Suryaa.co.in

Telangana

తెలంగాణలో నిజాం రజాకార్ల పాలన కొనసాగుతోంది

-చత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్

తెలంగాణలో నియంతృత్వ రాజ్యం నడుస్తోందని చత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణసింగ్ ధ్వజమెత్తారు. కరీంనగనర్ ఎంపీ, బీజేపీ చీఫ్ బండి సంజయ్ నివాసానికి వెళ్లిన రమణసింగ్ ఆయనను పరామర్శించారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రమణసింగ్, తెరాస సర్కారుపై విరుచుకుపడ్డారు. ఆయనేమన్నారంటే..

వేలాది మంది బిజెపి కార్యకర్తలు బండి సంజయ్ నాయకత్వంలో పొరాడుతున్నారు. కరీంనగర్ లో పోలిసులు డెకాయిట్ల లాగా పనిచేశా‌రు. కార్యకర్తలను, మహిళలను కూడా చూడకుండా లాఠీ ఛార్జ్ చేసి
ramansingh1 గాయపర్చారు.ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుంటే కరీంనగర్ కమిషనర్ సహా బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలి. వారిపై కేసులు నమోదు చేయాలి.రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది . తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతోంది . బీజేపీ కార్యకర్తలు లాఠీలకు..బుల్లెట్లకు భయపడరు .. తెలంగాణలో వారు చూపుతున్న పోరాటానికి నా సెల్యూట్.

బీజేపీ క్రమశిక్షణ, చిత్తశుధ్ధితో పనిచేసే పార్టీ. తెలంగాణా నిజాం నియంతృత్వ, రజాకార్ల పాలన కొనసాగుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన 317జీ వో సవరించాలని బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణ శాఖ చేస్తున్న పోరాటం అభినందనీయం. నేను గతంలో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా తెలంగాణకు వచ్చాను. ఇక్కడి పరిస్థితులను గమనించాను.

కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్న విషయాన్ని తెలుసుకున్నాను. కేసీఆర్ నియంత పాలనను చరమ గీతం పాడేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ ఓడిపోయింది. ఓటమి తరువాత టీఆర్ఎస్ లో అసహనం పెల్లుబికుతోంది.ఎంపీ కార్యాలయంలోకి చొరబడి పోలీసులు ధ్వంసం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. తెలంగాణలో నిజాం రజాకార్ల పాలన కొనసాగుతోంది. ఇలాంటి పనులకు పోలీసులను ఉఫయోగించుకోవడం బాధాకరం.

ఈ సంఘటనలో మహిళలని చూడకుండా దాడి చేయడం హేయం. ఆ అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? హుజూరాబాద్ ఎన్నికల్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ ఓడిపోయింది. ఓటమి తరువాత టీఆర్ఎస్ లో అసహనం పెల్లుబికుతోంది. తెలంగాణలో ప్రజా వ్యతిరేక, నియంత పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదు.

LEAVE A RESPONSE