తండ్రి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చేసిన స్కాములను, తనయుడు ముఖ్యమంత్రి అయ్యాక విభజిత రాష్ట్రంలో స్కీములుగా మార్చారు. పాలనలో సిస్టమ్స్ చేత, సిస్టమ్స్ ద్వా రా , సిస్టమ్స్ తోటి స్కాములని వారి అనుంగులకు స్కీములుగా మార్చవచ్చని నిరుపించిన నేటి రాష్ట్ర పాలకులు.
” ఇందుభూములు ” ” ఓబుళాపురంమైన్” కేటాయింపులు తండ్రి పాలననలో స్కాములు, నేడు తనయుని పాలనలో స్కీములుగా మారిపోయాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీగ ఏపీలో ఉంది.
గత మూడు సంవత్సరాలుగా ఏపీలో పాలకులు, వారి అనుంగుల మద్యం కంపెనీలతో చేసిన ఆర్థిక అరాచకం పై సీబీఐ, ఈడీ ల కన్ను పడింది.
నగదుతో మాత్రమే మద్యంషాపు ల నిర్వహణ తో సెకండ్ సేల్చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఎక్సైజ్, వ్యాట్ కూడా దోచుకున్నారు.
“ఇందు” కు నామమాత్రపు ధరకు రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చింది ఎందుకు? ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు?
” ఇందు ” కు ఇచ్చిన భూముల తనఖా ద్వా రా బ్యాంకుల నుండి తెచ్చిన డబ్బులు ఏ కంపెనీలకు బదిలీ చేశారు?
“ఇందు” కు ఇచ్చిన భూములను దేనికి వినియోగించారు? బ్యాంకుల నుండి భూములను తనఖా పెట్టిన డబ్బు వినియోగిస్తే, అక్కడ భూముల పైన జరగాల్సిన అభివృద్ది ఎందుకు జరగలేదు?
4,500 కోట్ల ” ఇందు ” రుణాలను 500 కోట్లుకు తగ్గించి, ఆ భూములను నొక్కి వేసి ప్రయోజనం పొందుతుంది ఎవరు?… ముఖ్యమంత్రి!
తండ్రి పాలనలో ఓబుళాపురం మైన్ స్కామ్ జరిగితే , ఇప్పుడు సుప్రీంకోర్ట్ లో అఫిడవిట్ తో తనయుడు పాలనలో స్కీమ్ గా స్కెచ్ వేసేశాడు.