం నాకు దక్కింది.
వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రోక్రాన్ అణు పరీక్షలు, పొదుపు సంఘాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం, ఎవరూ ఊహించని విధంగా జాతీయ రహదారుల నిర్మాణం వంటి అద్భుత కార్యక్రమాలు నిర్వహించారు.కార్గిల్ యుద్దంలో వాజ్ పేయి పోషించిన పాత్ర మరువలేనివి. వైరుధ్యమున్న 24 పార్టీలతో కలిసి అద్భుత పాలన అందించిన మహానేత వాజ్ పేయి. మహోన్నత పరిపాలనాదక్షుడు. వాజ్ పేయి ఉపన్యాసం కోసం ఇతర పార్టీల నేతలు కూడా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఉదాహరణలున్నాయి. మంచి కవి.
అలాంటి మహానేత మనకు స్పూర్తిదాతగా ఉండటం మనం అదృష్టవంతులం. వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని ‘సుపరిపాలన దినోత్సవం’గా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా సుపరిపాలన అందించిన ఘనత వాజ్ పేయి ప్రభుత్వానిదే. వాజ్ పేయి ఆశయ సాధన కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. వాజ్ పేయి ప్రారంభించిన కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా ముందుకు తీసుకెళుతోంది.
నవ శకానికి నాంది పలుకుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం. ధనవంతులకే ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్లు ఉండేవి. పేదలకు గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత వాజ్ పేయి ప్రభుత్వానికే దక్కుతుంది. సెల్ ఫోన్ విప్లవం మొదలైంది వాజ్ పేయి హయాంలోనే . వాజ్ పేయి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన సిద్దాంతాలను మనసా వాచా నమ్ముతూ పేదలకు సేవ చేయడమే వాజ్ పేయికి అందించే ఘన నివాళి.