Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం వైఎస్సార్ సీపీ వైపే..

జారిపోతున్న క్యాడర్ ను కాపాడుకునేందుకు చంద్రబాబు తాపత్రయం
మధురానగర్ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఆర్.యు.బి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
మాది చేతల ప్రభుత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం వైఎస్సార్ సీపీ వైపే ఉంటుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మధురానగర్ లో రూ. 18 కోట్ల నిధులతో జరుగుతున్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పనుల పురోగతిని వైసీపీ కార్పొరేటర్లు కొంగితల లక్ష్మీపతి, పెనుమత్స శిరీష సత్యం గారితో కలిసి ఆయన పరిశీలించారు. పనులు
2 జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన ప్రణాళికల ప్రకారం పనులు జరగాలని.. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పరస్పరం చర్పించుకుని పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. పనుల నిర్వహణలో సమస్యలు ఏమైన తలెత్తితే తక్షణం తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. వరుస ఓటములతో తెలుగుదేశం నాయకుల మతిభ్రమించిందని అన్నారు. క్యాడర్ జారిపోకుండా ఉండేందుకే చంద్రబాబు మధ్యంతర ఎన్నికలంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే మధురానగర్ లో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి(ఆర్.యు.బి.) మంజూరై పనులు ప్రారంభించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం పనులలో పూర్తి నిర్లక్ష్యం వహించిందన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.

కరోనా తీవ్రత మరియు వర్షాకాలం కారణంగా పనులలో కొంత జాప్యం జరిగినట్లు వివరించారు. మరో 4 నెలల్లో పనులను త్వరితగతిన పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. ఈలోగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాఫిక్ సిబ్బందిని
6ఆదేశించారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా రహదారిలో ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతించే విధంగా సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పర్యటనలో నాయకులు పిల్లి మురళి, శనగశెట్టి హరిబాబు, ఉద్ధంటి సురేష్, కోలుకొండ శ్రీనివాసరావు, సీహెచ్. గోవింద్, ఎస్.గోవింద్, దేవినేని శివాజీ, దేవినేని సుధాకర్, విజయలక్ష్మి, చినబాబు, కిరణ్, ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE